newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

10-04-202110-04-2021 14:26:05 IST
Updated On 10-04-2021 14:55:48 ISTUpdated On 10-04-20212021-04-10T08:56:05.530Z10-04-2021 2021-04-10T08:18:59.492Z - 2021-04-10T09:25:48.686Z - 10-04-2021

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
హ్యాకర్లు.. ఎప్పుడు చూసినా పలువురు ప్రముఖుల సామాజిక మాధ్యమాల్లో పలువురు ప్రముఖులను టార్గెట్ చేస్తూ ఉంటారు. ఇప్పటికే చాలా మంది ప్రముఖులు హ్యాకింగ్ బారిన పడ్డారు. తాజాగా ఓ ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతా కూడా హ్యాకింగ్ కు గురైంది. ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ట్విట్ట‌ర్‌ ఖాతా హ్యాకింగ్ కు గురైంది. అందులో కొంద‌రు హ్యాక‌ర్లు అశ్లీల చిత్రాల‌ను పోస్ట్ చేశారు.

ఈ విష‌యాన్ని మంత్రి మేక‌పాటి ఆల‌స్యంగా గుర్తించారు. త‌న ట్విట్ట‌ర్‌ ఖాతా హ్యాక్ అయింద‌ని తెలుసుకున్న ఆయ‌న  దీనిపై ట్విట్ట‌ర్‌ సంస్థతో పాటు సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. హ్యాకింగ్ కు గురైన విష‌యాల‌ను వివ‌రిస్తూ ఆయ‌న ట్వీట్ చేశారు. తన ట్విట్ట‌ర్ ఖాతాలో అశ్లీల చిత్రాలు క‌న‌ప‌డినందుకు త‌న ఫాలోవ‌ర్ల‌కు క్ష‌మాప‌ణ‌లు చెబుతున్న‌ట్లు తెలిపారు. ఆయన ట్విట్ట‌ర్ ఖాతాలో వ‌చ్చిన అశ్లీల చిత్రాల‌ను సిబ్బంది తొలగించారు.

ఆంధ్రప్రదేశ్ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి ట్విట్టర్ లో 28వేల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆయన ట్విట్టర్ ఖాతాలో ఉన్నట్లుండి అశ్లీల ఫోటోలు కనిపించాయి. దీంతో పలువురు ఫాలోవర్లు కంగారు పడిపోయారు. వెంటనే మేకపాటి గౌతమ్‌రెడ్డికి సమాచారం ఇచ్చారు. హ్యాకర్లు ట్విట్టర్ అకౌంట్‌లో అసభ్యకరమైన ఫోటోలను పోస్ట్‌ చేశారు. వీటిని ఆలస్యంగా గుర్తించిన మంత్రి వెంటనే తొలగించారు.

దీనిపై ట్విట్టర్ సంస్థకు, సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు గౌతమ్‌రెడ్డి తెలిపారు. తన ట్విట్టర్‌కు హ్యాక్ చేశారని.. అసంబద్ధ పోస్టులు పెడుతున్నారని మంత్రి తెలిపారు. ఆ పోస్టులను పట్టించుకోవద్దన్నారు. తన ట్విట్టర్ అకౌంట్‌ను ఫాలో అవుతున్న వారందరికీ మంత్రి క్షమాపణలు తెలియజేశారు. ఇక ఈ పని ఎవరు చేశారా..? అని పోలీసులు ఆరా తీస్తూ ఉన్నారు. 

 

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

రఘురామ అరెస్టుపై టీడీపీ నేతల రియాక్షన్ ఇదే

   2 minutes ago


రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

రఘురామ అరెస్టుపై స్పందించిన సీఐడీ

   13 minutes ago


జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

జనమే జనం... ఎక్కడుంది కరోనా భయం

   14 hours ago


ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ  ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

ఏపీ - తెలంగాణ సరిహద్దుల్లో మళ్ళీ ఆగిన అంబులెన్స్ లు, రోగుల పరిస్థితి విషమం... ఆందోళన

   16 hours ago


స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

స‌డ‌న్ గా ష‌ర్మిల‌క్క‌య్య‌కు ఏమైంది

   a day ago


మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

మోడీనే కాదు.. పీఎం గా గుజ‌రాత్ లీడ‌రే వ‌ద్దంటున్న బీజేపీ

   a day ago


ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

ముందుంది భారీ మోసం అంటున్న రేవంత్ రెడ్డి

   20 hours ago


వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

వైసీపీ లీడ‌ర్ల‌కి కొత్త టెన్ష‌న్

   a day ago


ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

ఏపీలో కరోనా.. ప్రతిపక్ష పార్టీల నేతలపై పెడుతున్న అక్రమ కేసులకు లింక్ పెట్టిన అచ్చెన్న

   19 hours ago


టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

టీకాతోనే కోవిడ్-19కు చెక్.. డిమాండుకు తగ్గ డోసుల్లేవు.. ఎవరి జాగ్రత్తలో వారుండాలి: జగన్

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle