newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వెళ్తున్నారా.. ముందు ఇది చ‌ద‌వండి!

13-10-202013-10-2020 17:09:12 IST
Updated On 14-10-2020 12:26:26 ISTUpdated On 14-10-20202020-10-13T11:39:12.903Z13-10-2020 2020-10-13T11:39:08.419Z - 2020-10-14T06:56:26.977Z - 14-10-2020

దుర్గ‌మ్మ ద‌ర్శ‌నానికి వెళ్తున్నారా.. ముందు ఇది చ‌ద‌వండి!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
మొక్కున్నా.. ద‌ర్శ‌నానికే అయినా.. పండ‌గ స్పెష‌లే అయినా స‌రే. బెజవాడ దుర్గ‌మ్మ‌ను ద‌ర్శించుకోవాలంటే స్ట్రిక్ట్ రూల్స్ ని ఫాలో కాక త‌ప్ప‌దు. క‌రోనా టైం మామూలుగానే అమ్మ‌వారి దర్శ‌నానికి ర‌ష్ ఉంటుంది. ఇక ద‌స‌రా కావ‌డంతో భ‌క్తుల ర‌ష్ ఎక్కువ‌గా ఉంటుంది. అందుకే అధికారులు కూడా జాగ్ర‌త్త‌లు ఎక్కువ‌గా తీసుకుంటున్నారు. ఈనెల 17 నుంచి 25 వ‌ర‌కు అమ్మ‌వారి ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్నాయి. ఈ టైంలో టిక్కెట్లు ఉన్న‌వారిని మాత్ర‌మే ద‌ర్శ‌నానికి అనుమ‌తిస్తామ‌ని చెప్పారు.. క‌లెక్ట‌ర్ ఏఎండీ ఇంతియాజ్. క్యూ లైన్ల‌లో భ‌క్తుల‌కు శానిటైజ‌ర్లు అందుబాటులో ఉంచుతామ‌న్నారు. సాధార‌ణ రోజుల్లో 10 వేల టిక్కెట్లు.. మూలా న‌క్ష‌త్రం రోజున‌ 13 వేల టిక్కెట్లు ఇస్తామ‌న్నారు.

గంట‌కు వెయ్యి మంది చొప్పున రోజూ ప‌దివేల మందికి అమ్మ‌వారి ద‌ర్శ‌న భాగ్యం క‌లిగేలా తీసుకుంటామ‌న్నారు ఆఫీస‌ర్లు. అలాగే ప‌దేళ్ల లోపు పిల్ల‌ల్ని, 65 ఏళ్ల నిండిన పెద్ద వారిని, గ‌ర్భిణీల‌ను, దివ్యాంగుల‌ను ద‌ర్శ‌నానికి అనుమ‌తించ‌డం లేద‌న్నారు. కరోనా కార‌ణంగా ఇతర జిల్లాల పోలీసుల‌ను బందోబ‌స్తు కోసం పిల‌వ‌డం లేద‌న్నారు ఆఫీస‌ర్లు. టిక్కెట్లు కూడా ఆన్ లైన్ లో బుక్ చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. ఇప్ప‌టికే ల‌క్ష టిక్కెట్లు ఆన్ లైన్ లో ఉంచ‌గా.. ఆల్ర‌డీ 70 వేల టిక్కెట్లు బుక్ చేసుకున్నార‌ట‌. మిగిలిన టిక్కెట్లు కూడా ఉత్స‌వాల‌కు ముందే బుక్ అయ్యే అవ‌కాశం ఉంది. సో టిక్కెట్ కౌంట‌ర్ల ద‌గ్గ‌ర నుంచున్నా ఉప‌యోగం లేన‌ట్లే క‌నిపిస్తోంది. సో.. బుక్ చేసుకోని వారు ద‌ర్శ‌న భాగ్యంపై ఆశ‌లు పెట్టుకోకుండా.. దొర‌క్క పోవ‌చ్చునేమో అనుకుంటూ వెళ్తేనే మంచిది. లేదంటే ముందే వెళ్లి తీసుకోవ‌డం ఉత్త‌మం.

ఇక అన్ని జిల్లాల‌కు సంబంధించి దీక్ష‌ల గురువుల‌తో కూడా మాట్లాడార‌ట‌. ఆల‌యంలో మాల ధార‌ణ‌, మాల విర‌మ‌ణ లాంటివి అనుమ‌తించ‌డం లేదు. కాబ‌ట్టి.. అంద‌రూ వారి వారి గ్రామాల్లో మాల విర‌మ‌న చేసుకుని రావాల‌న్నారు అధికారులు. తెప్పోత్స‌వం మాత్రం య‌థావిధిగా జ‌రుగుతుంద‌ట‌. దానికి మాత్రం.. క‌రోనా కార‌ణంగా కొత్త‌గా వ‌చ్చిన రూల్స్ ఏమీ లేవ‌న్నారు.

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle