పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు
29-11-202029-11-2020 14:20:01 IST
Updated On 29-11-2020 19:30:34 ISTUpdated On 29-11-20202020-11-29T08:50:01.292Z29-11-2020 2020-11-29T08:49:55.498Z - 2020-11-29T14:00:34.954Z - 29-11-2020

ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగిందన్న వార్త సంచలనం సృష్టిస్తోంది. ఓ దుండగుడు పేర్ని నానిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. మచిలీపట్నంలోని ఆయన ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తి తాపీతో దాడికి యత్నించాడు. మంత్రి నాని తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. నిందితుడిని పట్టుకున్న అనుచరులు.. దుండగుడిని పోలీసులకు అప్పగించారు. ఈ దాడిలో మంత్రి చొక్కా పూర్తిగా చినిగిపోయింది. దాడికి పాల్పడ్డ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నట్లు తెలుస్తోంది. తన తల్లి పెద్ద కర్మలో భాగంగా పూజ చేసి వస్తుండగా దాడికి ఓ వ్యక్తి ప్రయత్నించాడని చెప్పారు పేర్ని నాని. భోజన ఏర్పాట్లు చేయడంతో తన ఇంటికి చాలా మంది వచ్చారని చెప్పారు. అతడి చేతిలోని తాపీ తన ప్యాంటుకు తగిలిందని చెప్పారు. అనంతరం రెండో సారి కూడా తనపై దాడికి యత్నించాడని అన్నారు. తాను అప్రమత్తంగా ఉండడంతో తాను గాయపడలేదని తెలిపారు. తనపై ఎందుకు దాడికి యత్నించాడో తనకు తెలియదని తెలిపారు. దాడికి యత్నించిన వ్యక్తిని పోలీసులకు అప్పగించామని పేర్ని నాని తెలిపారు. నిందితుడిని మచిలీపట్నానికి చెందిన తాపీమేస్త్రి బడుగు నాగేశ్వరరావుగా పోలీసులు గుర్తించారు.

బిడ్డకు పట్టాభిషేకం.. కేసీఆర్ ముఖ చిత్రం ఎలా ఉంటుందో
18 minutes ago

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!
2 hours ago

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు
an hour ago

రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్
3 hours ago

జగన్ సర్కార్ కి మరో దెబ్బ.. ఎన్నికలు జరపాలని చెప్పిన హై కోర్టు
3 hours ago

రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?
2 hours ago

బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు
3 hours ago

భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు
4 hours ago

ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు
5 hours ago

పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే
6 hours ago
ఇంకా