మొహమాటానికి పోతే ఏం వస్తుందో ఏమో
07-04-202107-04-2021 16:44:59 IST
2021-04-07T11:14:59.883Z07-04-2021 2021-04-07T04:15:01.165Z - - 16-04-2021

బీజేపీ లీడర్లు అంటే... దేశం కోసం ధర్మం కోసం అంటారు. హిందూ వాదం అంటారు. జై శ్రీరామ్ అంటారు. మాది బరాబర్ హిందువుల పార్టీనే అంటారు. బైబిల్ కావాలా.. భగవద్గీత కావాలా అంటారు. ఇలా ఎన్నో కాంట్రవర్సీ డైలాగులు దంచుతారు. ఇదంతా కామనే. ఎలక్షన్ అంటే చాలు.. జాతీయ స్థాయి లీడర్లు కూడా ఊడిపడతారు. వాళ్లు ఎవరికి తెలుసు.. ఎవరికి తెలీదు అనేది వదిలేస్తే.. హడావిడి అయితే చేస్తారు.
ఇప్పుడు కూడా తిరుపతి ఉప ఎన్నిక జరగోబోతోంది కదా ఎంపీ సీటుకి. సోలిస్ట్ ఫైనల్ అవుతోందంట. బడా బడా లీడర్లు అంతా తిరుమల వెంకన్న దర్శనానికి వస్తున్నారు. ఆయనకంటే.. మీరే మాకు ఎక్కువ అంటూ.. ఓటర్లని దువ్వేసే ప్రోగ్రామ్ మామూలుగా ఉంటుంది కదా. అయితే.. ఇప్పుడు స్థానిక బీజేపీ లీడర్లకి ప్రాబ్లమ్ వచ్చింది. ఏపీ బీజేపీ లీడర్లు మొత్తం ఏం జరగబోతుందా అనుకుంటున్నారట. ముందుకి వెళ్లలేక వెనక్కి రాలేక చస్తున్నారట. మొహమాటానికి ఒప్పుకుంటున్నాం.. ఏం జరుగుతుందో అని భయపడుతున్నారట. ఒప్పుకోకపోతే.. పరిస్థితి ఏంటి.. అసలు ఓట్లు పడతాయో లేదో అనే టెన్షన్ లో ఉన్నారట.
ఎందుకంటే.. బీజేపీ జాతీయ నేతలు అంటే.. ఏపీలో కాస్త చిరాకు ఉంది. పీఎం మోడీ వస్తే.. పాచిపోయిన లడ్డూ ఇస్తావా అంటారు. ప్రత్యేక హోదా ఏది అని బలంగా నిలదీస్తారు. అస్సలే ఇష్యూ అవుతోంది కదా . ఈ టైంలో ప్రత్యేక హోదా ఎవ్వారం వస్తే ప్రాబ్లమే. పైగా అమిత్ షా వచ్చినా అదే గొడవ ఉంటుంది. యూపీ సీఎం యోగి వచ్చినా అదే గొడవ ఉంటుంది. ఇక పోతే.. ఇంకో కామన్ గొడవ కూడా ఉంది. ఏంది మరి.. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఏం చేద్దాం అనుకుంటున్నారు. వెనక్కి తగ్గుతారా.. వెనక్కి వెళ్తారా అని నిలదీస్తారు. అందులో ఎలాంటి డౌటూ లేదు. సో.. జాతీయ లీడర్లు రావడానికి షెడ్యూల్ ప్రిపేర్ అవుతోంది. ఎవరెవరు వస్తారు అనే విషయంలో బీజేపీ ఏపీ లీడర్లకి ఓ క్లారిటీ ఉంది. కానీ.. వస్తే ఏం జరుగుతుందా అనే టెన్షన్ కూడా ఉంది. అసలే పది రోజులే టైం ఉంది ఎలక్షన్ కి. సో.. ఏం చేయాలా అని ఆలోచిస్తున్నారు. యాక్చువల్ గా టెన్షన్ పడుతున్నారట. మొహమాటానికి పోతే.. ఎలాంటి రిజల్ట్ వస్తుందో అనే భయం కామనే కదా. సిచ్చువేషన్ అలా ఉంది మరి. కాదన లేరు.. ఒద్దు అంటే ఓట్లు రావనే భయం.. పాపం బీజేపీ లీడర్లు.

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
9 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
15 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
18 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా