newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

రామతీర్థం ఘటన.. బీజేపీ-జనసేన వదిలేదే లేదు

14-01-202114-01-2021 09:27:08 IST
Updated On 14-01-2021 07:34:37 ISTUpdated On 14-01-20212021-01-14T03:57:08.565Z14-01-2021 2021-01-14T01:42:36.516Z - 2021-01-14T02:04:37.943Z - 14-01-2021

రామతీర్థం ఘటన.. బీజేపీ-జనసేన వదిలేదే లేదు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ లో ఆలయాల ధ్వంసాన్ని పలు పార్టీలు తప్పుబడుతూ ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇక భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీలు ఈ ఘటనలను ప్రజల్లోకి మరింతగా తీసుకుని వెళ్లాలని భావిస్తూ ఉన్నాయి. జనసేన పార్టీ కూడా ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఉంది. తాజాగా జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. రామతీర్థ పోరాట కమిటీని పవన్ కల్యాణ్ ఏర్పాటు చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి శివశంకర్ ఈ కమిటీకి నేతృత్వం వహించనున్నారు. కమిటీ సభ్యులుగా పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యురాలు పాలవలస యశస్విని, ఉత్తరాంధ్ర ప్రాంతీయ కమిటీ సభ్యులు గడసాల అప్పారావు, డాక్టర్ బొడ్డిపల్లి రఘుని నియమించినట్లు జనసేన పార్టీ నుంచి ప్రకటన వెలువడింది.

రామతీర్థంలో స్వామికి అపచారం జరిగి వారాలు గుడుస్తున్నా ఈ కేసులో ఇంత వరకు ఎటువంటి పురోగతి లేదని జనసేన విమర్శించింది. తమకు స్వేచ్ఛను ఇస్తే ఎలాంటి కఠినమైన కేసులనైనా గంటల వ్యవధిలోనే పరిష్కరిస్తామని ఆఫ్ ది రికార్డుగా పోలీసులు చెపుతుంటారని, ఈ కేసులో మాత్రం పోలీసులకు పూర్తి స్వేచ్ఛను ఇవ్వలేదని అనుమానాలు వస్తున్నాయని జనసేన చెబుతోంది. ఈ కేసులో సత్వర న్యాయం జరిగేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు బృందంతో కలిసి ఈ కమిటీ పని చేస్తుందని చెప్పింది. జనసేన కార్యకర్తలను అవసరమైన సమయాలలో సమాయత్తం చేస్తూ, బీజేపీతో సమన్వయం చేసుకుంటూ ఈ కమిటీ పని చేస్తుందని తెలిపింది.

విజయనగరం జిల్లా రామతీర్థంలో రాముడి విగ్రహం తలను కోసి వేయడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన తర్వాత విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించాయి. రామతీర్థంకు టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్లినప్పుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వెళ్లేందుకు యత్నించినప్పుడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఆంధ్రప్రదేశ్ లోని 58, 871 హిందూ ఆలయాలకు జియో ట్యాగింగ్ చేశామ‌ని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీలోని 13,000 ఆలయాల్లో ఇప్ప‌టికే 43,000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామ‌ని ఆయ‌న తెలిపారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 44 దేవాలయ సంబంధిత నేరాలలో 29 కేసులను ఛేదించడంతో పాటు  80 మంది కరుడుగట్టిన అంతర్రాష్ట్ర నేరస్థులను అరెస్టు చేశామని చెప్పారు.  తాము 3 నెలల కిందటే రామతీర్థం ఆలయంలో భద్రతను పెంచామ‌ని, అదనంగా 16 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించామ‌ని చెప్పారు. కొండపైన ఉన్న దేవాలయంలో విద్యుత్ సరఫరా లేకపోవ‌డంతోనే సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. 

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

   3 hours ago


నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

   8 hours ago


తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

   9 hours ago


అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

   7 hours ago


ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

   10 hours ago


అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

   5 hours ago


వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

   3 hours ago


లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

   11 hours ago


ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

   10 hours ago


ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

   8 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle