ఉన్నదే ముచ్చటగా ముగ్గురు నలుగురు.. మళ్లీ అందులో గ్రూపులా
19-01-202119-01-2021 11:51:33 IST
Updated On 19-01-2021 09:51:44 ISTUpdated On 19-01-20212021-01-19T06:21:33.430Z19-01-2021 2021-01-19T03:27:10.869Z - 2021-01-19T04:21:44.940Z - 19-01-2021

ఏంటో.. ఈ గ్రూపు రాజకీయాలు. ఏపీలో బీజేపీ నేతలు కూడా.. తెలంగాణలో కాంగ్రెస్ నేతల్లా తయారయ్యారు. మిగతా పార్టీలన్నీ.. ఒక్కతాటిపై నడుస్తూ.. పార్టీని ఎలా ముందుకు నడిపించాలి. సీటు ఎలా సంపాదించాలి.. సంపాదించిన సీటుని ఎలా నిలబెట్టుకోవాలి. ఎలా గెలిపించుకోవాలి.. పార్టీ గెలిస్తే.. మనకి ఏ మంత్రి పదవి దక్కుతుంది అని ఆలోచిస్తుంటారు. కానీ.. కాంగ్రెస్ లీడర్లు మాత్రం ఒకరిపై ఒకరు పెత్తనాలు చేస్తుంటారు. గ్రూపులు గ్రూపులు కట్టి.. డివైడ్ అయ్యి పోతుంటారు. ఇప్పుడేమో.. బీజేపీ ఏపీ లో కూడా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. బీజేపీ ఏపీకి అధ్యక్షుడు సోమూ వీర్రాజు. కానీ.. ఆయన పరిస్థితి ఒంటరి ప్రయాణమే అన్నట్లు తయారైంది. ఓ పక్క పార్టీలన్నీ పరుగులు పెడుతున్నాయి. అధ్యక్షులు బండి స్పీడు పెంచేశారు. కానీ.. బీజేపీ మాత్రం ముందుకు పోవడం లేదు. రథ యాత్ర ఎంత దాకా వచ్చిందో కూడా తెలీదు. ఎప్పుడు పెడతారో అనే విషయంపై జనాలకి క్లారిటీ లేదు. రథం రెడీ అయిందా లేదా అనే విషయంపైనా బీజేపీ కార్యకర్తలకి నో అప్డేట్స్. ఎవరెవరు వస్తున్నారు.. వస్తే ఎలా పబ్లిసిటీ చేసుకోవాలి. ప్రచారంతో ఎలా ముందుకెళ్లాలి. పార్టీని ఎలా ముందుకు నడిపించాలి అని ఎక్కడా ఒక ప్లానింగ్ లేదు. పెద్దలు దిగితే.. లోకల్ లీడర్లు అంతా.. ఒకటవుతారా.. లేదంటే ఎవరికి వారే కలిసి షేక్ హ్యాండ్ లు ఇస్తారా. అసలు రథ యాత్ర అందరు కలిసి తీసుకున్న నిర్ణయమేనా.. కాదా అనే విషయంపైనా నో క్లారిటీ. ఏదో ప్లానేశారంటే ప్లానేశారు. ఎవ్వారం నడుస్తోంది అంటే నడుస్తోంది. కానీ.. ఒక ప్లాన్ ని జనంలోకి తీసుకెళ్లే విషయంలో మాత్రం.. బీజేపీ ఏపీ లీడర్లకి క్లారిటీ లేనట్లే ఉంది. ఆల్రెడీ.. టాం టాం అని మార్మోగుతుంటేనే అంత పెద్ద రథయాత్రకి ఓ వ్యాల్యూ ఉంటుంది. కానీ.. ఇప్పటికీ సప్పగానే ఉందంటే.. ఏంటి పరిస్థితి. పైగా.. బీజేపీలో గ్రూపు తగాదాలు కూడా ఇప్పుడే బయటికొచ్చాయట. ప్రత్యర్థులు కూడా అదే విషయాన్ని టార్గెట్ చేస్తున్నారు. బీజేపీ ఏపీలో రెండు గ్రూపులున్నాయి.. ఒకటి ఆర్ఎస్ఎస్ బీజేపీ.. రెండోది టీడీపీ బీజేపీ అంటూ.. మినిస్టర్ అవంతి శ్రీనివాస్ చేసిన కామెంట్స్ తో అవును కదా నిజమేనట్లుంది అనే కొత్త టాక్ బయటికొచ్చింది. ఇప్పుడు మేం ఐక్యంగానే ఉన్నాం.. కలిసి ఉంటే కలదు సుఖం అని పాటలు పాడుకుంటున్నాం అని.. బీజేపీ ఏపీ లీడర్లు ఎలా ప్రూవ్ చేసుకుంటారో.. పార్టీ కార్యకర్తల్ని ఎలా ముందుకు నడిపిస్తారో చూడాలి.

కాంగ్రెస్‌లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
3 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
3 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
4 hours ago

వివాదంలో అశోక్‌గజపతిరాజు.. మహిళను కొట్టారా..?
24 minutes ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
19 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
21 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
a day ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
12 hours ago
ఇంకా