newssting
Radio
BITING NEWS :
* ఏపీ లో వివాదంగా మారిన గీతం వర్సిటీ కట్టడాల కూల్చివేత, అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం జీవీఎంసీ, గీతం వర్సిటీ యాజమాన్యం మధ్య ల్యాండ్ వార్ * హైదరాబాద్: నేపాల్ గ్యాంగ్ ను అరెస్ట్ చేసిన రాచకొండ పోలీసులు, నాచారం లో జరిగిన చోరీ కేసులో నేపాల్ ముఠా అరెస్ట్ * జూరాల ప్రాజెక్ట్ వరద ఉదృతి, 6 గేట్లు ఎత్తివేత ఇన్ ఫ్లో 92,800 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 94,721 క్యూసెక్కులు * ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ కు సిపిఐ నేత రామకృష్ణ లేఖ అమరావతి రైతులపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపడం తగదు

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు.. కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!

27-09-202027-09-2020 16:52:19 IST
2020-09-27T11:22:19.722Z27-09-2020 2020-09-27T11:22:09.061Z - - 26-10-2020

చేతులు మారుతున్న ఏపీలో పోర్టులు..  కాకినాడ పోర్టు అరబిందో కైవ‌సం?!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌రో పోర్టు చేతులు మార‌నుంది. ఇప్ప‌టికే కృష్ణ‌ప‌ట్నం పోర్టు అదానీ ప‌ర‌మైంది. ఇక తూర్పు గోదావ‌రి జిల్లాలోని కాకినాడ‌ పోర్టు వంతు వ‌చ్చింది. ఇది అత్యంత కీల‌క‌మైన పోర్టు. జీఎంఆర్‌కు చెందిన కాకినాడ సెజ్‌ను గ‌త వారం భారీ డీల్‌లో ద‌క్కించుకున్న అరబిందో రియ‌ల్టీ కంపెనీ... కాకినాడ పోర్టుపైనా క‌న్నేసింది. అత్య‌ధిక వాటా కైవసం చేసుకునేందుకు సిద్ధ‌మ‌వుతోంది. జీఎంఆర్ సంస్థ కాకినాడ సెజ్‌లో త‌మ‌కున్న వాటాలో 51 శాతాన్ని అర‌బిందో రియ‌ల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్ర‌క్చ‌ర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.2,160 కోట్ల‌కు అమ్మేసింది. 

జీఎంఆర్ సెజ్ కింద కాకినాడ వ‌ద్ద దాదాపు ప‌ది వేల ఎక‌రాలు ఉన్నాయి. కోన అనే గ్రామం వ‌ద్ద కొత్త పోర్టు నిర్మించాల్సి ఉంది. ఈ పోర్టు క‌ట్టాల్సిన అవ‌స‌రం లేకుండా కాకినాడ పోర్టునే టేకోవ‌ర్ చేస్తే ఎలా ఉంటుంద‌నే దిశగా అర‌బిందో రియ‌ల్టీ య‌జ‌మానులు దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే ఆ సంస్థ ప్ర‌తినిధులు పోర్టును ప‌రిశీలించారు. ప్ర‌భుత్వం వైపు నుంచి పూర్తి స్థాయి ప్రోత్సాహం వ‌స్తుండ‌డంతో ఒప్పందం కుదుర్చుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. అర‌బిందో ఫార్మా ప్ర‌మోట‌ర్లు నాలుగేళ్ల క్రిత‌మే రియ‌ల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇంకా ఏ ప్రాజెక్టూ పూర్తి చేసింది లేదు కానీ... సెజ్‌, పోర్టును చేజిక్కించుకునేందుకు ఆ సంస్థ అడుగులు వేస్తోంది.

కాకినాడ పోర్టు అర‌బిందో చేతుల్లోకి వెళుతుంద‌ని రేపో మాపో ప్ర‌క‌ట‌న వెలువ‌డినా ఆశ్చ‌ర్యం లేద‌ని సంబంధిత వ‌ర్గాలు అంటున్నాయి. ప్ర‌స్తుతం ఈ పోర్టు య‌జ‌మాని కేవీ రావు. ఆయ‌న వైఎస్ఆర్‌కు స‌న్నిహితుడు. వైస్ హ‌యాంలో ఈ పోర్టుకు ఎన్నో రాయితీలు ఇచ్చారు. ఈ పోర్టు విష‌యంలో ఎన్నో ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. వైఎస్ హ‌యాంలో అవినీతిపై అనేక ఆరోప‌ణ‌లు చేసిన టీడీపీ... కేవీ రావు విష‌యంలో మాత్రం మౌనం వ‌హించింది. చంద్ర‌బాబు సీఎం అయ్యాక కూడా ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్ట‌లేదు. కానీ, వైఎస్ కుమారుడు జ‌గ‌న్ సీఎం అయ్యాక కాకినాడ పోర్టుపై ఫోరెన్సిక్ ఆడిట్‌కు ఆదేశించారు. ఇప్పుడు ఏకంగా చేతులు మార‌నుంది. 

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

కరోనా సోకిందంటే దేవుడిచ్చిన విరామమే.. ఫడ్నవీస్

   an hour ago


మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   3 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   4 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   5 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   20 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   20 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   a day ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   25-10-2020


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle