newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు

23-04-202123-04-2021 13:52:25 IST
Updated On 23-04-2021 10:11:52 ISTUpdated On 23-04-20212021-04-23T08:22:25.674Z23-04-2021 2021-04-23T04:34:45.622Z - 2021-04-23T04:41:52.447Z - 23-04-2021

ఆదుకుంటున్న ఆంధ్రప్రదేశ్.. ప్రశంసలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దేశంలో కరోనా వైరస్ రెండో దశ ఉధృతంగా ఉంది. చాలా ప్రాంతాల్లో ఆక్సిజన్ సమస్య ప్రజలను వేధిస్తూ ఉంది. ప్రజలకు సరిపడా ఆక్సిజన్ అందక కరోనా రోగులు మృత్యువాత పడుతున్నారు. ఆక్సిజన్‌కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. మహారాష్ట్రలో ఆక్సిజన్ అవసరం మరింత ఎక్కువగా ఉంది. దీంతో విశాఖపట్టణం నుంచి తొలి ‘ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ రైలు’ గత రాత్రి మహారాష్ట్రకు బయలుదేరింది. ఈ రైలు త్వరితగతిన గమ్యానికి చేరేలా అధికారులు గ్రీన్ కారిడార్ ను ఏర్పాటు చేశారు.

సోమవారం రాత్రి కలంబోలి నుంచి ఏడు ఖాళీ ఆక్సిజన్ ట్యాంకర్లతో బయలుదేరిన రైలు రెండు రోజులు ప్రయాణించి నిన్న తెల్లవారుజామున వైజాగ్ స్టీల్ ప్లాంట్‌కు చేరుకుంది. అక్కడి సిబ్బంది ట్యాంకర్లను కిందికి దించి వాటిలో ఆక్సిజన్ నింపి తిరిగి రైలుపైకి ఎక్కించారు. మొత్తం ఏడు ట్యాంకర్లలోనూ 103 టన్నుల మెడికల్ ఆక్సిజన్‌ను నింపారు. అనంతరం రైలు మళ్లీ మహారాష్ట్రకు బయలుదేరింది. ప్రాణవాయువును మోసుకుని రైలు బయలుదేరిన వెంటనే కేంద్రమంత్రి పీయూష్ గోయల్ ఈ విషయాన్ని ట్వీట్ చేశారు.

సిద్ధమవుతున్న ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ రైళ్లు

లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ తయారీలో విశాఖ స్టీల్ ప్లాంట్ ముందుంటోంది. కరోనా బాధితులను కాపాడటంలో కీలకమైన మెడికల్‌ ఆక్సిజన్‌ ఉత్పత్తిలో గతేడాది కూడా స్టీల్ ప్లాంట్ కీలక పాత్ర పోషించింది. ఇప్పుడు కూడా కోవిడ్ చికిత్స అందిస్తున్న ఆసుపత్రులకు విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచే పెద్ద ఎత్తున ఆక్సిజన్ సరఫరా చేస్తున్నారు. గతేడాది స్టీల్ ప్లాంట్ నుంచి తెలుగు రాష్ట్రాలు, ఒడిశాకే ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనా కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో మిగతా రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచి ఆక్సిజన్ సరఫరా అవుతోంది.

కేంద్రం కోరిన వెంటనే మహారాష్ట్రలోని నాగపూర్ కు 300 వెంటిలేటర్లను పంపించినందుకు ఏపీ ప్రభుత్వానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ఫోన్ కాల్ చేసిన గడ్కరీ, జగన్ కు కృతజ్ఞతలు తెలపాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప సాయం చేసిందని.. ఈ విషయాన్ని మేకపాటి స్వయంగా మీడియాకు వెల్లడించారు. గడచిన వారం రోజుల వ్యవధిలో నాగపూర్ ఆసుపత్రుల్లో వెంటిలేటర్ల కొరత ఏర్పడగా, ఏపీ నుంచి సాయం చేయాలని కేంద్రం కోరింది. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన ఏపీ ప్రభుత్వం వాటిని అందించింది. 

క‌రోనా పేషెంట్ల‌కి సంజీవ‌ని విశాఖ ఉక్కు.. ఊపిరిపోసే ఉక్కును అమ్మేస్తారా


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle