మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
04-03-202104-03-2021 11:06:42 IST
Updated On 04-03-2021 10:22:17 ISTUpdated On 04-03-20212021-03-04T05:36:42.595Z04-03-2021 2021-03-04T04:37:07.098Z - 2021-03-04T04:52:17.079Z - 04-03-2021

ఎన్నికల వేడి ఏపీలో ఏ మాత్రం తగ్గలేదు. రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. మరో వారం రోజుల్లో మున్సిపల్ ఎన్నికలు ఉండడంతో.. పార్టీలు అన్నీ అటు సైడు ఫోకస్ చేశాయి. వైసీపీ కూడా ఇదే ప్లాన్ లో ఉంది. ఎలాగైనా పట్టు నిలుపుకోవాలని ట్రై చేస్తోంది. ఇక బీజేపీ జనసేనల పరిస్థితి మాట్లాడుకోవడం దండగే కావచ్చు. వాళ్లు ఏం చేస్తున్నారో కూడా వాళ్లకే తెలీదు. ఓ పక్కనేమో.. మొన్న పంచాయితీ ఎన్నికల్లో పవర్ చూపించాం అంటున్నారు పవర్ స్టార్. మరి కార్పొరేషన్ ఎన్నికల కోసం ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నారో.. పోరుకి ఎలా రెడీ అవుతున్నారో ఎవరికీ తెలీదు. ఆయనకైనా తెలుసో లేదో. ఎందుకంటే ఈ మధ్య షూటింగుల్లో పవర్ స్టార్ చాలా బిజీ. ఒకే రోజు రెండు లొకేషన్లలో.. రెండు సినిమాల్లో.. రెండు మూడు గెటప్స్ లో యాక్ట్ చేస్తున్నారు అని తెలుస్తోంది. అంటే.. సూపర్ బిజీ అన్నట్లే కదా. మరి అలాంటి పవన్ కల్యాణ్.. ఎలా మూవ్ అవుతారో ఎవరికి తెలుసు. ఇక బీజేపీ తీరు తెలిసిందే కదా. ఏ పార్టీ ఎలా ఉన్నా.. టీడీపీ మాత్రం.. ఏపీలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తోంది. కార్పొరేషన్ ఎన్నికలంటే.. ఆ లెక్క వేరే కదా. కాస్త ఎడ్యుకేటెడ్ ఉండే ఏరియాలు కావడంతో.. మరికాస్త ఇంట్రస్టింగ్ గా మారాయి. గ్రామాల్లో సత్తా చూపించిన మేము.. ఇక కార్పొరేషన్లలో కూడా పవర్ చూపిస్తాం అంటున్నారు టీడీపీ లీడర్లు. ఎన్ని బెదిరింపులకు దిగినా.. ఎన్ని దౌర్జన్యాలు చేసినా.. మేం మాత్రం తగ్గేదే లేదు.. వైసీపీ మీద పట్టు సాధిస్తాం.. గెలిచి తీరతాం అంటున్నారు టీడీపీ లీడర్లు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కూడా కార్పొరేషన్ ఎన్నికల విషయంలో పక్కా ప్లానింగ్ తో ముందుకెళ్తున్నారు. యాత్రలతో జనంలోకి వెళ్తున్నారు. ఆల్రెడీ షెడ్యూల్స్ కూడా రెడీ అయ్యాయి. ఇవ్వాళ కర్నూలు, రేపు తిరుపతి, ఈనెల 6న విశాఖ పట్నం, 7న విజయవాడలో బాబు ప్రచారం చేస్తారు. ఈనెల 8న గుంటూరులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేయనున్నారు. బాబు యాత్ర ఏపీ మొత్తం కవర్ అయ్యేలా.. టీడీపీ లీడర్లు ప్లాన్ చేశారు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా