newssting
Radio
BITING NEWS :
గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలోని సోలా ప్రాంతంలో పౌల్ట్రీ ఫాంలో బర్డ్ ఫ్లూ ప్రబలింది. అహ్మదాబాద్ నగరంలో సేకరించిన శాంపిళ్ల పరీక్షల్లో బర్డ్ ఫ్లూ ఇన్ఫెక్షన్ ఉందని తేలింది. దీంతో అహ్మదాబాద్ జిల్లాలో ముందుజాగ్రత్తగా మాంసం, చికెన్ విక్రయాలను జిల్లా కలెక్టరు నిషేధించారు * బెంగాల్ బీజేపీ ఎన్నికల పరిశీలకుడైన కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద్ రాయ్‌కు జడ్ కేటగిరి భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది * దేశమంతటా ఒకేసారి ఎన్నికలు జరపాలన్న ప్రధాని నరేంద్ర మోదీ ఆశయమైన ‘ఒకే దేశం- ఒకే ఎన్నిక’ అంశం కర్ణాటక శాసనసభను కుదిపేసింది. రాష్ట్ర శాసనసభ బడ్జెట్‌ సమావేశాల్లో రెండురోజులు పూర్తిగా ఇదే అంశంపై చర్చించనున్నారు * భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన ఐఈడీ పేలి జార్ఖండ్‌లో ముగ్గురు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి * తన నేతృత్వంలో మూడో కూటమి ఏర్పాటు ఖాయమని, అయితే, ఎస్‌ఎంకే, ఐజేకేలతో ఇంకా పొత్తు ఖరారు కాలేదని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కేవలం చేతులు మాత్రం కలిపామని, పొత్తుకు చర్చలు జరగాల్సి ఉందన్నారు * కర్ణాటకలో సంచలనం రేపిన మంత్రి రమేశ్‌ జార్కిహోళి రాసలీలల వీడియో వెనుక ఓ ఎమ్మెల్యే హస్తం ఉందని పుకార్లు వస్తున్నాయి. విచారణ నిమిత్తం రాసలీలల వీడియోలో ఉన్న అమ్మాయి కోసం బెంగళూరు కబ్బన్‌పార్క్‌ పోలీసులు గాలిస్తున్నారు. సుమారు ఏడాది నుంచి వారి మధ్య బాగోతం కొనసాగుతోందని తెలుస్తోంది * ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కుటుంబ సమేతంగా శుక్రవారం తిరుమల వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధాన ఆలయ ప్రవేశద్వారం వద్ద ఆయనకు టీటీడీ ఈఓ కేఎస్‌ జనవహర్‌రెడ్డి, అదనపు ఈఓ ధర్మారెడ్డి, సీవీఎస్‌ఓ గోపీనాథ్‌ ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వచనం చేశారు. ఈఓ తీర్థ ప్రసాదాలు అందించి, స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి చిత్రపటాన్ని బహూకరించారు * గుజరాత్‌లోని కెవాడియాలో శనివారం సైనిక కమాండర్ల సమావేశం జరుగనుంది. ప్రధాని నరేంద్ర మోదీ హాజరై మేధోమధన సదస్సును ఉద్దేశించి ప్రసంగించనున్నారు. దేశ భద్రత, త్రివిధ దళాల సన్నద్ధత, సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితులపై సైతం సమీక్ష జరుపనున్నారు * కేరళలో అధికారాన్ని కైవసం చేసుకోవటమే లక్ష్యంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఇటీవలే పార్టీలో చేరిన మెట్రోమ్యాన్‌ శ్రీధరన్‌ను ఎన్డీఏ తరఫున సీఎం అభ్యర్థిగా రాష్ట్ర బీజేపీ యూనిట్‌ ఎంపిక చేసింది * సరూర్‌నగర్‌ చెరువు మినీ ట్యాంక్‌బండ్‌లో మొసలి ప్రతక్ష్యమైంది. గ్రీన్‌పార్క్‌ కాలనీ సమీపంలో అటుగా వెళ్తున్న స్థానికులు మొసలి కనిపించడంతో తమ కెమెరాలో బంధించారు. మొసలి చెరువులోకి ఎలా వచ్చింది? ఒకటే ఉందా లేకా ఇంకా ఉన్నాయా? అనే అనుమానాలు తలెత్తుతున్నాయి * జీహెచ్‌ఎంసీ పరిధిలో అక్రమ నిర్మాణాలపై అధికారుల నియంత్రణ కొరవడిందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అక్రమ నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిందేనని తేల్చిచెప్పింది. అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నా క్షేత్రస్థాయి సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించింది * గురు‌వారం అత్యధికంగా భద్రా‌చ‌లంలో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది. ఆది‌లా‌బాద్‌, మహ‌బూ‌బ్‌‌న‌గర్‌, నిజా‌మా‌బాద్‌, పెద్దపల్లి తది‌తర జిల్లాల్లో 37 డిగ్రీ‌ల‌కు‌పై‌గానే గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. ఆది‌లా‌బా‌ద్‌లో 13.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణో‌గ్రత నమో‌దైంది * రాష్ట్ర గవర్నర్‌, పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రతిష్టాత్మక టాప్‌-20 గ్లోబల్‌ ఉమెన్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌–2021 పురస్కారానికి ఎంపికయ్యారు. యూఎస్‌ కాంగ్రెస్‌మ్యాన్‌ డానికే డేవిస్‌ నేతృత్వంలోని మల్టీ ఎత్నిక్‌ అడ్వైజరీ టాస్క్‌ ఫోర్స్‌ ఈ అవార్డును ప్రకటించింది * సిద్దిపేట జిల్లా తోగుట మండలం ఏటిగడ్డ కిష్టాపూర్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపు మేరకు.. మల్లన్నసాగర్ ముట్టడికి బయల్దేరిన బీజేపీ నేతలను పోలీసులు అరెస్ట్‌ చేసి భూంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీజేపీ నేతల అరెస్ట్‌తో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది * భద్రాచలంలో ఏప్రిల్‌ 21న జరగనున్న శ్రీరామనవమి మహోత్సవాలను ప్రత్యక్షంగా వీక్షించాలనుకునే భక్తులకు శుక్రవారం నుంచి ఆన్‌లైన్‌ ద్వారా టికెట్లు అందుబాటులో ఉంచుతున్నట్లు భద్రాద్రి జిల్లా కలెక్టర్‌ ఎంవీ రెడ్డి తెలిపారు * ఫిబ్రవరిలో శ్రీవారి హుండీ ఆదాయం రూ.90.8 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. కాగా.. ఫిబ్రవరి నెలలో 14.41 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఏప్రిల్ 13 నుంచి శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలకు భక్తులకు అనుమతి లభించింది. గురువారం 25,534 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.31 కోట్లు వచ్చినట్టు టీటీడీ వెల్లడించింది. ఈ నెల 14న పురంధరదాసు 967వ అవతారోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నెల 28 నుంచి 5 రోజుల పాటు శ్రీవారి వార్షిక తెప్పోత్సవాలు జరగనున్నాయి * విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. డిపోల పరిధిలోని 960 బస్సులు నిలిచిపోయాయి. వాణిజ్య సముదాయాలు, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు మూసివేశారు * ప్రకాశం జిల్లా గుడ్లూరు మండలం శాంతి నగర్ వద్ద ఆగి ఉన్న లారీని ఆరంజ్ ట్రావెల్ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 15 మందికి గాయాలయ్యాయి * విశాఖ ప్లాంట్‌ ఏ-షిఫ్ట్‌లో కార్మికులు విధులు బహిష్కరించారు. కూర్మన్నపాలెం వద్ద రహదారిపై కార్మికులు బైఠాయించారు. రాష్ట్ర బంద్‌లో కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. నగరంలో బస్‌స్టాండ్ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష నేతల నిరసన చేపట్టారు.

ఏకగ్రీవాల్లోనూ.. ఎవరి దారి వారిదేనా..

28-01-202128-01-2021 14:49:41 IST
2021-01-28T09:19:41.278Z28-01-2021 2021-01-28T09:19:29.914Z - - 07-03-2021

ఏకగ్రీవాల్లోనూ.. ఎవరి దారి వారిదేనా..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒకవైపున భారీ స్థాయిలో ఏకగ్రీవ ఎన్నికలను నేనొప్పనంటూ ఏపీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ హుకుం మీద హుకుం జారీ చేస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఈసీపై వ్యాఖ్యానించే క్రమంలో లక్ష్మణ రేఖను దాటొద్దని సుతిమెత్తగా హెచ్చరిస్తూనే ఉన్నారు. కానీ ఏపీ ప్రభుత్వ రాజకీయ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మొదలుకుని పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి వరకు ఏకగ్రీవాలే లక్ష్యంగా సాగిపోవాలంటూ క్యాడర్‌కు, నియోజకవర్గాల ఇన్ చార్జీలకు సూచనలు పంపుతున్నారు. వీలైనంత ఎక్కువగా జిల్లాల్లో ఏకగ్రీవాలకు ఏర్పాట్లు చేసుకోవాలని మార్గ నిర్దేశం చేస్తున్నారు. 

అటు ఈసీ హెచ్చరికలు, ఇటు వైకాపా మంత్రుల దిశానిర్దేశాలు వెరసి సరికొత్తే సంక్షోభానికి దారి తీసేటట్లున్నాయి. పంచాయితీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కృష్ణా జిల్లా ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో విజయవాడ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జిలతో విస్తృతస్థాయిలో సమీక్షించారు.

గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యానికి బాటలు వేయాలని, పంచాయతీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని మంత్రి పెద్దిరెడ్డి సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి విజయానికి ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని కోరారు. ఇన్‌చార్జి మంత్రి దిశా నిర్దేశంతో ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జిలు రంగంలోకి దిగారు. 

మంత్రులే స్వయంగా ప్రోత్సహిస్తుండటంతో అధికార పార్టీ నేతలు ఏకగ్రీవాలను ప్రోత్సహించే దిశగా అడుగులేస్తున్నారు. తద్వారా తమ అభ్యర్థులకు విజయం చేకూర్చి పట్టు నిలుపుకొనేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీల వారీగా ఆ మేరకు ప్రణాళికలు రచిస్తున్నారు. గ్రామాభివృద్ధిని కాంక్షించి కొంత మంది రాజీ ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ నేతలు అన్ని వర్గాలతో చర్చించి ఏకగ్రీవానికి ఒప్పించేందుకు కృషి చేస్తున్నారు. 

మరోవైపున సుదీర్ఘ విరామం అనంతరం ఎన్నికలు రావడంతో సర్పంచి కుర్చీని దక్కించుకోవాలని ప్రతిపక్ష పార్టీ నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. మొత్తమ్మీద జిల్లాలో కీలకమైన నాయకులు తమ సొంత పంచాయతీల్లో పోటీ లేకుండా చేసుకొనే యత్నాల్లో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి ఎన్నిచోట్ల ఎన్నికలు జరుగుతాయి ఎన్నిచోట్ల ఏకగ్రీవమవుతాయి అని గ్రామీణ ప్రజల్లో ఆసక్తి నెలకొంది. 

పల్లెసీమలను అభివృద్ధిబాట పట్టించే నాయకుడిని ఎన్నిక చేసుకునే ప్రక్రియకు ఎన్నికల సంఘం పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే. అన్నదమ్ముల్లా మెలిగే పచ్చని సీమల్లో మనుషులుమనసుల మధ్య కక్షలు, కార్పణ్యాలకు తావివ్వకుండా పంచాయతీ పదవులు ఏకగ్రీవం చేసుకుంటేనే అభివృద్ధి జరుగుతుందంటూ పెద్దలు సూచిస్తున్నారు.

కానీ ఏకగ్రీవాలు అస్సలు వద్దని బలం లేని చోట్ల కూడా నామమాత్రంగా అయినా సరే అధికార పార్టీకి పోటీగా నామినేషన్ వెయ్యాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయడంతో పంచాయితీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు అంతసులభం కాదనిపిస్తోంది. ఏతావాతా ఎక్కడో ఒక చోట ఏకగ్రీవాలు జరిగినా వాటిని ఎన్నికల కమిషన్ ఏమేరకు ఏ స్థాయిలో అనుమతిస్తుంది తిరస్కరిస్తుంది అనే అంశంపై స్పష్టత కోసం మరికొన్ని రోజులు ఎదురు చూడాల్సిందే మరి.

ఊళ్ల‌లో పంచాయితీల వేలం పాట‌.. ఎవ‌రు ఎక్కువ పాడితే వాళ్లే స‌ర్పంచ్

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి

   7 hours ago


మ‌రో ఇష్యూలో మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి

మ‌రో ఇష్యూలో మేయ‌ర్ విజ‌య‌ల‌క్ష్మి

   8 hours ago


ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి

   15 hours ago


మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!

   14 hours ago


ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు

   16 hours ago


కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు

   16 hours ago


కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!

   18 hours ago


తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం

   21 hours ago


బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం

   21 hours ago


రాష్ట్ర బంద్ లో విజయసాయి రెడ్డికి చేదు అనుభవం

రాష్ట్ర బంద్ లో విజయసాయి రెడ్డికి చేదు అనుభవం

   a day ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle