ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ కీలక నిర్ణయాలు
23-02-202123-02-2021 16:35:27 IST
Updated On 23-02-2021 17:39:01 ISTUpdated On 23-02-20212021-02-23T11:05:27.163Z23-02-2021 2021-02-23T11:05:23.185Z - 2021-02-23T12:09:01.116Z - 23-02-2021

ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన మంత్రి మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా రాజధాని అమరావతిలో పూర్తి కాకుండా మిగిలిపోయిన నిర్మాణాల గురించి, కాకినాడ ఎస్ఈజెడ్ భూముల గురించి మరియు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి చర్చ జరిగింది అని సమాచారం.
- అమరావతి రాజధాని పరిధిలో అసంపూర్ణంగా ఉన్న నిర్మాణాలు పూర్తి చేసేందుకు ఏఎంఆర్డీఏకు రూ.3వేల కోట్ల బ్యాంకు గ్యారెంటీ ఇచ్చేందుకు కేబినెట్ అంగీకారం తెలిపింది.
- కాకినాడ ఎస్ఈజెడ్ భూముల వ్యవహారంలో రైతులకు నష్ట పరిహారాన్ని ఖరారు చేసే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కమిటీ సూచించిన నష్ట పరిహారం కంటే ఎక్కువగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయించింది. ఎస్ఈజెడ్ పరిధిలోని ఆరు గ్రామాలను తరలించేందుకు మినహాయింపునిచ్చింది.
- వైఎస్సార్ స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం భాగస్వామ్య సంస్థ ఎంపికకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
- 'ఈబీసీ నేస్తం' పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అగ్రవర్ణ పేద మహిళల ఆర్థిక పరిపుష్టి కోసం ప్రభుత్వం కొత్త పథకాన్ని రూపొందించింది. వైయస్ఆర్ చేయూత కార్యక్రమం ఈబీసీ వర్గానికి వర్తింపజేస్తూ వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అగ్రవర్ణాల్లో ఆర్థిక వెనుకబాటు కలిగిన ఈబీసీలకు ప్రతి ఏటా రూ.15 వేల చొప్పున రాబోయే మూడేళ్లలో రూ.45వేలు చెల్లించేందుకు కేబినెట్లో నిర్ణయం.
- కడప జిల్లాలో రెండు పారిశ్రామిక పార్కులకు భూ కేటాయింపులపై చర్చ జరిగింది. జమ్ములమడుగు మండలంలో 3148.68 ఎకరాల భూమిని ఏపీ హైగ్రేడ్‌కు కేటాయించి, ఈ స్థలంలో వైయస్ఆర్ స్టీల్ ప్లాంట్ నిర్మించాలని మంత్రి మండలి తీర్మానించింది. అంబాపురంలో 93.99 ఎకరాల్లో ఏపీఐఐసీ ఆధ్వర్యంలో మెగా ఇండస్ట్రీయల్ పార్క్ కోసం భూమి కేటాయిస్తూ మంత్రి మండలి నిర్ణయం తీసుకుంది.

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
7 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
10 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
10 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
11 hours ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
11 hours ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
7 minutes ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
11 hours ago

హైదరాబాద్ పేరును మార్చేస్తామని అంటున్న బీజేపీ నేత
12 hours ago

పవన్ కి విశాఖలో అడుగు పెట్టే ధైర్యం లేదా
2 hours ago

ఎంపీ గోరంట్ల మాధవ్ కు మహిళ నుండి ఊహించని ప్రశ్న
10 hours ago
ఇంకా