newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!

29-09-202029-09-2020 15:01:15 IST
Updated On 29-09-2020 15:07:51 ISTUpdated On 29-09-20202020-09-29T09:31:15.028Z29-09-2020 2020-09-29T09:31:02.753Z - 2020-09-29T09:37:51.848Z - 29-09-2020

శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాల్లో పాల్గొన్న మ‌రో మంత్రికి క‌రోనా పాజిటివ్‌!
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
చిన్న చిన్న‌దుకాణాల‌తో స‌హా ఎక్క‌డ చూసినా నో మాస్కు- నో ఎంట్రీ అని బోర్డులు క‌నిపిస్తున్నాయి. క‌రోనా వైర‌స్ సోక‌కుండా కాపాడే ప్ర‌ధాన క‌వ‌చం మాస్కేన‌ని, మాస్కు లేకుండా బ‌య‌ట‌కు వెళ్లొద్ద‌న్న‌ ప్ర‌చార‌మూ ఉధృతంగానే సాగుతోంది. కానీ, ఈ జాగ్ర‌త్త‌లు, హెచ్చ‌రిక‌లు కొంద‌రు ప్ర‌జాప్ర‌తినిధుల‌కు మాత్రం చెవికెక్క‌డం లేదు. మాస్కు లేకుండానే తిరుగుతూ వివిధ కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటున్నారు. భౌతిక‌దూరం త‌ప్ప‌క పాటించాల‌న్న సూచ‌న‌ను అస‌లు ప‌ట్టించుకోవ‌డం లేదు. ఈ అజాగ్ర‌త్తే ఇప్పుడు ఏపీలో క‌ల‌క‌లానికి కార‌ణ‌మ‌వుతోంది. 

తిరుమ‌ల శ్రీ‌వారి బ్ర‌హ్మోత్స‌వాలకు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి హాజ‌రై ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించిన సంగ‌తి తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మానికి మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. ఉప ముఖ్య‌మంత్ర‌లు నారాయ‌ణ‌స్వామి, ఆళ్ల నాని, మంత్రులు వెల్లంప‌ల్లి శ్రీ‌నివాస్‌, పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి, ‌మేక‌తోటి సుచ‌రిత‌, గౌత‌మ్ రెడ్డి, చెల్లుబోయిన వేణుగోపాల‌కృష్ణ‌, కొడాలి నాని, చీఫ్ విప్ శ్రీ‌కాంత్‌రెడ్డి, ఏపీఐసీసీ చైర్‌ప‌ర్స‌న్ రోజా త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

ప‌ట్టు వ‌స్త్రాల స‌మ‌ర్ప‌ణ కార్య‌క్ర‌మంలో పాల్గొని తిరిగి వెళ్లిన మంత్రులు వెల్లంప‌ల్లి, చెల్లుబోయిన‌కు క‌రోనా సోకింది. చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేకు కూడా పాజిటివ్ వ‌చ్చింది. వీరితో పాటు ఆల‌య కైంక‌ర్యాల్లో ప్ర‌ధాన పాత్ర పోషించే వ్య‌క్తి కూడా క‌రోనా బారిన‌ప‌డ్డారు. 

తిరుమ‌ల‌లో రెండు రోజులున్న జ‌గ‌న్ ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మాల్లో ఇప్పుడు క‌రోనా నిర్ధార‌ణ అయిన వారు సీఎంతో, ఇత‌ర ప్ర‌ముఖుల‌తో క‌లిసిమెలిసి ఉన్నారు. రెండో రోజు వ‌చ్చిన క‌ర్ణాట‌క సీఎం య‌డ్యూర‌ప్ప‌తో క‌లిసి జ‌గ‌న్ పాల్గొన్న కార్య‌క్ర‌మాల్లో కూడా పాజిటివ్ వ‌చ్చిన మంత్రులు, మ‌రో వ్య‌క్తి కూడా స‌న్నిహితంగా మెలిగారు. సీఎం ప‌ర్య‌ట‌న ప‌ర్య‌ట‌న‌లో నేప‌థ్యంలో ‌క‌రోనా ప‌రీక్ష చేయించుకోవాల‌ని నిబంధ‌న విధించినా చాలామంది ప‌ట్టించుకోలేదు. పైగా భౌతిక‌దూరం పాటించ‌కుండా తిరిగారు. కొంద‌రు మంత్రులు, ఎమ్మెల్యేలు మాస్కులు పెట్టుకోలేదు. ఈ అజాగ్ర‌త్తే ఇప్పుడు ప్ర‌ముఖులు, అర్చ‌కులు, టీటీడీ సిబ్బందిలో క‌ల‌వ‌రం రేపుతోంది.

 

 


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle