వైసీపీకి ఆయుధమైన అఖిలప్రియ అంశం...టీడీపీ కి పెద్ద దెబ్బ
08-01-202108-01-2021 08:04:16 IST
Updated On 08-01-2021 08:38:37 ISTUpdated On 08-01-20212021-01-08T02:34:16.813Z08-01-2021 2021-01-08T02:34:05.783Z - 2021-01-08T03:08:37.892Z - 08-01-2021

భూమా అఖిలప్రియ కిడ్నాప్ కేసులో ఏ1 ముద్దాయి అవ్వడం టీడీపీకి మింగుడుపడడం లేదు. ముఖ్యంగా వైసీపీ నాయకులు ఈ వ్యవహారాన్ని హైలైట్ చేస్తున్నారు. తమ పార్టీకి చెందిన నేత అరెస్ట్ అయినప్పటికీ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించడమే మానేశారని అంటున్నారు. కేసీఆర్ బంధువులుగా పేర్కొంటున్న వారిని కిడ్నాప్ చేసి అరెస్టయిన అఖిల ప్రియను చంద్రబాబు, లోకేశ్ పరామర్శించలేదేని వైసీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నించారు. అదే ఏపీ పోలీసులు అఖిల ప్రియను అరెస్ట్ చేసి ఉండుంటే, బాబు చాలా రచ్చ చేసి ఉండేవారని.. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన బాబు.. హైదరాబాద్ నుంచి అమరావతికి మకాం మార్చారని గతాన్ని గుర్తు చేస్తూ పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ముఖ్యంగా బాబు కేసీఆర్ అంటే భయపడుతూ ఉన్నారంటూ విమర్శల మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. ‘అచ్చెన్న అరెస్ట్ అయితే ఎగిరెగిరి పడ్డావు, కొల్లు రవీంద్రని హత్యాయత్నం కేసులో జైళ్లో తోస్తే అన్యాయమన్నావు, జేసీ ప్రభాకర్ రెడ్డి బస్సుల వ్యవహారంలో కటకటాల వెనక్కి వెళ్తే వకాల్తా పుచ్చుకున్నావు. కార్యకర్తలకు ఏమైనా అయితే చూస్తూ ఊరుకోనన్నావ్. ఇప్పుడు ఏకంగా మీ పార్టీ మహిళ, మాజీ మంత్రి మరి బాబు నోటికి తాళం ఎందుకు పడింది’ అని ఓ నెటిజన్ పెట్టిన ట్వీట్ ను పలువురు వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తూ ఉన్నారు. అఖిలప్రియ అరెస్ట్ వ్యవహారం వైసీపీకి ఆయుధంగా మారింది. భూమా అఖిలప్రియకు న్యాయస్థానం ఈ నెల 20 వరకు రిమాండ్ విధించింది. ఆమెను చంచల్ గూడ జైలుకు పోలీసులు తరలించిన నేపథ్యంలో ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. భూ వివాదంలో ప్రవీణ్ రావు, సునీల్, నవీన్ అనే ముగ్గురు సోదరులను కిడ్నాప్ చేసిన కేసులో పోలీసులు తమ రిపోర్టులో అఖిలప్రియను ఏ1 గా పేర్కొన్నారు. అఖిలప్రియను ఏ2గా పేర్కొన్న పోలీసులు రిమాండ్ రిపోర్టులో ఏ1గా పేర్కొన్నారు. ఇదే విషయాన్ని ఆమె న్యాయవాది ఇవాళ జరిగిన బెయిల్ పిటిషన్ విచారణలో కోర్టుకు తెలిపారు. అఖిలప్రియను ఏ2 నుంచి ఏ1గా మార్చారని ఆరోపించారు. ఏ1గా పేర్కొన్న ఏవీ సుబ్బారెడ్డిని తాజాగా ఏ2గా నమోదు చేశారు. ఏ3గా అఖిలప్రియ భర్త భార్గవరామ్ ను చేర్చగా.. ఇతర నిందితులుగా శ్రీనివాసరావు, చంటి, ప్రకాశ్, సాయిల పేర్లు నమోదు చేశారు.

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి
an hour ago

కేటీఆర్ పరిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా
4 hours ago

జగన్ సర్కార్ మరో డెసిషన్.. ఎందుకు తీసుకుంటారో ఏమో
an hour ago

సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా
4 hours ago

నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే
5 hours ago

ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?
5 hours ago

షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!
6 hours ago

ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట
7 hours ago

మితిమీరిన బూతులు.. కొడాలి నానీ రాజకీయాలకు అవసరమా?
7 hours ago

సంగారెడ్డిలో తోప్ సింగ్ కావాలని ఈ మాజీ ఎమ్మెల్యే ఆరాటం.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్
7 hours ago
ఇంకా