బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు
21-01-202121-01-2021 10:42:18 IST
Updated On 21-01-2021 10:50:03 ISTUpdated On 21-01-20212021-01-21T05:12:18.483Z21-01-2021 2021-01-21T04:44:24.202Z - 2021-01-21T05:20:03.092Z - 21-01-2021

కొన్ని కొన్ని అంతే. ప్రభుత్వం ఉద్దేశం ఒకలా ఉంటుంది. ప్రజలకు చేరిన తర్వాత ఒకలా ఉంటుంది. పొలిటికల్ లీడర్లు అవసరాలకు అనుగుణంగా మార్చుకోవడం ఇంకోలా ఉంటుంది. ఏ విషయంలో ఏపీ లీడర్లే కాదు.. ఏపీ పోలీసులు కూడా ఎక్కడా తగ్గడం లేదు. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు.. ఎందుకు స్టార్ట్ చేశారో అందరికీ తెలిసిందే. ఆ చట్టాలు అప్పుడప్పుడూ.. కాస్త దారి మళ్లుతున్నాయి అనే విమర్శలు ఎప్పటి నుంచో ఉన్న మాట కూడా అందరికీ తెలిసిందే. అయితే.. ఇప్పుడు పొలిటికల్ లీడర్లు.. పోలీసులు కూడా ఇష్టం వచ్చినట్లు అవసరానికి అనుగుణంగా ఉపయోగించుకుంటున్నారు. ఏపీలో ఇలాంటి వాళ్లు బాగా పెరిగిపోయారు.
బాధితులు వచ్చి.. ఇలా దూషించారు.. ఇలా దాడి చేశారు అని చెబితే.. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలి. కానీ.. ప్రతి దానికీ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడం.. అది కూడా ఎస్సీల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టడంతో.. ఇష్యూ పెద్దది అవుతోంది. ఆ మధ్య రాజధాని ధర్నాల టైంలో కూడా ఇంతే జరిగింది. బయటి నుంచి వస్తున్న ఎస్సీలపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి.. బేడీలు వేయడంతో ఇష్యూ పెద్దది అయింది. హై కోర్టు అప్పుడే నో చెప్పింది. ఎస్సీ రైతులపై అలా ఎలా కేసులు పెడతారు అంటూ వ్యాఖ్యలు చేసింది.
ఇప్పుడు మరోసారి ఇదే జరిగింది. పులివెందులలో ఓ ఎస్సీ మహిళపై అత్యాచారం, హత్య జరిగితే.. చలో పులివెందులకు పిలుపునిచ్చి ఆందోళన చేసింది టీడీపీ. ఈ విషయంలో కూడా ఆందోళనకు దిగిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టారు పోలీసులు. ఇక్కడా సేమ్ సీన్ రిపీట్ అయింది. ఆందోళనకు దిగిన వారిలో.. ఎస్సీ నేత కూడా ఉన్నారు. ఆమె పైన కూడా ఎస్సీ కేసు నమోదు చేశారు. ఈ విషయంపై ఆమె కోర్టుకి వెళ్లారు. మళ్లీ పోలీసులకి అక్షింతలు పడ్డాయి. ఎస్సీ మహిళా నేతపై ఎస్సీ ఎస్టీ కేసు ఎలా పెడతారు అంటూ ప్రశ్నించింది కోర్టు. ఆమె పై ఆ సెక్షన్ లు ఎత్తివేయాలని ఆదేశించింది.
ఏదెలా ఉన్నా.. ఏపీలో పొలిటికల్ లీడర్ల సపోర్ట్ తో.. పోలీసులు ఇలా రెచ్చిపోతున్నారు అనే విషయం పబ్లిక్ లో ఫుల్ గా తిరుగుతోంది. లీడర్లని భయపెట్టడానికి పొలిటికల్ గా పవర్ ఉపయోగించి.. సెక్షన్లను అడ్డుపెట్టుకుంటున్నారు అనేది ప్రధాన ఆరోపణ. హైకోర్టు ఎన్నిసార్లు చెబుతున్నా.. పోలీసులు ఏ మాత్రం పట్టించుకోకుండా అవే కేసులు పెట్టడం కాస్త విడ్డూరంగానే ఉంది.
ఏపీ హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు డివిజన్ బెంచ్ కు..!

బలంగా ప్రతి పక్షాలు.. వైసీపీకి రాహుకాలం తప్పదా
3 minutes ago

అంతొద్దు.. కాస్త కంట్రోల్ లో ఉండండి
8 hours ago

మరో ఇష్యూలో మేయర్ విజయలక్ష్మి
8 hours ago

ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం.. ఓటు వేయకుంటే బాగుపడరన్న మంత్రి
15 hours ago

మరోసారి బాలయ్య దురుసుతనం.. ఫోటో తీశాడని చేయి చేసుకున్నారే..!
14 hours ago

ఆ నాయకుడు నన్ను మోసం చేసాడు.. చంద్రబాబు
16 hours ago

కేశినేని నానిని చెప్పుతో కొట్టేవాడినంటూ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు
16 hours ago

కేశినేని నానిపై బొండా ఉమా ఆగ్రహం..!
19 hours ago

తెలంగాణపై ఎందుకింత వివక్ష.. కేంద్రంపై కేటీఆర్ ద్వజం
21 hours ago

బీజేపీతో పెట్టుకుంటే అంతే.. అడ్డంగా బుక్కయిన కేరళ సీఎం
a day ago
ఇంకా