newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు

22-04-202122-04-2021 16:01:16 IST
Updated On 22-04-2021 14:14:21 ISTUpdated On 22-04-20212021-04-22T10:31:16.971Z22-04-2021 2021-04-22T07:44:16.434Z - 2021-04-22T08:44:21.065Z - 22-04-2021

 సీఎం జగన్ ను లేఖలతో టార్గెట్ చేసిన అచ్చెన్న, సోము వీర్రాజు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా కష్ట కాలాల్లో ప్రైవేట్ టీచ‌ర్లు ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నారు. సరైన ఉపాధి లేక ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారో స‌మ‌స్య‌ల‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌కు టీడీపీ ఏపీ అధ్య‌క్షుడు అచ్చెన్నాయుడు బ‌హిరంగ‌ లేఖ రాశారు. కరోనా దెబ్బకు వారి బతుకులు దుర్భరంగా మారాయని, ప్రైవేటు టీచ‌ర్ల ప‌ట్ల నిర్ల‌క్ష్యం త‌గ‌ద‌ని అన్నారు. భావి భారత పౌరులుగా విద్యార్థుల‌ను తీర్చిదిద్దటంలో టీచ‌ర్ల‌ పాత్ర కీలకమ‌ని, అటువంటి ఉపాధ్యాయులు ఇప్పుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని అన్నారు.

క‌రోనా దెబ్బ‌కు టీచ‌ర్లు కార్మికులుగా మారారని.. వారి సంక్షేమం ప‌ట్ల ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డం త‌గ‌ద‌ని అన్నారు. ఉపాధి కోల్పోయిన బోధ‌న‌, బోధ‌నేత‌ర సిబ్బందిని ప్ర‌భుత్వం ఆదుకోవాల‌ని, వారికి రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాల‌ని డిమాండ్ చేశారు. ప్రైవేటు ఉపాధ్యాయులు క‌రోనా వ‌ల్ల‌ ఆకలితో అలమటిస్తున్నారని.. ప్రైవేట్ టీచ‌ర్లను ప‌లు రాష్ట్రాలు ఆదుకుంటున్నాయ‌ని ఏపీలో మాత్రం స‌ర్కారు ఆదుకోవ‌ట్లేద‌ని విమ‌ర్శించారు.

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షలపై చర్చ కొనసాగుతూ ఉంది. చాలా రాష్ట్రాల్లో పదో తరగతి విద్యార్థులను ప్రమోట్ చేసేయగా.. ఆంధ్రప్రదేశ్ లో ఆ పని ఎందుకు చేయడం లేదనే విమర్శలు వస్తూనే ఉన్నాయి. తాజాగా ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు కూడా పదోతరగతి, ఇంటర్ పరీక్షలపై సీఎం జగన్ కు లేఖ రాశారు. పరీక్షలు రద్దు చేయమనకుండా.. వాయిదా వేయాలని కోరారు. కరోనా సెకండ్ వేవ్ ఉద్ధృతిని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో పదో తరగతి, ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాల్సిన అవసరముందని సోము వీర్రాజు అభిప్రాయపడ్డారు. 

1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థులకు పరీక్షలను రద్దు చేసి పై తరగతులకు ప్రమోట్ చేశారని.. టెన్త్, టర్ విద్యార్థులకు మాత్రం షెడ్యూల్ ప్రకారం పరీక్షలు నిర్వహిస్తామనడం సరికాదన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జూన్ నెలలో పరీక్షల నిర్వహణ పెద్ద సమస్యగా మారుతుందన్నారు. ఎగ్జామ్స్ రాసేందుకు విద్యార్థులు బస్సులు, ఆటోల్లో పరీక్షా కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుందని.. ఈ నేపథ్యంలో వైరస్ సోకే ప్రమాదముందని సోము వీర్రాజు హెచ్చరించారు. కాబట్టి విద్యార్థుల భద్రత, రక్షణను దృష్టిలో పెట్టుకుని పరీక్షలను వాయిదా వేయాలని విజ్ఞప్తి చేశారు. 


Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle