newssting
Radio
BITING NEWS :
సింగపూర్‌లో జరిగిన అందాల పోటీల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువతి బాన్న నందిత(21) మొదటి స్థానంలో నిలిచి కిరీటం గెల్చుకుంది. మిస్‌ యూనివర్స్‌ సింగపూర్‌-2021గా ఎన్నికయ్యింది నందిత. * పంజాబ్‌ కొత్త ప్రభత్వం సోమవారం కొలువుదీరింది. నూతన ముఖ్యమంత్రిగా దళిత సిక్కు నాయకుడు చరణ్‌జిత్‌ సింగ్‌ చన్నీ ప్రమాణ స్వీకారం చేశారు. పంజాబ్‌లో తొలి దళిత సీఎంగా చన్నీ రికార్డు సృష్టించారు. * ఏపీలో 7212 ఎంపీటీసీ స్థానాలకు ఫలితాలు విడుదల కాగా.. వైఎస్సార్‌సీసీ 5998 స్థానాలతో నిలిచింది. కాగా, టీడీపీ 826 స్థానాలకు పరిమితమైంది. అదే విధంగా 512 జడ్పీటీసీ స్థానాల్లో ఫలితాల్ని ప్రకటించగా, వైఎస్సార్‌సీసీ 502 స్థానాలు గెలుచుకుంది. టీడీపీ-6, జనసేన-2, సీసీఎం-1,ఇతరులు-1 జడ్పీటీసీ స్థానాలకు పరిమితమయ్యాయి. * తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామరావు ట్విటర్‌ వేదికగా ఓటుకు కోట్లు కేసులో లై డిటెక్టర్‌ పరీక్షకు రేవంత్‌ సిద్ధమా? అని సవాల్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా, ఈ ట్వీట్‌కు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి స్పందించారు. * ఐటీ దాడులపై సోమవారం (సెప్టెంబర్‌ 20న) సోషల్‌ మీడియాలో సోనూసూద్‌ స్పందించాడు. ‘ప్రజలకు సేవ చేయాలని నాకు నేనుగా ప్రతిజ్ఙ చేశాను. నా ఫౌండేష‌న్‌లో ప్ర‌తి రూపాయి పేదలు, అవసరమైన వారికి ఉపయోగపడేందుకు ఎదురుచూస్తోంది. సంస్థ ముందుకు వెళ్లేలా ఉపయోగపడేందుకు మానవత దృక్పథంతో కొన్ని బ్రాండ్లను ఎంకరేజ్‌ చేశాను. * జాతీయ ఓపెన్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌ చివరిరోజు ఆంధ్రప్రదేశ్‌ అథ్లెట్‌ నల్లబోతు షణ్ముగ శ్రీనివాస్‌ పురుషుల 200 మీటర్ల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఫైనల్‌ రేసును శ్రీనివాస్‌ 21.12 సెకన్లలో ముగించి మూడో స్థానంలో నిలిచాడు.

జనసేనకి మళ్ళీ చుక్కెదురే..

26-07-202126-07-2021 08:55:28 IST
2021-07-26T03:25:28.254Z26-07-2021 2021-07-26T03:25:24.294Z - - 21-09-2021

జనసేనకి మళ్ళీ చుక్కెదురే..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలలో చూపించే సత్తా రాజకీయాలలో చూపించలేకపోతున్నారు. తాను అధికారం కోసం కాదు, ప్రశ్నించడం కోసమే జనసేన పార్టీ పెట్టానని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఆ ప్రశ్నించడం కూడా సరైన పద్దతిలో చేయడం లేదన్న విమర్శ పవన్ పై ఉన్నది. తన సినిమా షూటింగ్ లని చేసుకుని మధ్యలో గ్యాప్ వస్తే ఆ గ్యాప్ లో ఎపి లో నెలకొన్న కొన్ని సమస్యల పై ఎదో స్పందిచాలి కాబట్టి స్పందిచినట్టుగా ఉండే ఆయన స్పీచ్ లని ప్రజలు పట్టించుకోవడం లేదని ఏలూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో రుజువయ్యింది. ఏలూరులో 20 డివిజన్లలో పోటీకి దిగిన జనసేన పార్టీ విస్తృత స్థాయిలో ప్రచారం నిర్వహించినా ఒక్కచోట కూడా బోణీ కొట్టకపోగా కనీసం గౌరవప్రదమైన ఓట్లు కూడా దక్కించుకోలేకపోయింది.

ఇక టిడిపి విషయానికొస్తే గత ఎన్నికల్లో 50 డివిజన్లకు గాను 43 డివిజన్లలో గెలుపొందిన టీడీపీ ఈసారి దారుణ పరాజయాన్ని చవిచూసింది. కేవలం మూడు స్థానాలు మాత్రమే ఆ పార్టీకి దక్కాయి. 28, 37, 47 డివిజన్లలో టీడీపీ అభ్యర్థులు గెలుపొందారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ నాలుగు డివిజన్లలో విస్తృతంగా ప్రచారం నిర్వహించినా ఫలితం దక్కలేదు. 2014తో పోలిస్తే ఇప్పుడు సీన్‌ రివర్స్‌ అయింది. గత ఎన్నికల్లో టీడీపీ 43, వైఎస్సార్‌సీపీ 7 డివిజన్లలో గెలుపొందాయి. నాడు వైఎస్సార్‌సీపీకి చెందిన నలుగురిని ప్రలోభాలకు గురిచేసి టీడీపీ తన బలాన్ని 47కు పెంచుకుంది. తాజా ఫలితాల్లో వైఎస్సార్‌సీపీ 47 డివిజన్లలో గెలుపొందగా టీడీపీ మూడు స్థానాలకే పరిమితం కావడం గమనార్హం. 16 డివిజన్లలో పోటీచేసిన బీజేపీ అన్నిచోట్లా ఓటమి పాలైంది. వామపక్షాలు రెండూ కలసి నాలుగు డివిజన్లలో పోటీ చేసి పరాజయం పాలయ్యాయి. మొత్తానికి ఎపిలో ఫ్యాన్ గాలిని ఇప్పట్లో ఎవ్వరూ ఆపలేరని ఈ ఎన్నికల ద్వారా మరోమారు రుజువయ్యింది. వైఎస్ జగన్ అందిస్తున్న జనరంజక పాలనకి ఎపి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని ఈ ఎన్నికలు స్పష్టం చేశాయని రాజకీయ విశ్లేషకుల మాట.

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

అక్టోబర్ 2 తర్వాత ఏరోజైనా సరే.. పరీక్షలకు సిద్దం..

   an hour ago


రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

రేవంత్ రెడ్డి పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా

   3 hours ago


చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

చేవెళ్ల నుండి వైఎస్ఆర్ టి పార్టీ అధ్యక్షురాలు షర్మిల పాదయాత్ర

   15 hours ago


మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

మంత్రి వర్గంలో భారీ మార్పులకి సిద్దపడుతున్న వైఎస్ జగన్

   16 hours ago


5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

5-11 సంవత్సరాల వయస్సు ఉన్న పిల్లలకు ఫైజర్ వ్యాక్సిన్ ట్రయల్స్ విజయవంతం

   17 hours ago


పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

పంజాబ్ ముఖ్యమంత్రిగా చరణ్‌జిత్ చన్నీ ప్రమాణ స్వీకారానికి రాహుల్ గాంధీ హాజరు

   21 hours ago


ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

ఆంధ్రప్రదేశ్ పరిషత్‌ ఎన్నికల ఫలితాలలో వైసీపీ హవా

   a day ago


ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

ఆంధ్రప్రదేశ్ లో ఈనెల 25న జెడ్పీ చైర్మన్ల ఎన్నిక

   20-09-2021


హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

హుజూరాబాద్‌ ఉప ఎన్నికకి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు..?

   20-09-2021


అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

అక్కడ ప్రతిపక్షాలకు ఒక్క ఓటు కూడా దక్కకపోవడం విశేషం

   20-09-2021


ఇంకా

Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle