టీడీపీ సంబరాలపై ఏపీ మంత్రుల ఫైర్
22-02-202122-02-2021 22:15:56 IST
Updated On 23-02-2021 10:36:57 ISTUpdated On 23-02-20212021-02-22T16:45:56.826Z22-02-2021 2021-02-22T16:45:52.422Z - 2021-02-23T05:06:57.633Z - 23-02-2021

పంచాయతీ ఎన్నికలు ముగిశాక మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయం వద్ద భారీగా సంబరాలు చేసుకున్నారు. దీనిపై వైసీపీ నేతలు, మంత్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ సంబరాలపై ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు. ఓడిపోయిన పార్టీ సంబరాలు చేసుకోవడం ఏంటని విమర్శించారు. నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి 81 శాతం స్థానాలు లభిస్తే, టీడీపీ గెలిచింది 16 శాతం స్థానాలేనని వెల్లడించారు. అది కూడా వైసీపీ తిరుగుబాటుదారుల వల్ల ఆ మాత్రం స్థానాలు వచ్చాయని, కానీ చంద్రబాబు 41 శాతం గెలిచామని చెప్పుకుంటున్నారని ఆరోపించారు.
ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ సంబరాలు చేసుకునే పార్టీ భారతదేశ చరిత్రలో టీడీపీ ఒక్కటేనని ఎద్దేవా చేశారు. ప్రతి విడతలోనూ తెలుగుదేశం పార్టీ పుంజుకుంది అని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటనలు చేయడం మరీ విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబుకు దమ్ముంటే గెలిచినవాళ్లకు తన పార్టీ కండువాలు కప్పి ప్రదర్శించాలని అనిల్ కుమార్ సవాల్ విసిరారు. సొంత నియోజకవర్గం కుప్పంలోనే 20 శాతం సాధించలేని చంద్రబాబు 41 శాతం గెలిచామని చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు. చివరికి బూత్ స్థాయిలో గెలిచినా సంబరాలు చేసుకునే స్థాయికి టీడీపీ దిగజారిపోయిందని విమర్శించారు.
ఏపీ మంత్రి కొడాలి నాని కూడా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఎన్నికల్లో ఓటమితో చంద్రబాబుకు పిచ్చెక్కిందని, ఆయనను టీడీపీ నేతలు ఎర్రగడ్డ పిచ్చాసుపత్రికి పంపడం ఖాయమని అన్నారు. కుప్పంలోనే తాము 75 స్థానాలు సాధించామని, మరి చంద్రబాబు చెబుతున్న 42 శాతం సీట్లు ఎక్కడో చెప్పాలని కొడాలి నాని ప్రశ్నించారు. పిచ్చి పట్టిన చంద్రబాబు ఇప్పటికే తెలంగాణలో పార్టీని నాశనం చేశాడని, చంద్రబాబును ఇకనైనా మెంటల్ ఆసుపత్రిలో చేర్చకపోతే ఏపీలోనూ టీడీపీకి అదేగతి పడుతుందని అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పార్టీ గుర్తులు ఉండవని, అలాంటి ఎన్నికల్లోనే తమకు ప్రజలు బ్రహ్మరథం పట్టారని, ఇక పార్టీ గుర్తులతో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో కూడా వైసీపీ ఘన విజయం సాధిస్తుందని అన్నారు.
ఓటమిని జీర్ణించుకోలేకపోయిన టీడీపీ అభ్యర్థి..

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
9 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
10 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
11 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
9 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
13 hours ago
ఇంకా