newssting
Radio
BITING NEWS :
ఏలూరు మాజీ ఎంపి మాగంటి బాబు కుమారుడు ఆత్మహత్యాయత్నం. అర్థరాత్రి విజయవాడ ఆంధ్రా ఆస్పత్రికి తరలింపు. ఐసీయూలో వెంటిలేటర్ పై చికిత్స అందిస్తున్న వైద్యులు. బ్రెయిన్ స్ట్రోక్ తో ఆస్పత్రిలో చేర్పించామని చెప్తున్న కుటుంబ సభ్యులు. 24 గంటలు గడిస్తే గానీ ఏమీ చెప్పలేమన్న వైద్యులు. * ఏపీ మునిసిపల్ ఎన్నికల్లో అత్యధిక ఏకగ్రీవాలు చేసిన వైసీపీ. వైసీపీ -570, టీడీపీ -5, బీజేపీ -1, ఇతరులు -2 ఏకగ్రీవాలు. * విశాఖలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం. విజయవాడ నుంచి విశాఖకు తరలనున్న కమాండ్ కంట్రోల్ రూమ్. విశాఖలోని ప్రభుత్వ భూమిలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. * నెల్లూరు జాయింట్ కలెక్టర్ కార్యాలయ సిబ్బందిపై కేసు నమోదు. పదోన్నతి కల్పిస్తామని చెప్పి మోసం చేశారని అంగన్ వాడీ కార్యకర్త ఫిర్యాదు. జేసీ సీసీ శ్రీకాంత్, సిబ్బంది దయాకర్, వికాస్ పై కేసు నమోదు. జేసీ భార్య ఇంట్లో పనిచేయించుకుంటున్నారంటూ ఫిర్యాదు. కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని ఆందోళన. * రాజకీయాలపై సంచలన ప్రకటన చేసిన జయ నెచ్చెలి శశికళ. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన చిన్నమ్మ. శశికళ ప్రకటనతో నిరాశ చెందిన అభిమానులు. ఇది బీజేపీ స్క్రిప్ట్ అంటున్న శశికళ మద్దతుదారులు. * సీఎం జగన్ కు ఏపీ సీపీఎం కార్యదర్శి రామకృష్ణ లేఖ. రేపటి రాష్ట్ర బంద్ కు సహకరించాలని సీఎంకు వినతి. విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా బంద్ కు పిలుపునిచ్చిన సీపీఐ.

కేబినెట్ లో.. విశాఖ ఉక్కుపై స‌ర్కార్ నిర్ణ‌యం ఏంటి..?

23-02-202123-02-2021 11:19:09 IST
Updated On 23-02-2021 13:17:55 ISTUpdated On 23-02-20212021-02-23T05:49:09.465Z23-02-2021 2021-02-23T05:28:24.334Z - 2021-02-23T07:47:55.342Z - 23-02-2021

కేబినెట్ లో.. విశాఖ ఉక్కుపై స‌ర్కార్ నిర్ణ‌యం ఏంటి..?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
కేబినెట్ అంటే.. ఆషామాషీ కాదు. కేబినెట్ మీట్ లో ఉండే నిర్ణ‌యాల ప‌వ‌ర్ వేరే ఉంటుంది. ఆచి తూచి.. మంత్రుల అంద‌రి స‌ల‌హాలు తీసుకుని.. సీఎం ఏదో ఒక నిర్ణ‌యం ఫైన‌ల్ చేస్తారు. ఇవాళ్టి ఏపీ కేబినెట్ మీట్ లో ఏం జ‌ర‌గ‌బోతుంది. ఏయే అంశాలు డిస్క‌ష‌న్ కి వ‌స్తాయి. వేటిపై ఎలాంటి నిర్ణ‌యాలు ఉండ‌బోతున్నాయి అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ మారింది. 

మిగ‌తా విష‌యాలు ఎలా ఉన్నా.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ వ‌చ్చిన త‌ర్వాత‌.. ఫ‌స్ట్ కేబినెట్ మీట్ కాబ‌ట్టి.. ఇంకాస్త ఇంట్ర‌స్టింగ్ గా మారింది. ఆల్రెడీ.. సీఎం జ‌గ‌న్ కేంద్ర స‌ర్కార్ ఓ లేఖ రాశారు. మా రాష్ట్ర ప్ర‌భుత్వం పూర్తిగా వ్య‌తిరేకిస్తున్న‌ది.. విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ ప‌రం చేయ‌డానికి మా రాష్ట్రం అంగీకరించ‌దు అనే లేఖ రాశారు. ఆ లేఖ‌లోనే.. విశాఖ స్టీల్ ప్లాంట్ ని ఎలా లాభాల్లోకి తీసుకురావ‌చ్చో అంటూ కొన్ని స‌జెష‌న్లు చేశారు సీఎం జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

ఆ లేఖ త‌ర్వాత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి కొన్నాళ్లు సైలెంట్ గానే ఉన్నా.. త‌ర్వాత వైసీపీ యాక్టివ్ అయింది. సీఎం జ‌గ‌న్ తో పాటు.. మిగ‌తా లీడ‌ర్లు.. విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూని ఇంకాస్త సీర‌యస్ గా భుజానికి ఎత్తుకున్నారు. ఎంపీ విజ‌య‌సాయి అయితే.. యాత్ర‌లు దీక్ష‌లు.. స‌భ‌లు అంటూ హ‌డావిడి చేస్తున్నారు. మ‌రి ఈ కేబినెట్ మీట్ లో.. ఏం నిర్ణ‌యిస్తారు అనేది ఇంట్ర‌స్టింగ్ గా మారింది. అస‌లే.. మున్సిప‌ల్ ఎన్నిక‌ల టైం.. విశాఖ మేయ‌ర్ పీఠం ఎవ‌రికి ద‌క్కుతుంది అనే విష‌యంపై కూడా.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై స‌ర్కార్ తీరు డిపెండ్ అయి ఉంటుంది.

ఇప్ప‌టికే ప్ర‌తిపక్షాలు విశాఖ స్టీల్ ప్లాంట్ ని సీరియ‌స్ గా తీసుకుని.. పొలిటిక‌ల్ బెన్ ఫిట్ పొందేందుకు ట్రై చేస్తున్నాయి. జ‌నం నుంచి కూడా స‌ర్కార్ పై నెగ‌టివిటీ ఉంది. సో.. విశాఖ స్టీల్ ప్లాంట్ పై ఏ నిర్ణ‌యం తీసుకున్నా.. ప్లాంట్ ని కాపాడుకోవాలి అనే యాంగిల్ లోనే ఉంటుంది అనేది క్లారిటీ ఉంది జ‌నంలో కూడా. కానీ.. అది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుంది.. తూతూ మంత్రంగా ఏదో నిర్ణ‌యాలు తీసుకుంటారా అన్న‌ది ఇంట్ర‌స్టింగ్ పాయింట్ ఇప్పుడు.


Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle