newssting
Radio
BITING NEWS :
నిర్మల్ లోని అనంతపేటలో దారుణం. మద్యంమత్తులో కూతురిని చంపిన తండ్రి. 4 ఏళ్ల కూతురిని కొట్టి చంపిన మహేష్. * రైతులకు అండగా ఈ నెల 7న ఏపీ వ్యాప్తంగా జనసేన ఆందోళనలు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులకు రూ.35 వేలు చెల్లించాలని డిమాండ్ చేసిన పవన్ కల్యాణ్. రజనీకాంత్ రాజకీయ ప్రవేశం మంచి పరిణామమన్న పవన్. * నేటి మధ్యాహ్నం 12 గంటలకు ఎన్నికల కో ఆర్డినేషన్ కమిటీతో భేటీ కానున్న బండి సంజయ్. ఎన్నికలు జరిగిన తీరు, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. * కృష్ణాజిల్లా గన్నవరం వద్ద ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన కారు. ఒకరు మృతి, నలుగురికి తీవ్రగాయాలు. *మాజీ మంత్రి కమతం రామిరెడ్డి (82) కన్నుమూత. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రామిరెడ్డి. రామిరెడ్డి మృతిపట్ల సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్. * తిరుపతిలో ఆన్ లైన్ వ్యభిచారం గుట్టురట్టు. జీవకోనలో ముఠాను అరెస్ట్ చేసిన సీఐడీ.

క‌ష్ట‌మే.. తానుండ‌గా స్థానిక ఎన్నిక‌లు ?

22-11-202022-11-2020 09:29:54 IST
2020-11-22T03:59:54.622Z22-11-2020 2020-11-22T03:59:49.510Z - - 06-12-2020

క‌ష్ట‌మే.. తానుండ‌గా స్థానిక ఎన్నిక‌లు ?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

అవును నిమ్మ‌గ‌డ్డ ఇక నిమ్మ‌లంగా ఉండ‌డ‌మే బెట‌రా. నీర‌సం లేకుండా ప‌ని చేస్తూ.. క‌సితో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని చూస్తున్నారు క‌దా నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్‌. అంది ఎంత వ‌ర‌కు వ‌ర్క‌వుట్ అవుతుంది అంటే ఎవ‌రూ ఏం చెప్ప‌లేరు. జ‌ర‌క్క పోవ‌చ్చు అనే విష‌యం మాత్రం కాస్త బెట‌ర్ గానే చెప్పొచ్చు. ఎంత ప‌ట్టుబ‌ట్టినా.. ఎన్నికలు నిర్వ‌హించ‌లేని ఎన్నిక‌ల అధికారిగా నిమ్మ‌గ‌డ్డ‌కు పేరొచ్చేలా ఉంది అంటూ కామెంట్లు చేసుకుంటున్నారు జ‌నాలు. 

2021 మార్చితో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్ కుమార్ ప‌ద‌వీ కాలం ముగుస్తుంది. కానీ.. ఇప్పుడు చూస్తుంటే ఏపీలో స్థానిక ఎన్నిక‌లు జ‌రిగేలా లేవు. ఎలాగైనా త‌న హయాంలోనే ఎన్నిక‌లు జ‌ర‌పాల‌ని నిమ్మ‌గ‌డ్డ బానే ట్రై చేస్తున్నారు. కానీ.. ఏపీ స‌ర్కార్ మాత్రం ఇంచు కూడా క‌ద‌ల‌నివ్వ‌డం లేదు. మామూలుగా అయితే.. ఎన్నిక‌ల అధికారికి ప్ర‌భుత్వాన్ని న‌డిపే పార్టీకి మంచి ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇక్క‌డ మాత్రం అలా లేదు. సో.. స‌ర్కార్ కూడా ఎన్నిక‌ల అధికారికి వ్య‌తిరేకంగా ఉంది. త‌ను ఎడ్డెం అంటే స‌ర్కార్ తెడ్డెం అంటోంది. ప్ర‌భుత్వ ఉద్యోగులు కూడా అంతే ఉన్నారు. అస‌లే క‌రోనా వ‌చ్చి చ‌స్తుంటే.. ఇప్పుడు ఎన్నిక‌లేంటి సార్ అంటున్నారు. మామూలుగా అయితే.. ఈ టైంలో అయినా.. ఎన్నిక‌ల అధికారి చెబితే.. రెడీ అవ్వాల్సిందే. కానీ.. స‌ర్కార్ స‌పోర్ట్ లేక‌పోవ‌డంతో.. స‌ర్కార్ ఉద్యోగుల నుంచి.. ఎలాంటి పాజిటివ్ సిగ్న‌ల్స్ రావ‌డం లేదు. పైగా క‌రోనా ఉండ‌డం.. సెకండ్ వేవ్ థ‌ర్డ్ వేవ్ అన‌డంతో.. వాళ్లు కూడా సింపుల్ గా త‌ప్పించుకుంటున్నారు. సీఎం జ‌గ‌నే వాళ్ల‌తో అలా చెప్పిస్తున్నారు అనే టాకున్నా.. పైకి మాత్రం అలా ఏం క‌నిపించ‌దు. క‌రోనా టైం క‌దా.. ముందు ప్ర‌జ‌ల ప్రాణాలు కాపాడుకోవాలి కానీ.. ఎల‌క్ష‌న్స్ పెట్ట‌క‌పోతే ఏం కొంప‌లంట‌క పోత‌య్ అంటున్నారు. 

ఎవ‌రికి మాత్రం ఏం చెప్ప‌గ‌ల‌రు చెప్పండి. చంద్రబాబు మ‌నిషిగా ముద్ర‌ప‌డ‌డంతో వైసీపీ స‌ర్కార్ స‌పోర్ట్ చేయ‌డం లేదు. జ‌గ‌న్ స‌పోర్ట్ చేయ‌డం లేదు కాబ‌ట్టి.. స‌ర్కార్ నో అంటోంది. ఓ ప‌క్క‌నేమో పుణ్య‌కాలం పూర్త‌య్యేలా ఉంది. మార్చి త‌ర్వాత ప‌ద‌వీ కాలం అయిపోతుంది. డిసెంబ‌ర్ లో కానీ జ‌ర‌ప‌కుంటే.. జ‌న‌వ‌రిలో పండ‌గ‌లు హ‌డావిడి ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి నుంచి బ‌డ్జెట్ స‌మావేశాలు న‌డుస్తుంట‌య్. అలా ఉంది ఎవ్వారం.

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

ఆపరేషన్ తెలంగాణ, టార్గెట్ జానారెడ్డి ఫ్యామిలీ

   6 hours ago


నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

నిన్నొక మాట.. ఇవాళ ఒక మాట.. ఇదేంటి కవితమ్మ

   7 hours ago


కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

కాంగ్రెస్‌లో మొద‌లైన పీసీసీ చీఫ్ లొల్లి.. రేసులో ముందున్నానన్న కోమటిరెడ్డి వెంక‌ట్‌రెడ్డి

   7 hours ago


కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

కేసీఆర్ ఉన్నత స్థాయి సమావేశం.. ఏమి మాట్లాడుతారో అన్న టెన్షన్

   8 hours ago


ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

ఏపీ ఏసీబీ డైరక్టర్‌గా తెలంగాణ రిటైర్డ్ ఐపీఎస్ రెడ్డి..!

   9 hours ago


టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

టీఆర్ఎస్ నుండి ఎటువంటి ప్రతిపాదన రాలేదంటున్న ఒవైసీ

   10 hours ago


సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

సుజనా చౌదరి తండ్రి యలమంచిలి జనార్ధనరావు కన్నుమూత

   10 hours ago


 ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

ఇప్పుడు ఇలాగే అంటారులే అసద్ జీ..!

   11 hours ago


సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

సభ్యులను సస్పెండ్ చేయడం బాధగా ఉంది.. తమ్మినేని

   11 hours ago


వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

వైసీపీ చెంతకు రాపాక వరప్రసాద్ కుమారుడు

   11 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle