newssting
Radio
BITING NEWS :
కర్ణాటకలో నేడు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరికలు జారీ చేసిన ఐఎండీ. ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపిన ఐఎండీ * కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్ పటేల్ కరోనాకు చికిత్స పొందుతూ కన్నుమూశారు. గురుగావ్‌లోని మేదాంత ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈరోజు ఉదయం 3.30 గంటలకు అహ్మద్ పటేల్ మృతి చెందారని ఆయన కుమారుడు ఫైసల్ పటేల్ ట్విటర్‌ ద్వారా తెలియజేశారు. విషయం తెలుసుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అహ్మద్ పటేల్ మృతికి సంతాపం వ్యక్తం చేశారు. అహ్మద్ పటేల్ సమాజానికి ఏళ్ల తరబడి సేవలు అందించారని ప్రధాని ట్వీట్ ద్వారా కొనియాడారు. అహ్మద్​ పటేల్​ మరణంపై కాంగ్రెస్‌ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ‘‘అత్యంత విశ్వాసపాత్రుడు, మంచి స్నేహితుడు. ఆయన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు. గొప్ప కామ్రేడ్‌ను నేను కోల్పోయాను’’ అంటూ ఉద్వేగానికి లోనయ్యారు * తమిళనాడు రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల నేపథ్యంలో నేడు తమిళనాడు వ్యాప్తంగా ప్రభుత్వం సెలవు ప్రకటించగా సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్‌ బృందాలు రంగంలోకి దిగాయి * ఆఫ్ఘనిస్థాన్ దేశంలోని బమియాన్ నగరంలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన పేలుళ్లలో 17 మంది మరణించగా, మరో 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. బమియాన్ ప్రావిన్సులోని బమియాన్ నగరంలోని స్థానిక మార్కెట్ లో పేలుళ్లు జరిగాయి * దేశరాజధాని ఢిల్లీలో కరోనా కల్లోలం ఆగడం లేదు. గడచిన 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 6,224 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదేసమయంలో 109 మంది మృతి చెందారు. కరోనా కారణంగా ఢిల్లీలో వరుసగా ఐదవ రోజు కూడా100కు పైగా మరణాలు సంభవించాయి * రష్యా వ్యాక్సిన్‌ స్పుత్నిక్‌-వి ఒక్కో డోసు ధర రూ.740 (రెండు డోసులకు రూ.1480) కంటే తక్కువే ఉంటుందని రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వె్‌స్టమెంట్‌ ఫండ్‌ (ఆర్‌డీఐఎఫ్‌) అధిపతి కిరిల్‌ దిమిత్రీవ్‌ ప్రకటన * తెలుగు రాష్ట్రాలకు ‘నివర్’ తుఫాన్ ముప్పు పొంచి ఉంది. తుఫాను ప్రభావం ఇరు రాష్ట్రాలపై ఎక్కువగా ఉండనుంది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాన్ నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని అన్ని విద్యా సంస్థలకు మూడ్రోజుల పాటు సెలవులు ప్రకటించారు. ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాలు జిల్లాకు చేరుకున్నారు. అధికారులు, సిబ్బందికి సెలవుల రద్దు చేశారు. తీర ప్రాంతాల్లో కలెక్టర్‌ పర్యటించారు. కృష్ణపట్నం పోర్టులో రెండవ నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు * హైదరాబాద్ ఎల్బీనగర్ ఫ్లైఓవర్‌ పైనుంచి దూకి యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ప్రమాదంలో రాంపల్లి ప్రవీణ్‌కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు * రాష్ట్రంలో బుధ, గురు వారాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం ప్రకటించింది. బుధవారం ఒకట్రెండు చోట్ల భారీ వర్షం కురుస్తుందని అధికారులు తెలిపారు. బంగాళాఖాతంలోని అల్పపీడనం బుధవారం సాయంత్రం తీరం దాటి తీవ్ర తుపానుగా మారే అవకాశం ఉన్న ట్లు వాతావరణశాఖ అధికారులు తెలిపారు * ప్రతి ఓటరుకు ఓటరు స్లిప్పును అందజేయాలని, ఈ కార్యక్రమం బుధవారం సాయంత్రానికల్లా పూర్తి కావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) ఆదేశించింది. 2009, 2016 ఎన్నికల్లో ఓటింగ్‌ 50 శాతం కూడా దాటకపోవడాన్ని గుర్తు చేసింది.

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..

19-10-202019-10-2020 11:36:42 IST
2020-10-19T06:06:42.191Z19-10-2020 2020-10-19T06:06:38.631Z - - 26-11-2020

కరోనా కేసుల రికవరీలో దేశంలోనే నంబర్‌వన్‌ ఏపీ..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కరోనా వైరస్‌ సోకి కోలుకుంటున్న వారి సంఖ్య విషయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జాతీయరికార్డు స్థాపించింది. పరీక్షల్లోనే కాకుండా కరోనా రికవరీలోనూ ఆంధ్రప్రదేశ్‌ ముందుకు దూసుకుపోతోంది. కోలుకుంటున్నవారి సంఖ్య గణనీయంగా పెరగడంతో ఇప్పుడు దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. జనాభాతో పాటు, మౌలిక వసతుల్లో ముందున్న అతి పెద్ద రాష్ట్రాలే పరీక్షలు, రికవరీల్లో మనకంటే వెనక ఉన్నాయి. మిలియన్‌ జనాభాకు అత్యధిక పరీక్షలు చేస్తూ ఏపీ మొదటి స్థానంలో కొనసాగుతోంది. 

తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలో 94.52 శాతం రికవరీ రేటు నమోదైంది. ఇది దేశంలోనే అత్యధికం. దేశ సగటు రికవరీ రేటు 87.78గా నమోదైంది. కేరళ, తమిళనాడు, కర్ణాటక వంటి రాష్ట్రాలు కూడా రికవరీలో ఏపీ కంటే వెనుకబడి ఉన్నాయి. కరోనా వ్యాధి నిర్ధారణ పరీక్షల్లోను ఏపీ అదే హవా సృష్టిస్తుండటం గమనార్హం.  

ఆరునెలల కిందట ఒక్క వైరాలజీ ల్యాబొరేటరీ కూడా లేని రాష్ట్రంలో ఇప్పుడు మొత్తం 14 వైరాలజీ ల్యాబొరేటరీలు, ట్రూనాట్‌ మెషీన్లతో పాటు యాంటీజెన్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మిలియన్‌ జనాభాకు 1,32,326 మందికి టెస్టులు చేస్తున్నారు. 1,23,111 మందికి పరీక్షలు చేస్తూ అసోం రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉంది. 

అదే సమయంలో కరోనా వ్యాధిగ్రస్తుల మరణాల నియంత్రణలోనూ ఏపీ గణనీయమైన వృద్ధి సాధించింది. గతంలో రోజుకు 90 మరణాలుండగా, ఇప్పుడా సంఖ్య 25కు తగ్గింది. ఈ సంఖ్యను మరింత తగ్గించే వ్యూహంతో ప్రభుత్వం ముందుకుసాగుతోంది.

ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా పరీక్షలు

ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 74,945 నమూనాలు పరీక్షించగా 3,986పాజిటివ్‌  కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 7,83,132 కు చేరింది. కొత్తగా 23 మంది కరోనా బాధితులు మృతి చెందడంతో ఆ సంఖ్య 6,429కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 4,591మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్‌ అయ్యారు. ఇప్పటి వరకు 70,66,203 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 36,474యాక్టివ్‌ కేసులు ఉన్నాయి.

రాష్ట్రంలో కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట పడడం లేదు. 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 74,945 శాంపిల్స్‌ను పరీక్షించగా 3,986 మందికి వైరస్‌ సోకిందని వైద్య ఆరోగ్యశాఖ ఆదివారం వెల్లడించింది. దీంతో ఏపీలో మొత్తం బాధితుల సంఖ్య  7,83,132కి చేరుకుంది. తాజాగా పశ్చిమగోదావరిలో 575 మంది కరోనా బారినపడగా.. కృష్ణాలో 503, గుంటూరులో 496, తూర్పుగోదావరిలో 481, చిత్తూరులో 458 కేసులు వెలుగులోకొచ్చాయి. 

రాష్ట్రవ్యాప్తంగా 4,591 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం రికవరీలు 7,40,229కి పెరిగాయి. గత 24 గంటల్లో  23 మంది కరోనాతో మరణించారు. చిత్తూరు, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నలుగురేసి చొప్పున చనిపోగా.. అనంతపురం, తూర్పుగోదావరి, నెల్లూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో ఇద్దరేసి చొప్పున, కడప, ప్రకాశం, విశాఖపట్నం జిల్లాల్లో ఒకొక్కరు చొప్పున మరణించారు. దీంతో మొత్తం మరణాలు 6,429కి పెరిగాయి. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle