newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

నేటి నుంచి 26 వరకు దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు

16-10-202016-10-2020 12:46:14 IST
2020-10-16T07:16:14.621Z16-10-2020 2020-10-16T07:16:06.717Z - - 21-10-2020

నేటి నుంచి 26 వరకు దసరాకు 1,850 ప్రత్యేక బస్సులు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
విజయదశమి -దసరా- పండుగ సందర్భంగా డిమాండును తట్టుకునేందుకు మొత్తం 1,850 ప్రత్యేక సర్వీసులను నడపనున్నట్లు ఏపీఆర్టీసీ పేర్కొంది. సంస్థ విడుదల చేసిన ప్రకటన మేరకు ఈ శుక్రవారం నుంచి ఈ నెల 26 వరకు ప్రయాణికుల డిమాండ్‌ను బట్టి ప్రత్యేక బస్సులు ఆయా రూట్లలో తిరగనున్నాయి. ప్రస్తుతం ఏపీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంలో అన్ని ప్రాంతాలకు, కర్ణాటకకు కలిపి 5,950 రెగ్యులర్‌ సర్వీసులను తిప్పుతోంది. వీటికి అదనంగా 1,850 ప్రత్యేక బస్సులను నడపనుంది. సాధారణంగా ఏటా దసరా పండుగకు 2,500కు పైగా ప్రత్యేక బస్సుల్ని ఆర్టీసీ నడిపేది. తెలంగాణతో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరకపోవడంతో ఈ దఫా ప్రత్యేక బస్సుల సంఖ్య తగ్గిపోయింది.

ఇప్పటికే ఏపీఎస్‌ఆర్టీసీ 1.61 లక్షల కిలోమీటర్లకు పరిమితమై 322 బస్సుల్ని తగ్గించుకునేందుకు సిద్ధపడినా టీఎస్‌ఆర్టీసీ ప్రస్తుతం కొత్త మెలికలు పెడుతోంది. ఏపీఎస్‌ఆర్టీసీ నడిపే బస్సుల టైం కూడా తామే నిర్దేశిస్తామని చెప్పడం గమనార్హం. ఇదిలా ఉండగా పండుగ నేపథ్యంలో బెంగళూరుకు 562 ప్రత్యేక బస్సులను ఆర్టీసీ అధికారులు తిప్పనున్నారు. అయితే కరోనాను దృష్టిలో ఉంచుకుని తమిళనాడు ఇంకా అనుమతించకపోవడంతో ఏపీఎస్‌ఆరీ్టసీ ఆ రాష్ట్ర సరిహద్దుల వరకే బస్సులను నడపనుంది. 

ఆర్టీసీ తగవుతో ప్రైవేట్ యజమానులకు పండుగ

తెలంగాణ ఆర్టీసీ మొండి వైఖరితో అంతర్రాష్ట్ర ఒప్పందం కుదరని పరిస్థితుల్లో ప్రైవేటు ఆపరేటర్లు జోరు పెంచారు. హైదరాబాద్‌ నుంచి ఏపీలోని అన్ని ప్రాంతాలకు ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల్ని తిప్పేందుకు సిద్ధమయ్యారు. ప్రతిరోజూ ఏపీ నుంచి ఇతర ప్రాంతాలకు, ఇతర ప్రాంతాల నుంచి ఏపీకి 750 ప్రైవేటు బస్సులు తిరుగుతున్నాయి. మరోవైపు దసరా పండుగను దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్‌ఆర్టీసీకి అధిక ఆదరణ ఉన్న విజయవాడ–హైదరాబాద్, తిరుపతి–హైదరాబాద్, విశాఖ–హైదరాబాద్‌ రూట్లలో ప్రైవేటు ఆపరేటర్లు ఇప్పటికే ఆన్‌లైన్‌ రిజర్వేషన్లు ప్రారంభించారు. టికెట్ల ధరలను పెంచి సొమ్ము చేసుకునేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. దీనిపై రవాణా శాఖ కమిషనర్‌ స్పందిస్తూ.. ప్రైవేటు ట్రావెల్స్‌ వారు అధిక రేట్లు వసూలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.

ఆర్టీసీ జిల్లాలవారీగా నడిపే ప్రత్యేక బస్సుల వివరాలు

శ్రీకాకుళం, విజయనగరం–66, 

విశాఖపట్నం–128, 

తూర్పుగోదావరి–342, 

పశ్చిమగోదావరి–40, 

కృష్ణా–176, 

గుంటూరు–50, 

ప్రకాశం–68, 

నెల్లూరు–156, 

చిత్తూరు–252, 

కర్నూలు–254, 

కడప–90, 

అనంతపురం–228   

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో మేము నడిపే రూట్లు అత్యధిక డిమాండ్ ఉండే రూట్లు. ఈ రూట్లలో ప్రతి బస్సుకూ 75 శాతం ఆక్యుపెన్సీ రేషియో ఉంటుంది. మా సర్వీసులను తగ్గించుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించడం కంటే ఆంధ్రకు తెలంగాణ నడిపే బస్సుల సంఖ్యను పెంచుకోవాలని మేం సూచించాము. కానీ వారు తమ బస్సుల సంఖ్యను పెంచుకోవడానికి బదులుగా తెలంగాణలో మేం నడుపుతున్న బస్సులను లక్షా 61 వేల కిలోమీటర్ల పరిధికి తగ్గించుకోవాలని చెబుతున్నారు అని ఏపీఆర్టీసీ ఎండీ, రవాణా శాఖ ప్రధాన కార్యదర్సి ఎంటి కృష్ణబాబు చెప్పారు. లాభదాయకంగా ఉన్న మార్గాల్లో ఆర్టీసీ బస్సులను తిప్పకపోతే ఆదాయ నష్టాలతోపాటు ప్రజలకు తీవ్రమైన అసౌకర్యం కలుగుతుంది. ఇది ప్రైవేట్ బస్ ఆపరేచటర్లకు మాత్రమే మేలు కలిగిస్తుంది అని కృష్ణ బాబు విచారం వ్యక్తం చేశారు.


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle