భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు
21-01-202121-01-2021 10:01:22 IST
Updated On 21-01-2021 09:49:33 ISTUpdated On 21-01-20212021-01-21T04:31:22.886Z21-01-2021 2021-01-21T04:00:34.458Z - 2021-01-21T04:19:33.014Z - 21-01-2021

వడ్డించే వాడు మనోడు అయితే.. ఏ బంతిలో కూర్చున్నా ఏం కాదు. బంతిలో ఏ మూలన కూర్చున్నా ఏం కాదు అంటారు కదా. ఏపీలో కూడా ప్రభుత్వం అలాగే చేస్తోంది. భారతీ సిమెంట్ కి ఇప్పుడు వడ్డించే ప్రభుత్వంగా మారింది అంటూ.. ప్రతి పక్షాలు ఎన్నో ఆరపోణలు చేస్తోంది. ఏదో కౌంటర్ లు ఇవ్వాలి కాబట్టి.. సర్కార్ పెద్దలు కౌంటర్లు ఇస్తున్నారు తప్ప.. వాటిల్లో సరైన పస లేదు అనేది జనం ఇంటెన్షన్ కూడానూ.
అసలు మేటర్ ఏంటో అర్దం అయ్యే ఉంటుంది కదా. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు. నేషనల్ వైడ్ గా భారతీ సిమెంట్ ఇష్యూ అవుతోంది. ఇంగ్లీష్ న్యూస్ పేపర్ల వెబ్ సైట్లు కూడా ఇదే విషయాన్ని దంచేస్తున్నాయి. భారతీ సిమెంట్ కి ఎక్కువ కాంట్రాక్టులు ఇస్తున్నారు. సిమెంట్ ఆర్డర్లు ఆ కంపెనీకే ఇవ్వడం వెనక రీజన్ ఏంటి అనేది చాలా మంది నోట నానుతున్న మాట.. అందుకే ఇంగ్లీష్ మీడియా వాళ్లు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. పాయింట్ పాయింట్ లెక్కలతో సహా బయటపెడుతున్నారు. ఎన్ని టన్నుల ఆర్డర్ ఇవ్వాలి. మరి ఎన్ని టన్నుల ఆర్డర్ ఇచ్చారు. అలా ఎందుకు ఇచ్చారు అంటూ.. ఇన్వెస్టిగేట్ చేసి.. పాయింట్ అవుట్ చేసి మరీ ఆన్సర్ రాబడుతున్నారు. దీంతో.. నేషనల్ వైడ్ గా భారతీ సిమెంట్ ఎవ్వారం నానుతోంది. ముందు ముందు ఇంకాస్త హాట్ టాపిక్ అయినా అవుతుంది కావచ్చు.
భారతీ సిమెంట్స్ వైఎస్ కుటుంబానికి చెందిన కంపెనీ అనే విషయం తెలుగు రాష్ట్రాల్లో అందరికీ తెలిసిందే కదా. ఇందులో వైఎస్ భారతి పేరు మీద.. 41 శాతం వాటా ఉంటే.. ఫ్రెంచ్ కంపెనీ పేరు మీద 51 శాతం వాటా ఉంది. ఈ కంపెనీకి.. వైఎస్ భారతీ డైరెక్టర్ హోదాలో ఉన్నారు. ఇక ఏపీలో ఉంది వైసీపీ ప్రభుత్వం కదా. ఆర్డర్లు భారతీ సిమెంట్ కి కాక మరి ఏ కంపెనీకి పోతాయేం అంటూ.. సెటైర్లు వేసుకుంటున్నారు జనాలు. టీడీపీ లీడర్లు మాత్రం సీరియస్ అవుతున్నారు. ఎంత సొంత కంపెనీ అయినా.. అందర్నీ సమానంగా చూడాలి. అలా చూస్తేనే ప్రభుత్వం అంటారు. అలా కాకుండా ప్రభుత్వ ఆర్డర్లు సొంత కంపెనీకి ఇవ్వడం ఎంత వరకు కరెక్ట్ అంటూ విమర్శిస్తున్నారు. ఆర్డర్లు కూడా మామూలుగా కాదు. గత నెల ఏప్రిల్ నుంచి మొన్నటి 18 వరకు చూస్తే.. 2 లక్షల 28 వేల 370 మెట్రిక్ టన్నుల ఆర్డర్లు వెళ్లాయి. గవర్నమెంట్ నుంచి ఇంత పెద్ద మొత్తంలో ఆర్డర్లు ఒక్క కంపెనీకి పోవడం.. అది కూడా వైఎస్ జగన్ సతీమణి కంపెనీ కావడంతో.. ఇష్యూ సీరియస్ గానే ఉంది.
అయితే.. దీనిపై మినిస్టర్ మేకపాటి గౌతమ్ రెడ్డి మాత్రం మరో వర్షన్ చెబుతున్నారు. గత ప్రభుత్వంలో ఉన్న సిమెంట్ ధరకంటే.. కంపెనీలకి తక్కువ ధర ఇస్తున్నాం. 50 కేజీల బస్తాకి.. 225 రూపాయలు మాత్రమే ఇస్తున్నాం. గత ప్రభుత్వం హయంలోనే.. 230 రూపాయిలు ఇచ్చిన సందర్భాలున్నాయి. ఇన్ని రోజుల తర్వాత కూడా ప్రభుత్వం కంపెనీలకి తక్కువ ధర ఇస్తోంది. అందుకే.. కంపెనీలు పెద్దగా ముందుకు రావడం లేదు. తక్కువ ధరకే సిమెంట్ ఇస్తున్న కంపెనీలకు ఆర్డర్లు ఇస్తున్నాం. అలాగే.. అన్ని కంపెనీలు ఇన్ని కంపెనీలు అనేదేం లేదు. కేవలం భారతీ సిమెంట్స్ కి మాత్రమే ఆర్డర్స్ ఇస్తే.. ఇలాంటి కామెంట్స్ చేస్తే ఓకే కానీ.. మిగతా కంపెనీలతో పాటే.. భారతీ సిమెంట్స్ కి కూడా ఆర్డర్స్ ఇస్తున్నాం అంటూ కవర్ చేశారు.. మేకపాటి.

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
7 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
8 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
15 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
14 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
16 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
16 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
18 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
21 hours ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
21 hours ago

రాష్ట్ర బంద్ లో విజయసాయి రెడ్డికి చేదు అనుభవం
a day ago
ఇంకా