విజయమ్మకు అచ్చెన్నాయుడు సవాల్..!
07-04-202107-04-2021 09:48:45 IST
Updated On 07-04-2021 12:00:32 ISTUpdated On 07-04-20212021-04-07T04:18:45.585Z07-04-2021 2021-04-07T04:18:39.297Z - 2021-04-07T06:30:32.009Z - 07-04-2021

వైఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో కచ్చితంగా గుర్తించి శిక్షించాలని వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి విజయమ్మ డిమాండ్ చేశారు. ఇది తనతో సహా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఇందులో ఎవరికీ రెండు అభిప్రాయాలు లేవన్నారు. వివేకా హత్య ఎవరు చేశారో నిగ్గు తేల్చాల్సిందేనని స్పష్టం చేశారు. ఇది నా మాట, జగన్ మాట, షర్మిల మాట అని తేల్చి చెప్పారు. ఈ విషయంలో తమ కుటుంబానికి మరో అభిప్రాయం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు విజయమ్మ 5 పేజీల బహిరంగ లేఖ రాశారు. నాడు వైఎస్ ది ప్రమాదవశాత్తు సంభవించిన మరణమా? లేక హత్యా? అని తమకు అనుమానం వచ్చినా, ఏంచేయలేకపోయామని తెలిపారు. జగన్ తన కేసు అయినా, తన బాబాయ్ కేసు అయినా సీబీఐ దర్యాప్తు చేస్తున్నప్పుడు ఏం చేయగలడని విజయమ్మ ప్రశ్నించారు. 5 పేజీల బహిరంగ లేఖను విజయమ్మ విడుదల చేశారు. ఈ బహిరంగ లేఖపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. వైసీపీ మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో పులివెందుల రాజన్నకోట రహస్యం ప్రపంచానికి తెలియాలని అచ్చెన్నాయుడు ట్వీట్ చేశారు. పుత్రప్రేమ పొరలు కమ్మేయడం వల్ల విజయమ్మ రక్తపు మరకలు తుడిచే లేఖలు రాస్తోందని అచ్చెన్నాయుడు విమర్శించారు. 'సునీత కూడా మీ షర్మిలలాంటి బిడ్డే కదమ్మా... ఆమెకు న్యాయం చేయాల్సిన బాధ్యత మీకు లేదా?' అని నిలదీశారు. 'మీ మరిది హత్యతో మీ కుటుంబంలోని ఏ ఒక్కరికీ సంబంధంలేదని బైబిల్ సాక్షిగా చెప్పగలవా?" అంటూ విజయమ్మకు సవాల్ విసిరారు. బాత్రూంలో బాబాయ్ పై పడిన గొడ్డలి పోటుకు సమాధానం చెప్పాల్సింది అబ్బాయేనని తెలిపారు. నాడు ఈ కేసులో సీబీఐ విచారణ కోరిన జగన్ నేడు సీబీఐ విచారణ అంటే ఎందుకు ఉలిక్కిపడుతున్నాడని ప్రశ్నించారు. ఏప్రిల్ 7,8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో సెలవులు.. ఎడమచేతి చిటికెన వేలుకు సిరా గుర్తు

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
12 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
14 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
21 hours ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా