newssting
Radio
BITING NEWS :
కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై సస్పెన్స్‌కు తెరపడింది. బీఎస్‌ యడియూరప్ప సోమవారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఈ సాయంత్రం గవర్నర్‌ను కలిసి రాజీనామాను సమర్పించనున్నారు. రాజీనామాపై ఆయన స్పందిస్తూ.. ‘‘ రాజకీయ జీవితంలో ఎన్నో అగ్నిపరీక్షలు ఎదుర్కొన్నా. కర్ణాటక అభివృద్ధి కోసం చాలా చేశా. 75 ఏళ్లు దాటినా నాకు రెండేళ్ల పాటు అవకాశం ఇచ్చారు. అధిష్టానం నిర్ణయాన్ని గౌరవిస్తా’’ అని అన్నారు. * ఆంధ్ర ప్రదేశ్ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. * చరిత్రలోనే మొట్టమొదటిసారి మన తెలుగు సంపద అయిన తెలంగాణ రాష్ట్రానికి చెందిన రామప్ప ఆలయానికి ఐక్యరాజ్య సమితి విద్య, విజ్ఞాన (పరిశోధన), సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించింది. రామప్పకు ప్రపంచ వారసత్వ హోదా కోసం 2015లోనే ప్రయత్నాలు మొదలయ్యాయి. * టోక్యో ఒలింపిక్స్‌లో జపాన్‌కి చెందిన మోమిజీ నిషియా సంచలనం సృష్టంచింది. ఒలింపిక్స్‌లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన రెండో అతి పిన్న వయస్కురాలిగా రికార్డు క్రియాట్‌ చేసింది. టోక్యో ఒలింపిక్స్‌లో కొత్తగా ప్రవేశపెట్టిన స్కేట్‌బోర్డింగ్ లో నిషియా స్వర్ణ పతకం సాధించింది. * ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్‌ తనయుడు ఆకాశ్‌ పూరి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘చోర్‌ బజార్‌’’. ‘దళం, జార్జ్‌ రెడ్డి’ చిత్రాల ఫేమ్‌ జీవన్‌ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. గెహనా సిప్పీ హీరోయిన్‌గా నటిస్తున్నారు.

జగన్ వర్సెస్ రఘురామ కృష్ణంరాజు

10-06-202110-06-2021 06:42:17 IST
Updated On 10-06-2021 06:42:11 ISTUpdated On 10-06-20212021-06-10T01:12:17.502Z10-06-2021 2021-06-10T01:11:53.167Z - 2021-06-10T01:12:11.379Z - 10-06-2021

జగన్ వర్సెస్ రఘురామ కృష్ణంరాజు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఎంపీ రఘురామ కృష్ణంరాజు విషయంలో ఎపి సిఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి పెద్ద తలనొప్పి వ్యవహారంలా మారింది. రఘురామను కస్టడీలో పోలీసులు కొట్టినట్లు కోర్టులో తేలడంతో ఇప్పుడు తాము తీసిన గోతిలో తామే పడ్డట్లు అయింది. ఆ వ్యవహారం జగన్ సర్కారు మెడకు చుట్టుకునేలా ఉంది. తనమీద జరిగిన దాడి గురించి సహచర ఎంపీలతో పాటు కేంద్రం దృష్టికి తీసుకెళ్ళడంతో ప్రస్తుతం ఈ విషయం జాతీయ స్థాయిలో చర్చకు దారి తీసింది.

గత ఏడాదిగా అదే పనిగా ప్రభుత్వం మీద, వైకాపా నాయకుల మీద ఆరోపణలు, విమర్శలు చేస్తున్నాడన్న కోపంతో గత నెలలో ఆయన మీద పలు సెక్షన్ల కిందట సీబీ సీఐడీతో కేసులు పెట్టించి అరెస్టు చేయించడం ద్వారా తగిన రీతిలో బుద్ధి చెప్పామని అనుకున్నారు వైకాపా నాయకులు. కానీ రఘురామ కృష్ణంరాజు విషయంలో వైఎస్ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం జగన్ సర్కార్ కి పెద్ద తలనొప్పి గా మారింది. జగన్ బెయిల్ రద్దుకోసం తాను వేసిన కేసును ఆయన మరింత ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా రఘురామ జగన్ సర్కారుకు మరో చిక్కు తెచ్చి పెట్టేలాగే కనిపిస్తున్నారు.

పోలవరం ప్రాజెక్టులో జగన్ సర్కారు అవినీతి మీద ఆయన పోరాటానికి రెడీ అయ్యారు. పోలవరంలో అవినీతిపై విచారణ జరపాలంటూ ఆయన ఢిల్లీలో కేంద్ర జల వనరుల శాఖా మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్‌ను కలిశారు. ఈ ప్రాజెక్టులో అవినీతికి సంబంధించి ఆయన ఆధారాలు కూడా సమర్పించినట్లు తెలుస్తోంది. దీని మీద రఘురామ కేసులు కూడా వేసే అవకాశముంది. జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక పోలవరం పనులు నత్తనడకన సాగుతున్నాయని, అందుకే కేంద్రం బిల్లుల చెల్లింపు లో అనేక కారణాలు చూపుతూ ఆలస్యం చేస్తుందని, దీనికివ వైఎస్ జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయాలే కారణమని రఘురామ కృష్ణంరాజు ఆరోపణలు లేవనెత్తారు. మరి ఈ విషయంపై వైఎస్ జగన్ ఎలా స్పందిస్తారో చూడాలి.


Newssting


 newssting.in@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle