newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!

13-04-202113-04-2021 16:29:38 IST
2021-04-13T10:59:38.307Z13-04-2021 2021-04-13T10:45:20.716Z - - 15-05-2021

ఆ వీడియో వార్తలపై అచ్చెన్న ఫైర్..!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని తప్పుడు వీడియోలు తీసుకొచ్చినా టీడీపీలో విభేదాలు సృష్టించలేవంటూ విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయకత్వంతో తిరుపతి ఉప ఎన్నిక‌కు టీడీపీ నాయకులు ఐకమత్యంతో పనిచేస్తుండడంతో నీకు ఓటమి భయం పట్టుకుందని అన్నారు.  నారా లోకేశ్ విసిరిన సవాల్ కు తోకముడిచావు. నిన్న తిరుపతిలో చంద్రబాబు సభపై రాళ్లు వేయించావు. ఇవాళ నా సంభాషణల్ని వక్రీకరించావని అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు చేశారు. నువ్వెన్ని విషపన్నాగాలు పన్నినా టీడీపీ విజయాన్ని అడ్డుకోలేవు... నారా లోకేశ్ తో నాకున్న అనుబంధాన్ని విడదీయలేవని అచ్చెన్నాయుడు చెప్పుకొచ్చారు. 

"నువ్వూ, నీ దొంగ సాక్షి ఎన్ని త‌ప్పుడు‌ వీడియోలు వేసినా టిడిపిలో విభేదాలు సృష్టించ‌లేవు జ‌గ‌న్‌రెడ్డి.టిడిపి జాతీయ అధ్య‌క్షుడు చంద్ర‌బాబుగారి నాయ‌క‌త్వంలో తిరుప‌తి ఎన్నిక‌కు ఐక‌మ‌త్యంగా ప‌నిచేస్తుండ‌డంతో నీకు ఓట‌మి భ‌యం ప‌ట్టుకుంది.  నారా లోకేష్ విసిరిన స‌వాల్‌కి తోక‌ముడిచావు. నిన్న బాబుగారి స‌భ‌పై రాళ్లేయించావు. ఈ రోజు నా సంభాష‌ణ‌ల్ని వ‌క్రీక‌రించావు. ఎన్ని విష‌ప‌న్నాగాలు ప‌న్నినా తెలుగుదేశం విజ‌యాన్ని ఆప‌లేవు. నారా లోకేష్‌తో నాకున్న అనుబంధాన్ని విడ‌దీయ‌లేవు." అంటూ అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. 

అచ్చెన్నాయుడు దగ్గర ఓ వ్యక్తి తన బాధను వ్యక్తం చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉంది. పోలింగ్ 17న అయిపోతే అంద‌రం ఫ్రీ అయిపోతాం. పార్టీ లేదు.. బొక్కా లేదు. (మీరేమ‌న్నా అనుకోండి సార్‌. పార్టీ ప‌ని అయిపోయిందని అదృశ్య వ్య‌క్తి అచ్చెన్న‌తో అంటాడు) ఫీల్ అయితే మ‌న‌కేముంది. ఫ‌స్ట్ నుంచి ఓ ప‌ట్టు ప‌ట్టుకున్నాం కాబ‌ట్టి అలా వెళుతుంది. లోకేశే బాగుంటే పార్టీకి ఈ ప‌రిస్థితి ఎందుకొస్తుందన్న సంచలన వ్యాఖ్యలు ఉన్న వీడియో ప్రస్తుతం వైరల్ అవుతూ ఉంది. ఒక‌ప్పుడు లోకేశ్ 'అన్నా' అని పిలిచేవాడ‌ని, ఇప్పుడు ఏమ్మా అని అంటున్నాడ‌ని.. ఇటీవ‌ల విజ‌యవాడ‌లో పార్టీ ఆఫీస్‌లో క‌లిశాన‌ని, క‌నీసం ప‌ట్టించుకోలేద‌ని అత‌ను ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. త‌న‌కు కేఎల్ నారాయ‌ణ అనే వ్య‌క్తి ఆరు కోట్ల రూపాయ‌లు ఇవ్వాల‌ని, క‌నీసం మూడు కోట్లైనా ఇప్పించాల‌ని లోకేశ్‌ను వేడుకున్న‌ట్టు ఆ వ్యక్తి వాపోయాడు.  30 ఏళ్ల నుంచి పార్టీకి సేవ‌లు చేస్తున్నా, ప‌ట్టించుకునే దిక్కులేద‌ని అత‌ను వాపోయాడు. క‌నీసం ఫోన్లు కూడా ఎత్త‌డం లేద‌ని, ఇంత దౌర్భాగ్య ప‌రిస్థితి ఏంట‌ని అత‌ను ప్ర‌శ్నించాడు.  టీడీపీ ప‌ని అయిపోయింద‌ని స‌ద‌రు అదృశ్య వ్య‌క్తి చెప్ప‌గా, అచ్చెన్న కూడా అదే మాట చెప్పినట్లుగా వీడియో ఉంది. ఈ వీడియోను ఎడిట్ చేశారని టీడీపీ నాయకులు అంటున్నారు. 

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   13 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   21 hours ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   21 hours ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   18 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


మిస్ట‌ర్ క్యూ పీఎం

మిస్ట‌ర్ క్యూ పీఎం

   13-05-2021


ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

ఆంధ్రప్రదేశ్ లో నెత్తురోడిన రోడ్లు..!

   13-05-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle