newssting
Radio
BITING NEWS :
కిడ్నాపర్ల చెరనుంచి తప్పించుకున్న అమ్మాజీ స్వాజీ. డబ్బుల కోసం అమ్మాజీ స్వామీజీ కిడ్నాప్. షిరిడీ వెళ్దామని చెప్పి స్వామీజీని కిడ్నాప్ చేసి, 20 కోట్ల రూపాయలు - కిలో బంగారం డిమాండ్ చేసిన కిడ్నాపర్లు. ఇంతలో గుండెనొప్పితో ఆస్పత్రిలో చేరి డాక్టర్ల ద్వారా పోలీసులకు కిడ్నాప్ గురించి సమాచారం. * ప్రొద్దుటూరులో ఉన్మాది దాడిలో గాయపడిన లావణ్యకు కొనసాగుతున్న చికిత్స. నిన్న రాత్రి ప్రొద్దుటూరు నుంచి రిమ్స్ ఆస్పత్రికి తరలింపు. నిందితుడు సునీల్ దాడిలో లావణ్య తల, చేతికి తీవ్రగాయాలు. ప్రస్తుతం లావణ్య ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు. * టీటీడీ నుంచి రామతీర్థానికి విగ్రహాల తరలింపు. రామతీర్థం ఆలయాన్ని పునర్నించాలని నిర్ణయించిన ప్రభుత్వం. ఆలయ పనులు పూర్తయ్యేంతవరకూ బాలాలయంలోనే విగ్రహాల ప్రతిష్ట. ఏడాదిలోగా రామతీర్థానికి పూర్వవైభవం తీసుకొస్తామన్న మంత్రి వెల్లంపల్లి. * విషమించిన ఆర్జేడీ నేత లాలూప్రసాద్ ఆరోగ్యం. రాంచీ రిమ్స్ ఆస్పత్రిలో లాలూకు కొనసాగుతున్న చికిత్స. లాలూ ఆరోగ్యం విషమించడంతో ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ వచ్చిందంటున్న వైద్యులు. * పాట్నాలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 10 ఫైరింజన్లు. అగ్నిప్రమాద స్థలానికి సమీపంలోనే పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళనలో స్థానికులు. * తమిళనాడు ముత్తూట్ ఫైనాన్స్ లో రూ.7 కోట్ల విలువైన బంగారం అపహరణ. హైదరాబాద్ లో దొరికిన బంగారం దొంగలు. మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ఎదుట నిందితులను హాజరుపరచనున్న పోలీసులు. * పశ్చిమగోదావరి జిల్లా కొమిరేపల్లిలో 28కి చేరిన వింతవ్యాధి కేసులు. అనారోగ్యం నుంచి కోలుకోవడంతో 19 మంది డిశ్చార్జ్. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న మరో 9 మంది బాధితులు. పూళ్లలో 36కి చేరిన వింతవ్యాధి కేసులు. ఇంటింటి సర్వే చేస్తున్న వైద్య సిబ్బంది. * అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం. ఐదేళ్ల చిన్నారిపై వీధికుక్కల దాడి. చిన్నారికి తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు. * ఏపీ పంచాయతీ ఎన్నికలకు మోగిన నగారా. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ. నాలుగు దశల్లో ఎన్నికల నిర్వహణ. ఈ నెల 27 నుంచి 29 వరకూ నామినేషన్లు, 31న ఉపసంహరణ. ఫిబ్రవరి 5న పోలింగ్.

మరో కొత్త చర్చ.. భూమా మౌనికకి రాజకీయ పగ్గాలు?

14-01-202114-01-2021 13:06:02 IST
2021-01-14T07:36:02.439Z14-01-2021 2021-01-14T03:17:55.227Z - - 24-01-2021

మరో కొత్త చర్చ.. భూమా మౌనికకి రాజకీయ పగ్గాలు?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీ పాలిటిక్స్ లో అఖిల ప్రియ అరెస్ట్ ఇష్యూ ఎంత హీట్ క్రియేట్ చేసిందో చూస్తూనే ఉన్నాం క‌దా. ఇప్పుడు భూమా మౌనిక చేసిన వ్యాఖ్య‌లు కూడా అంతే హీట్ క్రియేట్ చేస్తున్నాయి. నేనున్నా అంటూ.. మౌనిక ముందుకు రావ‌డంతో.. కార్య‌క‌ర్త‌ల్లో కాస్త ధైర్యం వ‌చ్చింది. పొలిటిక‌ల్ స‌ర్కిల్స్ లో డిస్క‌ష‌న్ కు మంచి పాయింట్ దొరికింది.

అఖిల ప్రియ అరెస్ట్, ఆమె భ‌ర్త భార్గ‌వ్ రామ్ అరెస్ట్ తో ఆళ్ల‌గ‌డ్డ‌లో.. భూమా వ‌ర్గీయులు, ఆమె ఫాలోవ‌ర్లు.. కేడ‌ర్ మొత్తం నిరుత్సాహానికి గురైంది. ఇష్యూ ప‌క్క స్టేట్ తెలంగాణ‌లో కావడంతో ఏం జ‌రుగుతుందో అన్న టెన్ష‌న్ త‌ప్ప‌డం లేదు. పూర్తిగా కార్న‌ర్ కావ‌డం ఎలా బ‌య‌టికొస్తారో అఖిల ప్రియ అనే టెన్ష‌న్ పెరిగిపోయింది. ఏ వ‌న్ ఏ టూ అంటూ.. ఏవేవో మాటలు వింటూ మీడియాలో చూస్తూ.. డైల‌మాలో ప‌డిపోయారు. ఇదే స‌మ‌యంలో క‌రెక్ట్ టైం చూసి కార్య‌క‌ర్త‌ల‌తో మీటింగ్ పెట్టారు భూమా అఖిల మౌనిక‌.

అఖిల ప్రియాకి బెయిల్ వ‌చ్చాక‌.. హైదరాబాద్ నుంచి.. ఆళ్ల‌గ‌డ్డ దాకా ర్యాలీగా తీసుకొద్దాం. ఎవ‌రూ భ‌య‌ప‌డాల్సిన ప‌నిలేదు. కార్య‌క‌ర్త‌ల‌కి ఏ ప్రాబ్ల‌మ్ వ‌చ్చినా నాకు ఫోన్ చేయండి. నాకు కాస్త ఇబ్బంది ఉండి ఇన్నాళ్లూ నియోజ‌క‌వ‌ర్గానికి దూరంగా ఉన్నాను. ఇక‌పై అలాంటి స‌మ‌స్యేం లేదు. మిమ్మ‌ల్ని నేను చూసుకుంటాను. ఏ ప్రాబ్ల‌మ్ వ‌చ్చినా మీ ముందు నేనుంటా.. అన్ని బాధ్య‌త‌లు నేను తీసుకుంటా. జ‌స్ట్ నాకు ఫోన్ చేయండి అన్నారు భూమా మౌనిక‌.

అఖిల ప్రియ‌, భార్గ‌వ్ రామ్ ల అరెస్ట్ వెనుక పెద్ద పెద్ద రాజ‌కీయ తంత్రాలు ఉన్న‌య్. వాట‌న్నీటినీ చేధిద్దాం.. డీజీపీని.. కేంద్ర స‌హాయ మంత్రి కిష‌న్ రెడ్డిని క‌లుస్తాం.. జ‌రుగుతున్న కుట్ర‌లు గురించి వివ‌రిస్తాం అన్నారు భూమా మౌనిక‌. చూస్తుంటే మౌనిక వ్యాఖ్య‌లు ప‌లు ర‌కాల హింట్స్ ఇచ్చిన‌ట్లు ఉంది అంటున్నారు ఏపీ పొలిటిక‌ల్ అన‌లిస్టులు. నియోజ‌క వ‌ర్గంలో బాధ్య‌త‌లు ఇక‌పై మౌనిక‌నే చూసుకుంటారేమో అన్న‌ట్లుంది అనే టాక్ న‌డుస్తోంది.

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

నిమ్మగడ్డ ఎన్నికల కమిషనర్ కాదు.. రాజకీయ నాయకుడే..

   3 hours ago


నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

నిమ్మగడ్డ మీటింగ్.. అలా షాక్ ఇచ్చిన అధికారులు..!

   8 hours ago


తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

తెలంగాణ పాలిటిక్స్ లోకి ద‌ర్శ‌కుడు రాఘ‌వేంద్ర రావు

   10 hours ago


అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

అంబ‌టి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్

   7 hours ago


ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

   10 hours ago


అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

అన్నా రాంబాబుపై జనసేనాని ఆగ్రహం.. అసెంబ్లీలో అడుగుపెట్టనివ్వమంటూ హెచ్చరిక

   5 hours ago


వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

వైసీపీ పతనానికి పంచాయతీ ఎన్నికలే నాంది అంటున్న చంద్రబాబు

   4 hours ago


లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

లాలూ ప్రసాద్‌కు సిటీ స్కాన్.. ఆసుపత్రికి రబ్రీ, తేజస్వి రాక

   12 hours ago


ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

ఇక నేను ఫైట్ చేస్తా- అన్నా హ‌జారే

   11 hours ago


ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

ఆ ఒక్క సీటు చాలా ఇంపార్టెంట్.. రంగంలోకి రెడీ

   9 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle