newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

జాతీయస్థాయి నేతలు.. హిందూ ప్రతినిధులతో ఏపీలో బీజేపీ రథయాత్ర ప్లాన్

13-01-202113-01-2021 10:42:19 IST
2021-01-13T05:12:19.890Z13-01-2021 2021-01-13T05:11:40.188Z - - 24-01-2021

జాతీయస్థాయి నేతలు.. హిందూ ప్రతినిధులతో ఏపీలో బీజేపీ రథయాత్ర ప్లాన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఛాన్స్ పోతే రాదు. వ‌చ్చిన ఛాన్స్ ని వ‌దులుకుంటే అమాయ‌కత్వం అవుతుంది. అదే ప్లాన్ తో ఉంది బీజేపీ. ఏ మాత్రం వెన‌క్కి త‌గ్గ‌డం లేదు. దేవాల‌యాల‌పై దాడులను వీలైనంత హైలైట్ చేయాల‌ని చూస్తోంది. కేవ‌లం లోక‌ల్ లీడ‌ర్లే కాదు.. నేష‌న‌ల్ లీడ‌ర్లు కూడా ఏపీలో వాలిపోయే ప్లాన్ చేస్తున్నారు.. బీజేపీ స్టేట్ లీడ‌ర్లు.

ఏపీలో దేవాల‌యాల‌పై దాడుల విష‌యం ఎంత హైలైట్ అవుతుందో చూస్తూనే ఉన్నాం క‌దా. హీట్ ఇప్పుడిప్పుడే కాస్త త‌గ్గుతున్న‌ట్లు అనిపిస్తోంది. అందుకే.. మ‌ళ్లోసారి హైప్ ఇవ్వాల‌ని చూస్తున్నారు బీజేపీ లీడ‌ర్లు. రామ ర‌థ యాత్ర పేరుతో.. ఈ నెల చివ‌రిలోగా ర‌థ‌యాత్ర మొద‌లుపెట్టాల‌ని ప్లాన్ చేస్తున్నారు.. బీజేపీ ఏపీ లీడ‌ర్లు. రామ‌తీర్థం నుంచి క‌పిల తీర్థం వ‌ర‌కు ఈ ర‌థ‌యాత్ర ఉండ‌నుంది. రామ తీర్థం ఇటు చివ‌ర‌న విజ‌య‌న‌గ‌రం జిల్లాలో ఉంది.. క‌పిల తీర్థం అటు చివ‌ర‌న చిత్తూరు జిల్లాలో ఉంది. అక్క‌డి నుంచి ఇక్క‌డి వ‌రకు ర‌థ యాత్ర చేస్తే.. ఆల్మోస్ట్ ఏపీ మొత్తం క‌వ‌ర్ అవుతుంది. అలాగే పేర్లు కూడా క‌లిసొచ్చాయి. రామ తీర్థం టు క‌పిల తీర్థం. అందుకే..ఇలా ప్లాన్ చేస్తున్నారు బీజేపీ లీడ‌ర్లు. రామ‌తీర్థం నుంచి క‌పిల తీర్థం వ‌ర‌కు.. ఏ ఏ ఆల‌యాల‌పై దాడులు జ‌రిగాయో అన్ని ఆల‌యాల‌ను సంద‌ర్శించనుంది ఈ ర‌థ‌యాత్ర‌.

ఆల్రెడీ బీజేపీ సౌత్ పై ఫోక‌స్ చేసిన విష‌యం తెలిసిందే క‌దా. తెలంగాణ‌లో ఎలాగూ మంచి స్వింగులో ఉంది. అందుకే.. వెంట‌నే తెలుగు రాష్ట్ర‌మైన ఏపీ పై కూడా ఫోక‌స్ చేసింది. విగ్ర‌హాల ధ్వంసం బీజేపీకి క‌లిసొచ్చే అంశం అయింది. ఇక ఏ మాత్రం లేట్ చేయ‌కుండా బీజేపీ ఏపీ అధ్య‌క్షుడు సోమూ వీర్రాజు కూడా ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. బండి సంజ‌య్ బండేసుకుని తిరుగుతుంటే.. మేం ర‌థం వేసుకుని తిరుగుతాం అంటున్నారు. ఈ ర‌థ‌యాత్ర ఎఫెక్ట్ తిరుప‌తి బై పోల్ పై కూడా ఉండే ఛాన్స్ అయితే బానే కనిపిస్తోంది. ఈనెల 17న వైజాగ్ లో బీజేపీ కోర్ క‌మిటీ మీటింగ్ జ‌ర‌గ‌నుంది. ఈ మీట్ లో ర‌థ యాత్ర, ఏర్పాట్లు రూట్ మ్యాప్ పై చ‌ర్చించ‌నున్నారు. ఏదెలా ఉన్నా.. సెంట్ర‌ల్ లీడ‌ర్ల‌ని దించాలి.. బీజేపీకి ఏపీలో బూస్ట్ ఇవ్వాలి.. ర‌థ యాత్ర‌తో హిందూవాదాన్ని నిద్ర‌లేపి.. ఆల‌యాల ఇష్యూని ఇంకాస్త హైలైట్ చేసి.. వీలైనంత బెన్ ఫిట్ పొందాలి అని చూస్తోంది ఏపీ బీజేపీ.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

   3 hours ago


నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

   8 hours ago


తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

   9 hours ago


అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

   7 hours ago


ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

   10 hours ago


అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

   5 hours ago


వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

   3 hours ago


లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

   11 hours ago


ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

   11 hours ago


ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

   9 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle