ఏపీ బీజేపీ నేతలపై అధిష్టానం గరం గరం.. ఢిల్లీ వెళ్లి కొని తెచ్చుకున్నారా?
23-02-202123-02-2021 09:23:32 IST
Updated On 23-02-2021 10:27:18 ISTUpdated On 23-02-20212021-02-23T03:53:32.336Z23-02-2021 2021-02-23T02:12:12.063Z - 2021-02-23T04:57:18.744Z - 23-02-2021

కొన్ని కొన్ని సార్లు అంతే.. అష్టదిగ్బంధనం జరిగిపోతుంది. ఆ టైంలో ఎవరూ ఏమీ చేయలేరు. ఇప్పుడు ఏపీ బీజేపీ లీడర్ల పరిస్థితి కూడా అదే. ఉందుకు వెళ్లలేరు.. వెనక్కి తగ్గలేరు. అందుకే ఏం చేయాలో తెలీక బిక్కు బిక్కు మంటున్నారట. అలా అని ఆగలేరు కదా. అందుకే.. అలా ఢిల్లీకి వెళ్లారు మొన్నీ మధ్య కానీ.. అక్కడికెళ్లాక ఇంకో ప్రాబ్లమ్ వచ్చి పడిందంట. ఏంట్రా బాబూ ఈ ప్రాబ్లమ్స్ అని ఫీలయ్యే దాకా వెళ్లిందంట. ఏంటి సార్ ఏమైంది ఢిల్లీ టూర్.. స్టీల్ ప్లాంట్ అమ్మకం ఆపారా.. ఆగిందా.. ఆగబోతుందా.. కేంద్రం నుంచి హామీ వచ్చిందా.. ఇక పై ఉద్యమం చేయాల్సిన పనిలేదా అంటే. అసలు ఎందుకయ్యా ఉద్యమం.. ఎవరు చెప్పారు స్టీల్ ప్లాంట్ ని అమ్ముతున్నారు అంటూ.. వితండ వాదం చేస్తున్నారు బీజేపీ లీడర్లు. అదేంటయ్యా.. సెంట్రల్ అంత స్పీడ్ గా పనులు చేస్తుంది.. సెంట్రల్ మనిస్టర్లే క్లారిటీగా ఉన్నారు.. మీరెందుకు సామే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే మాత్రం.. ఏం ఆన్సర్ లేదు బీజేపీ ఏపీ లీడర్ల నుంచి. అది సరే.. మరి స్టీల్ ప్లాంట్ ని అమ్మని కాడికి.. మీరు ఢిల్లీకి ఎందుకు వెళ్లారయ్యా అంటే మాత్రం నో ఆన్సర్. ఎందుకంటే.. బీజేపీ ఏపీ లీడర్లకి ఢిల్లీలో చీవాట్లు పడ్డాయట. ప్రతి దానికీ మీరు ఢిల్లీకి రావద్దు.. వస్తే వచ్చారు. ఏమైనా పనులుంటే చూసుకుని వెళ్లండి. కావాలంటే వారం వారం వచ్చి తాజ్ మహల్ ని చూసి వెళ్లండి కానీ.. మేం చేసే పనులకు అడ్డు చెప్పకండి. స్టీల్ ప్లాంట్ విషయంలో అయితే అస్సలే అడ్డు చెప్పకండి. అది ఆల్రెడీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. ఈ విషయంలో మీరు కాస్త కామ్ అయిపోండి అన్నారట కేంద్రం పెద్దలు. అయినా.. ఏపీ బీజేపీలో ఏం జరుగుతుంది అని.. బీజేపీ పెద్దలు ప్రశ్నించారట. అక్కడ జరుగుతున్న తంతు మొత్తం రిపోర్టులు వస్తూనే ఉన్నాయి. కలిసి ఢిల్లీకి వస్తున్నారు కానీ.. కలిసి పని చేయడం లేదట కదా. అందుకే.. పార్టీ ఎదగలేక పోతుంది కదా అన్నారట. పాపం బీజేపీ లీడర్లు ఇంకేం చేస్తారు.. సర్దుకుపోతున్నారు. ఉన్న చోట ఉండక.. ఢిల్లీకి ఎందుకు వెళ్లాం.. పెద్దలతో చీవాట్లు ఎందుకు తిన్నాం అనుకుంటున్నారట.

ఎమర్జెన్సీపై రాహుల్ వ్యాఖ్యలు హాస్యాస్పదం.. జవదేకర్ ఎద్దేవా
8 hours ago

ఆత్మహత్యకు ప్రయత్నించిన మాగంటి బాబు కుమారుడు
9 hours ago

భారీగా నామినేషన్ల ఉపసంహరణ
10 hours ago

బీజేపీకి రైతుల పాపం ఊరికే పోతుందా
2 hours ago

గ్రేటర్ మేయర్ ప్రేమ, అభిమానం కోసం.. నేను కుక్కలా పుడతా- వర్మ
9 hours ago

మున్సిపల్ పోరుపై బాబు ఫోకస్
10 hours ago

రాజకీయాలనుంచి తప్పుకుంటున్నా.. చిన్నమ్మ
12 hours ago

స్టాలిన్ ని ఓడిస్తా అంటున్న హిజ్రా
5 hours ago

నేను వైసీపీలో చేరను-గంటా క్లారిటీ
12 hours ago

విశాఖ ఉక్కు అయిపోయింది.. విశాఖ పోర్టు వంతు వచ్చింది
13 hours ago
ఇంకా