భారీగా నామినేషన్ల ఉపసంహరణ
04-03-202104-03-2021 11:28:14 IST
Updated On 04-03-2021 12:58:15 ISTUpdated On 04-03-20212021-03-04T05:58:14.875Z04-03-2021 2021-03-04T05:58:07.376Z - 2021-03-04T07:28:15.946Z - 04-03-2021

ఆంధ్రప్రదేశ్లో మునిసిపల్ ఎన్నికల నగారా మోగిన సంగతి తెలిసిందే..! నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది. భారీగా నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మంగళ, బుధవారాల్లో ఏకంగా 7,263 మంది తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. అనంతపురం, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, విశాఖపట్టణం, విజయనగరం జిల్లా నుంచి పెద్దమొత్తంలో నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. ఉపసంహరణ గడువు ముగిసిన అనంతరం 12 నగరపాలక, 75 పురపాలక, నగర పంచాయతీల ఎన్నికల బరిలో 8,787 మంది నిలిచారు. బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలను ఎన్నికల సంఘం నిన్ననే ప్రకటించాల్సి ఉన్నా విజయవాడ, విశాఖపట్టణం నగర పాలక సంస్థల్లో లెక్కల విషయంలో జాప్యం జరగడంతో జాబితా ప్రకటించలేకపోయారు. నామినేషన్ల ఉపసంహరణకు వైసీపీ నేతలు చేసిన కుట్రలే కారణమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆరోపించారు. చిత్తూరు కార్పొరేషన్లో ఫోర్జరీ సంతకాలతో టీడీపీ అభ్యర్థుల ఉపసంహరణలు జరిగాయని ఆరోపించారు. వీడియో రికార్డింగ్ పరిశీలన జరిగే వరకూ అక్కడ ఏకగ్రీవాలను ప్రకటించకుండా నిలిపివేయాలని ఆయన రాష్ట్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు లేఖ రాశారు. కొందరు అధికారులు, పోలీసుల సహకారంతో వైసీపీ నేతలు చిత్తూరులో టీడీపీ అభ్యర్థుల సంతకాలను ఫోర్జరీ చేసి పోటీ నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు నకిలీ లేఖలు సమర్పించారని చెప్పారు. కొన్ని డివిజన్లలో టీడీపీ అభ్యర్థుల పేరుతో వేరే వ్యక్తులను రిటర్నింగ్ అధికారి ముందు హాజరుపరచి.. పోటీ నుంచి వైదొలుగుతున్నట్లు లేఖలు ఇప్పించారని తెలిపారు. ఇటువంటి ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని ఫిర్యాదులు రావడంతో అభ్యర్థుల ఉపసంహరణ ప్రక్రియను వీడియో రికార్డింగ్ తీయాలని, ఆ రికార్డును భద్రపరచాలని ఎస్ఈసీ ఆదేశించిందని గుర్తుచేశారు. అక్రమాలకు పాల్పడుతున్న చోట్ల వైసీపీ నేతలు ఇలా వీడియో రికార్డింగ్ జరగకుండా చూశారని.. వారికి అధికారులు సహకరించారని ఆరోపించారు చంద్రబాబు. మోసపూరిత ఉపసంహరణలపై వెంటనే కఠిన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. బలవంతపు ఏకగ్రీవాలపై ఎస్ఈసీ సీరియస్ అయ్యింది. అభ్యర్థి మినహా ఇతరులు ఉపసంహరణ పత్రం ఇస్తే తీసుకోకూడదని.. అది ఉపసంహరణగా పరిగణించకూడదని తెలిపింది. తిరుపతి ఏడో వార్డులో నామినేషన్ ఉపసంహరణపై ఫోర్జరీ సంతకం చేసి ఉపసంహరణ చేసుకున్నారని వార్తలు వచ్చాయని, దీనిపై వెంటనే అభ్యర్థి ఆర్వోకు, పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆదేశించింది. పోలీసులు దీనిపై వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇలాంటి ఘటనలు జరిగితే వెంటనే ఈసీ దృష్టికి తీసుకురావాలని కోరింది.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
16 hours ago

పీకేకి ఏమైంది.. మమతాను కావాలనే దెబ్బ కొట్టాడా
13 hours ago

కేసీఆర్ కు సాగర్ భయం.. రెండోసారీ హాలియాలో సభ
15 hours ago

ఆశగా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడర్లు
19 hours ago

దొరపై జెండా ఎగరేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం
a day ago

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!
a day ago

షర్మిల మాటలతో చాలా క్లారిటీస్
09-04-2021

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వచ్చింది రెండువేలేనా
09-04-2021

పేర్ని నాని పవన్ ఫ్యానా.. వకీల్ సాబ్ కి ఫుల్ ప్రమోషన్
09-04-2021

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత
09-04-2021
ఇంకా