టీడీపీ వర్సెస్ వైసీపీ..నెల్లూరులో టగ్గాఫ్ వార్
20-02-202120-02-2021 07:41:37 IST
Updated On 20-02-2021 12:42:47 ISTUpdated On 20-02-20212021-02-20T02:11:37.233Z20-02-2021 2021-02-19T19:19:38.064Z - 2021-02-20T07:12:47.385Z - 20-02-2021

కార్పొరేషన్ ఎన్నికల గంట మోగింది కదా. ఇక కొత్త రాజకీయం పరుగులు పెడుతోంది. పంచాయితీ ఎన్నికల వేడి తగ్గక ముందే.. మున్సిపల్ ఎన్నికల వేడి పెరిగింది. నెల్లూరులో అయితే పాలిటిక్స్ ఇంట్రస్టింగ్ గా మారాయి. ఏపీలో ఎన్నికలు ఎక్కడ జరిగినా.. నెల్లూరు ఎలక్షన్ మాత్రం సమ్ థింగ్ డిఫరెంట్. ఎందుకంటే.. అక్కడ మినిస్టర్ అనిల్ ఉంటారు కదా. ఆయనకి కాస్త దూకుడు ఎక్కువ కదా.. అందుకే అక్కడి పాలిటిక్స్ కచ్చితంగా ఇంట్రస్టింగ్ గానే ఉంటయ్.
నెల్లూరు జిల్లాలో వైసీపీలో.. రెడ్డి సామాజిక వర్గం లీడర్ల కంటే.. మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ దూకుడే ఎక్కువ. మొదటి నుంచి అనిల్ తీరే అది కదా. ఎన్ని వివాదాలు అయినా తగ్గరు.. మైక్ అందుకుంటే.. మినిస్టర్ హోదా మరిచి.. ఏదైనా మాట్లాడేస్తారు. ఇక నెల్లూరులో ఇప్పుడు పాలిటిక్స్ ఇంట్రస్టింగ్ గా మారడానికి రీజన్.. టీడీపీ నెల్లూరు పై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఎలాగైనా సరే.. మేయర్ పదవి దక్కించుకోవాలని.. పట్టుమీదుంది. సీనియర్ లీడర్ సోమిరెడ్డి కూడా చంద్రబాబుకి కాన్ఫిడెన్స్ తో హామీ ఇచ్చారట. ఈసారి నెల్లూరు మేయర్ పీఠం టీడీపీకే దక్కుతుంది అని చెప్పడంతో.. క్లారిటీగా ఉన్నారట టీడీపీ లీడర్లు.
నెల్లూరు జిల్లాలో వైసీపీ బలంగా ఉన్నా.. నెల్లూరు కార్పొరేషన్ లో టీడీపీ బలానికి ఏ మాత్రం తక్కువ లేదు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, మాజీ మంత్రి పొంగూరి నారాయణ, మాజీ మేయర్ అజీజ్ లు సీరియస్ గా ఫోకస్ చేశారు. ఏది ఏమైనా సరే.. చంద్రమోహన్ లీడ్ లో.. నెల్లూరు మేయర్ పదవి దక్కించుకుని తీరాలని.. టీడీపీ లీడర్లు ఫోకస్ చేశారు. అయితే.. అధికార పార్టీలో ఉన్న మినిస్టర్ అనిల్ కుమార్ యాదవ్ ని తట్టుకుని టీడీపీ లీడర్లు నిలబడగలరా అనే క్వశ్చన్స్ బోలెడు. కానీ.. ఇటు టీడీపీ కూడా బలంగానే ఉంది. ఇకపోతే.. అనిల్ కుమార్ యాదవ్ కి.. సొంత పార్టీలోనే లీడర్లు యాంటీగా ఉన్నారు. అనిల్ ఎంత దూకుడుగా ఉన్నా.. మిగతా లీడర్లు మొత్తం.. అనిల్ ఎవ్వారంతో విసిగిపోయి ఉన్నవారే. ఆల్రెడీ అక్కడ గ్రూపు రాజకీయాల గురించి తెలిసిందే. సో.. ఈ విషయం కూడా టీడీపీకి కలిసొచ్చే విషయమే అవుతుంది. మరి చూడాలి.. ఎలక్షన్ తీరు ఎలా ఉండబోతుందా.. రిజల్ట్ ఇంకెలా ఉండబోతుందో.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
6 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
8 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
9 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
9 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
9 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
10 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
10 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
24 minutes ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
8 hours ago

డాక్టర్ చిరంజీవి కొల్లూరి కన్నుమూత..!
11 hours ago
ఇంకా