ఏంటి సోమూ సార్.. మీరొస్తుంటే పార్టీలన్నీ దారివ్వాలా ఏంటి
02-04-202102-04-2021 14:49:47 IST
Updated On 02-04-2021 10:45:24 ISTUpdated On 02-04-20212021-04-02T09:19:47.925Z02-04-2021 2021-04-02T03:59:45.901Z - 2021-04-02T05:15:24.466Z - 02-04-2021

ఏంటో.. ఈ బీజేపీ లీడర్లు ఏం మాట్లాడుతారో ఏమో అర్దం కాదు. అస్సలే బీజేపీ పై ఎన్నో కామెంట్స్ ఉన్నయ్. ఏదైనా ప్రశ్నిస్తే.. దేశ ద్రోహి అంటూ తప్పించుకుంటారని.. మతం రంగు పూసేసి సైడ్ అయిపోతారని ఎన్నో కామెంట్స్ ఉన్నయ్ కదా. ఇప్పుడు ఏపీ లీడర్లు కూడా ఇలాంటి పనులే చేస్తున్నారు. వాళ్లు మాట్లాడే ప్రతి మాట మీదా కామెంట్స్ పడుతున్నయ్. దేశంలో ఎక్కడా లేని విధంగా పవన్ ని సీఎం చేస్తాం అంటూ.. ఏపీ బీజేపీ లీడర్లు మాట్లాడుతుంటే.. అవునా నిజమా అంటున్నారు. చివరికి జనసేన కూడా నమ్మే పరిస్థితిలో లేదు. ఇక పోతే.. తిరుపతి బై పోల్ విషయంలో కూడా ఇలాంటి మాటలు చాలానే వినిపిస్తున్నయ్. మాటి మాటికీ.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోమూ వీర్రాజు ఓ మాట అంటుంటారు. వైసీపీ, టీడీపీలు మా పార్టీ బీజేపీ ని టార్గెట్ చేస్తున్నాయి అంటారు సోమూ వీర్రాజు. ఇది విన్న ప్రతి సారీ.. పాలిటిక్స్ తెలియని జనాలు కూడా నవ్వుకునే పరిస్థితి తప్పడం లేదు. అదేంటి.. తిరుపతి బై పోల్ నడుస్తోంది. ఎంపీ ఎలక్షన్ అంటా టంకాపోరుగా ఉంటుంది. కాంగ్రెస్, సీపీఐ పార్టీలు కూడా బరిలో ఉన్నప్పటికీ తిరుపతిలో ప్రధానంగా.. వైసీపీ, టీడీపీ, బీజేపీ జనసేనల మధ్యనే పోటీ ఉంది. బీజేపీ జనసేనలు కలిసి.. ఓ అభ్యర్థిని నిలబెడుతున్నారు కాబట్టి ఓకే. ఇక మిగిలింది వైసీపీ, టీడీపీలే కదా. మరి ఆ రెండు పార్టీలూ.. బీజేపీని టార్గెట్ చేస్తాయి కదా. బీజేపీ, వైసీపీ కలిసి టీడీపీ టార్గెట్ చేస్తాయి కదా.. టీడీపీ బీజేపీలు కలిసి వైసీపీని టార్గెట్ చేస్తాయి కదా. ఇదే కదా రాజకీయం. మరి వైసీపీ, టీడీపీలు మా పార్టీని టార్గెట్ చేస్తున్నాయి అంటూ.. బీజేపీ ఏపీ లీడర్లు కామెంట్ చేయడంతో కామెంట్లు తప్పడం లేదు. మరి మీరు పోటీ చేస్తున్నప్పుడు టార్గెట్ చేయక.. మీకు రెడ్ కార్పెట్ వేసి దారిస్తారా మాస్టారూ అంటున్నారు. ముందు వాళ్లంటున్నారు వీళ్లంటున్నారు అనే మాటలు వదిలేసి.. ఎన్నికల్లో ఎలా గెలవాలి.. పవన్ కల్యాణ్ ని ప్రచారానికి ఎలా తీసుకురావాలి.. వచ్చిన తర్వాత ఎలా ప్లాన్ చేయాలి అని ఆలోచించండి.. కేంద్ర బీజేపీ నాయకుల్ని తీసుకొచ్చే ప్లాన్లు గట్రా ఉంటే చేసుకోండి అంటూ.. ప్రత్యర్థులు కూడా సలహాలు ఇచ్చే పరిస్థితి తెచ్చుకుంటున్నారు బీజేపీ ఏపీ లీడర్లు.

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
25 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
15 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
11 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
18 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
21 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా