newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?

23-01-202123-01-2021 15:42:28 IST
Updated On 23-01-2021 16:22:04 ISTUpdated On 23-01-20212021-01-23T10:12:28.319Z23-01-2021 2021-01-23T10:12:23.092Z - 2021-01-23T10:52:04.872Z - 23-01-2021

ఎన్నిక‌ల‌కు వెళ్ల‌కుంటే.. ఏపీ స‌ర్కార్ కి సీరియ‌స్ ప్రాబ్ల‌మే.. ఎలాగో తెలుసా..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చ‌ట్టానికి న్యాయానికి జ‌రుగుతున్న ఈ స‌మ‌రంలో అనే పాట ఇక్క‌డ స్యూట్ కాక‌పోవ‌చ్చు. కానీ.. పై పైన చూస్తే మాత్రం అట్టాగే ఉంది. చ‌ట్టం ఏం చెబుతుంద‌య్యా అంటే.. ఏపీలో పంచాయితీ ఎన్నిక‌ల నిర్వ‌హించండి అంటోంది. న్యాయాలు ఏం చెబుతున్నాయ‌య్యా అంటే.. మా ప్రాణాలు అర‌చేతిలో పెట్టుకుని క‌రోనా ఇంత ఉధృతంగా ఉన్న స‌మ‌యంలో వ్యాక్సినేష‌న్ కాకుండా ఎన్నిక‌లు ఎట్టా జ‌ర‌పాలి అంటోంది జగన్ స‌ర్కార్. కానీ.. ఇందులో న్యాయం ఏముంది అనే  విష‌యం అంద‌రికీ తెలిసిందే. జ‌నం క‌రోనా గురించి కంగారు ప‌డ‌డం లేదు. వ్యాక్సినేష‌న్ ఓ ప‌క్క‌న జ‌రుగుతున్నా.. ఇంకో ప‌క్క ఎన్నిక‌లు జ‌రుపుకోవ‌చ్చు. అస‌లు ఎన్నిక‌ల ప్రాసెస్ ఏమైనా ఏడాది పాటు జ‌రుగుతుందా అంటే అదేం లేదు. గ‌ట్టిగా మాట్లాడితే ఓ ప‌ది ప‌న్నెండు రోజులు అంతే. ఇంత‌లో ఏం కొంప‌లు అంటుకు పోతున్న‌య్ అని నిల‌దీస్తే.. ఉద్యోగులు ఏం చెబుతారు అనేది క్వ‌శ్చ‌న్. కానీ.. మా ప్రాణాలు క‌దా.. వ్యాక్సినేష‌న్ వేయ‌డం జ‌నం ప్రాణాల‌కి సంబంధించిన విష‌యం క‌దా అంటారు ఉద్యోగులు.

కానీ.. ఓ ప‌ది రోజుల పాటు ఎన్నిక‌ల‌పై ఫోక‌స్ చేయండి.. అంద‌రూ క‌లిసి.. ఏడాది పాటైనా.. వ్యాక్సినేష‌న్ పై ఫోక‌స్ చేయొచ్చు అని ఎన్నిక‌ల క‌మిష‌న్ చెబితే.. ఉద్యోగుల ద‌గ్గ‌ర నో ఆప్ష‌న్. అస‌లు ఇప్పుడు సెకండ్ ఫేజ్ వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ ప్రారంభ‌మే కాలేదు. ఈలోగా.. ఎన్నిక‌ల తంతు పూర్తి అవుతుంది. అప్పుడు తీరిగ్గా.. జాగ్ర‌త్త‌గా ప్ర‌జ‌ల మేలు కోరి.. వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని స‌ర్కార్ ఉద్యోగులు హ్యాప్పీగా.. జాగ్ర‌త్త‌గా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ పై ఫోక‌స్ చేయొచ్చు. కానీ.. ఏపీ ఉద్యోగులేమో.. లేదు లేదు అంటున్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టు దాకా వెళ్తే ఏం జ‌రుగుతుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ అయింది.

నోటిఫికేష‌న్ కి ముందే సుప్రీం కోర్టుకి వెళ్తే.. సుప్రీం కానీ.. ఎన్నిక‌ల ప్రాసెస్ పై స్టే ఇస్తే అది వేరేలా ఉండేది. కానీ.. పిటిష‌న్ లో ఉన్న తప్పుల కార‌ణంగా అది జ‌ర‌గ‌లేదు. ఇప్పుడు సుప్రీం కోర్టు ఏం చెబుతుంది అనేది ఇంపార్టెంట్ పాయింట్ అయింది. ఎలాగూ.. ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చింది క‌దా.. ద‌గ్గ‌ర్లోనే ఉంది క‌దా.. అయిపోయాక ఎక్కువ ఫోక‌స్ చేసి.. వ్యాక్సిన్ వేయండి.. అప్ప‌టిలోగా.. ఈ ఎన్నిక‌లు కంప్లీట్ చేసుకోండి అంటే.. ఏపీ స‌ర్కార్ ఏం చెప్ప‌బోతుంది. ఉద్యోగులు ఎన్నిక‌ల క‌మిష‌న్ కి స‌పోర్ట్ చేయ‌క‌పోతే.. సుప్రీం తీవ్రంగా రియాక్ట్ అయ్యే ఛాన్స్ అయితే ఫుల్ గా ఉంది. అప్పుడు జ‌గ‌న్ స‌ర్కార్ కి క‌ష్టాలు ఫుల్లుగా వ‌చ్చిన‌ట్లే. కోర్టు దిక్క‌ర‌ణ కింద ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ కానీ.. పిటిష‌న్ వేసి.. మాకు స‌హ‌క‌రించ‌డం లేదు అంటే.. ప్ర‌భుత్వం ఫ్లాప్ అవుతుంది. అప్పుడు కానీ.. గ‌వ‌ర్న‌ర్ యాక్ష‌న్ తీసుకుని.. ఏపీలో స‌ర్కార్ ఫ్లాప్ అయింది అంటే మాత్రం.. సుప్రీం సీరియ‌స్ గా రియాక్ట్ అవుతుంది. అవ‌స‌ర‌మైతే.. స‌ర్కార్ ని ర‌ద్దు చేసే దాకా వెళ్తుంది. స‌ర్కార్ ని ర‌ద్దు చేయండి.. అక్క‌డ రాజ్యంగ సంస్థ‌లు ఫ్లాప్ అయ్యాయి అని సుప్రీం చెప్పిందంటే.. ఆ ప్రాసెస్ కేంద్రం చేతిలోకి వెళ్తుంది.

కేంద్రం చేతిలోకి గానీ ఇష్యూ వెళ్లిందంటే జ‌గ‌న్ స‌ర్కార్ కి తిప్ప‌లు త‌ప్ప‌వు. కేంద్రం చెప్పిన‌ట్లు వినాల్సిన అవ‌స‌రం క‌చ్చితంగా ఉంటుంది. లేదంటే ఏపీ స‌ర్కార్ మొత్తానికే న‌ష్టం త‌ప్ప‌దు. అప్పుడు బీజేపీకి వైసీపీకి మ‌ధ్య‌లో ఉన్న రిలేష‌న్ ఒక్క‌టే బ‌లంగా మారుతుంది. ఏపీ స‌ర్కార్ పై కేంద్రం యాక్ష‌న్ తీసుకునే అవ‌కాశాలు నిండుగా ఉంటాయి. అప్పుడు ఏపీ సీఎం జ‌గ‌న్ ప‌రిస్థితి ఏంటి.. బీజేపీకి, వైసీపీ స‌ర్కార్ కి మ‌ధ్య‌లో ఏం జ‌ర‌గ‌బోతుంది అనేది మెయిన్ పాయింట్ గా మారుతుంది. ఒక వేళ జ‌గ‌న్ స‌ర్కార్ పై కేంద్రం సీరియ‌స్ అయితే.. మొత్తానికే న‌ష్టం వ‌స్తుంది. సో.. ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ తో ఉన్న విభేదాల వ‌ల్ల‌.. పంతాల‌కు పోయి సీఎం జ‌గ‌న్ ఇంత దాకా తెచ్చుకుంటారా.. లేదంటే ముందే ఎన్నిక‌ల‌కి ఓకే చేసి.. ఇష్యూని కూల్ చేస్తారా అనేది హాట్ న్యూస్ ఇప్పుడు.

ఆల్రెడీ ఏపీలో ఎన్నిక‌ల నోటిఫికేష‌న్ వ‌చ్చింది. ఆ ప‌నుల్లో బిజీగా ఉన్నారు ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్. మ‌రి సుప్రీం కోర్టులో స్టే వ‌స్తే ఓకే.. ఒక వేళ సుప్రీం కోర్టులో కానీ.. ఎన్నిక‌ల‌కే వెళ్లండి అంటే.. జ‌గ‌న్ స‌ర్కార్ కి నో ఆప్ష‌న్. తీగ తెగే దాకా లాగిన‌ట్లే అవుతుంది. ఎలాగూ నోటిఫికేష‌న్ కూడా వ‌చ్చేసింది.. ఎన్నిక‌లకి ఎంతో టైం లేదు. ప్ర‌శాంతంగా ఎన్నిక‌లు జ‌రుపుకుని.. వ్యాక్సినేష‌న్ కి వెళ్తే.. ఏ గోలా ఉండ‌దు. లేదంటే.. సుప్రీం తీర్పు నెగ‌టివ్ గా వ‌చ్చిన త‌ర్వాత కూడా మొండికేస్తే మాత్రం క‌చ్చితంగా మొద‌టికే మోసం వ‌స్తుంది. మ‌రి జ‌గ‌న్ స‌ర్కార్ అంత దూరం వెళ్తుందా.. ఓ మెట్టు వెన‌క్కి త‌గ్గి.. ఎన్నిక‌లు నిర్వ‌హిస్తుందా అన్న విష‌యం.. నెక్స్ట్ వ‌చ్చే సుప్రీం తీర్పు పై మాత్ర‌మే ఆధార ప‌డి ఉంది. ఇది  క‌చ్చితంగా జ‌గ‌న్ స‌ర్కార్ కి చివ‌రి అవ‌కాశం లాంటిదే. ఏ మాత్రం తేడా వ‌చ్చినా.. ఇష్యూ చాలా పెద‌ద్ది అవుతుంది అనే విష‌యంలో మాత్రం.. పొలిటిక‌ల్ అన‌లిస్టులు చాలా క్లియ‌ర్ గా చెబుతున్నారు.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్

   3 hours ago


బీజేపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్.. భార్య ఒత్తిడే కార‌ణ‌మా

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియ‌ర్ లీడ‌ర్.. భార్య ఒత్తిడే కార‌ణ‌మా

   3 hours ago


విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ స‌ర్కార్ కు ముందే తెలుసు

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ స‌ర్కార్ కు ముందే తెలుసు

   5 hours ago


వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?

   40 minutes ago


నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్

   20 hours ago


కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!

   a day ago


కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు

   a day ago


వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం

   a day ago


ఇదేం  అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

ఇదేం అన్యాయం.. హ‌ర్ట్ అయిన విడ‌ద‌ల ర‌జ‌నీ ఫ్యాన్స్

   a day ago


దేశ వ్యాప్తంగా ఆ నియోజ‌క వ‌ర్గం గెలుపు పై ఫోక‌స్

దేశ వ్యాప్తంగా ఆ నియోజ‌క వ‌ర్గం గెలుపు పై ఫోక‌స్

   12 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle