newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

19-01-202119-01-2021 13:06:45 IST
Updated On 19-01-2021 09:50:06 ISTUpdated On 19-01-20212021-01-19T07:36:45.408Z19-01-2021 2021-01-19T03:30:51.389Z - 2021-01-19T04:20:06.075Z - 19-01-2021

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో రాజ‌కీయాలు మ‌తం రంగు పులుముకున్నాయి. ఈ విష‌యం అంద‌రికీ అర్దం అయింది. ఎవ్రీ మినిట్ ఏదో అప్డేట్ న‌డిచిన రోజులు కూడా ఉన్నాయి. లీడ‌ర్లు అంద‌రూ ఉరుకులూ ప‌రుగులూ పెట్టారు. కానీ.. బీజేపీ మాత్రం కాస్త ఢ‌ల్ అయింది. అస‌లు ముందు ముందు ఉర‌కాల్సిన పార్టీనే బీజేపీ. కానీ.. బీజేపీ అలా చేయ‌లేదు. ఎందుకంటే.. ఇది నార్త్ బీజేపీ కాదు క‌దా. సౌత్ బీజేపీ కాదు క‌దా. అందుకే.. బీజేపీ లీడ‌ర్లు కూడా అంత యాక్టివ్ గా లేరు. పార్టీకి రావాల్సిన మైలేజీ రాలేదు. అందుకే.. ఆ మైలేజీని ర‌థ యాత్ర‌తో తీసుకురావాలి అని ప్లాన్ చేస్తోంది క‌దా బీజేపీ.

వ‌చ్చే నెల నాలుగు నుంచి.. ఎనిమిది రోజులు ర‌థ యాత్ర‌కి ప్లాన్ చేసింది. క‌పిల తీర్థం టు రామ‌తీర్థం రామ ర‌థ యాత్ర న‌డ‌వ‌నుంది యాత్ర అయితే వింటానికి బావుంది. క‌పిల తీర్థం నుంచి రామ తీర్థం అంటే.. సౌండింగ్  కూడా బావుంది. కానీ.. ఇది ప‌క్కాగా మ‌తం రంగు పులుముకునే న‌డుస్తుంది అన‌డంలో నో డౌట్. కేవ‌లం దేవుడి మీద దేవుడి భ‌క్తి మీద న‌డ‌వ‌దు. హిందూ మ‌తం అనే యాంగిల్ లో న‌డుస్తుంది. అఫ్ కోర్స్ దాడులు కూడా హిందూ ఆల‌యాల మీదే క‌దా. ర‌థ యాత్ర‌కి అర్దం ప‌ర‌మార్థం కూడా ఉంది. కానీ.. జ‌నం ఎలా రెస్పాండ్ అవుతారు అనేదే ఇక్క‌డ పాయింట్. ఎనిమిది రోజుల పాటు.. ఎంత మంది సెంట్ర‌ల్ బీజేపీ లీడ‌ర్లు వ‌స్తారు. దాన్ని ఎంత భారీగా ప్లాన్ చేస్తారు అనేది చూడాలి.

జ‌న‌సేన పాత్ర ఈ ర‌థ‌యాత్ర‌లో ఎంత ఉంటుందో ఎవ‌రికీ తెలీదు. అద‌లా వ‌దిలేస్తే.. నార్త్ లో అయితే.. హిందూమ‌తానికి మంచి మైలేజీ వ‌స్తుంది. దేవుళ్లు ఆల‌యాలు.. భ‌క్తి అంటే ఆ లెక్క‌లు అక్క‌డ వేరే. కాషాయ మ‌యం అయిపోతుంది అక్క‌డ‌. ఏ పార్టీ అయినా.. హిందూ, దేవుళ్లు అనే ప‌దాల‌కి ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే. కానీ సౌత్ లో అంతగా లేదు. అందుకే.. ఇన్నాళ్లూ బీజేపీ ఇక్క‌డ బ‌ల ప‌డ‌లేదు. హిందూవాదాన్ని మాత్ర‌మే న‌మ్ముకుంటే ఇక్క‌డ వ‌ర్క‌వుట్ కాదు. అయినా స‌రే.. ఓ ప్ర‌య‌త్నం మాత్రం గ‌ట్టిగానే చేస్తోంది బీజేపీ.

ఏపీలో కుల‌రాజ‌కీయాల‌కి ఎక్కువ పేరుంది. రెండు సామాజిక వ‌ర్గాల మ‌ధ్య‌లో మంచి ఫైట్ న‌డుస్తుంటుంది. ఇప్పుడు మూడో సామాజిక వ‌ర్గం కూడా జెండా ఎగ‌రేయాల‌ని చూస్తోంది. అయినా స‌రే.. మూడో సామాజిక వ‌ర్గానికి స్పేస్ లేదు.. అయినా తీసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఇలాంటి ఇరుకు ప్లేస్ లో.. మ‌తం అనే ప‌దం వ‌ర్క‌వుట్ అవుతుందా.. బీజేపీ అనుకున్నంత మైలేజీ ర‌థ యాత్ర తో వ‌స్తుందా లేదా అన్న‌ది ఇంపార్టెంట్ పాయింట్ అయింది. ఇవ‌న్నీ తెలియాలి అంటే.. వ‌చ్చే నెల 4 వ‌ర‌కు వెయిట్ చేయ‌క త‌ప్పేలా లేదు.

బ‌లంగా ప్ర‌తి ప‌క్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్ప‌దా

బ‌లంగా ప్ర‌తి ప‌క్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్ప‌దా

   23 minutes ago


అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి

   8 hours ago


మ‌రో ఇష్యూలో మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి

మ‌రో ఇష్యూలో మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి

   9 hours ago


ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి

   15 hours ago


మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!

   14 hours ago


ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు

   17 hours ago


కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

   16 hours ago


కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!

   19 hours ago


తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం

   a day ago


బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle