newssting
Radio
BITING NEWS :
ముఖేశ్‌ అంబానీ కూతురికి అరుదైన గౌరవం.. ప్రపంచ ప్రఖ్యాతి చెందిన స్మిత్‌సోనియన్‌ నేషనల్‌ మ్యూజియం ఆఫ్‌ ఏషియన్‌ ఆర్ట్స్‌ బోర్డు సభ్యురాలిగా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబరు 23 నుంచి నాలుగేళ్ల పాటు ఆమె ఈ పదవిలో కొనసాగుతారు. ఈ ట్రస్ట్‌ బోర్డులో ఇషా అంబానీయే అత్యంత పిన్న వయస్కురాలు. * కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను వైఎస్సార్‌సీపీ ఎంపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ గురువారం కలిశారు. ఈ మేరకు ప్రభుత్వంపై, సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై టీడీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలను అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లారు గోరంట్ల మాధవ్‌. * బీజేపీ నేతలకు మంత్రి నిరంజన్‌రెడ్డి సవాల్‌ విసిరారు. వరిని కొనేలా కేంద్రాన్ని ఒప్పిస్తూ లేఖ తీసుకురావాలని.. లేఖ తీసుకురాకపోతే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ రాజీనామా చేయాలని మంత్రి డిమాండ్‌ చేశారు. కేంద్రాన్ని ఒప్పిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. దమ్ముంటే బీజేపీ నేతలు ఛాలెంజ్‌ను స్వీకరించాలన్నారు. * పూరి తనయుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆకాశ్‌ పూరీ హీరోగా తనకంటూ గుర్తింపు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఈ నేపథ్యంలో రొమాంటిక్‌ ప్రీమియర్‌ షోను బుధవారం రాత్రి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లోని ప్రముఖ మాల్‌లో జరిగిన ఈ షోలో టాలీవుడ్‌కు చెందిన పలువురు స్టార్స్‌ సందడి చేశారు. * మైక్రోసాఫ్ట్‌ అరుదైన రికార్డును త్వరలోనే చేరువకానుంది. ప్రపంచంలోనే అత్యంత విలువైన కంపెనీగా నిలుస్తోన్న యాపిల్‌ నెంబర్‌ 1 స్థానాన్ని త్వరలోనే మైక్రోసాఫ్ట్‌ సొంతం చేసుకోనుంది. గడిచిన నెలలో మైక్రోసాఫ్ట్‌ భారీ లాభాలను ఆర్జించగా..యాపిల్‌ చతికిలపడి పోయింది. దీంతో మైక్రోసాప్ట్‌ మార్కెట్‌ క్యాప్‌ విలువ దాదాపు యాపిల్‌ క్యాప్‌ విలువకు చేరుకుంది.

పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని

30-09-202130-09-2021 20:06:14 IST
2021-09-30T14:36:14.005Z30-09-2021 2021-09-30T14:36:08.763Z - - 07-12-2021

పవన్ కళ్యాణ్ కి సవాల్ విసిరిన మంత్రి కొడాలి నాని
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
రిపబ్లిక్ ప్రి మూవీ ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ చేసిన స్పీచ్ ఇంకా దుమారం రేపుతూనే వుంది. ఇప్పటికే పవన్ కళ్యాణ్ అభిమానులు పోసాని కృష్ణమురళి ని టార్గెట్ చేసి భౌతిక దాడికి సైతం పాల్పడిన సంగతి తెలిసిందే. అంతే కాదు పవన్ అభిమానులు పోసాని ఇంటిపై రాళ్ళ దాడి కూడా చేయడంతో ఇప్పుడు ఇది హాట్ టాపిక్ గా మారింది. మరో వైపు ఈ విషయం పై తాజాగా మంత్రి కొడాలి నాని స్పందించి పవన్ పై నిప్పులు చెరిగారు. పవన్‌ కల్యాణ్‌ ఏంటి మమ్మల్ని భయపెట్టేది. ఇంకో జానీ సినిమా చూపించి భయపెడతారా. పవన్‌ని చూసి ఆయన అభిమానులు భయపడతారు. జగన్‌మోహన్‌రెడ్డి ఆనాడు సోనియాగాంధీకే భయపడలేదు. అలాంటిది చంద్రబాబు ఇచ్చే స్క్రిప్టులు చదివే పవన్‌ కల్యాణ్‌ మమ్మల్ని భయపెడతారా’’ అని నాని అన్నారు.

అంతేకాదు ముందు నువ్వు  ఎమ్మెల్యేగా గెలుస్తావో లేదో చూస్కో. 2024 లో నువ్వు ఏం చేస్తావో చూద్దాం. నువ్వు చంద్రబాబు, బీజేపీ, కాంగ్రెస్‌తో కలిసి రా. చూసుకుందాం.. నువ్వు మాజీ సీఎం ని చేస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటానని సవాల్ విసిరారు. మరో వైపు సినిమా ఇండస్ట్రీ నుండి సైతం పవన్ కి మద్దతు లభించలేదని తెలుస్తోంది. మంత్రి పేర్ని నాని పై పవన్ ఘాటుగా విమర్శలు చేయడం, తిరిగి నాని కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేయడంతో చిరంజీవి రంగం లోకి దిగి నానికి ఫోన్ చేసి పవన్ వ్యాఖ్యలకి చింతిస్తున్నట్లు తెలిపారని స్వయంగా మంత్రే తెలపడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ ఎపి సోడ్ ఇంకెలాంటి మలుపులు తిరుగుతోందో అన్న ఆసక్తి మాత్రం అటు రాజకీయ వర్గాలలోనూ, ఇటు టాలీవుడ్ జనాలలోనూ ఉన్నట్లు తెలుస్తోంది.

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

రైతుల అన్ని డిమాండ్లను కేంద్రం ఆమోదించడంతో రైతుల హర్షం

   3 minutes ago

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

ఏపీలో గుట్కా, పొగాకు బ్యాన్ చేసిన ప్రభుత్వం..

   5 hours ago

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను మోసం చేస్తున్నాయని రేవంత్ రెడ్డి ఆగ్రహం

   7 hours ago

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు రాజీనామా.. ఆ స్థానంలో మోత్కుపల్లి..?

   9 hours ago

ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

ఉద్యమకారులంతా టీఆర్ఎస్ పార్టీని వీడాలని ఈటల రాజేందర్ పిలుపు

   20 hours ago

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

ప్రధానమంత్రి నరేంద్రమోదీ తో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశం

   21 hours ago

తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

తెలంగాణలో 43 మెడికల్ స్టూడెంట్స్ కి కోవిద్ పాజిటివ్

   06-12-2021

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై సోము వీర్రాజు ఫైర్

   06-12-2021

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

భారత్ కి రానున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పిఎం మోడీతో సమావేశం

   06-12-2021

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

రైతులతో చర్చలకు అమిత్ షా పిలుపునిచ్చారు.. రైతులు కేంద్రానికి గ్రీన్ సిగ్నల్

   04-12-2021

ఇంకా

Newssting

 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle