ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే
29-11-202029-11-2020 09:47:56 IST
2020-11-29T04:17:56.639Z29-11-2020 2020-11-29T04:17:40.411Z - - 21-01-2021

కరోనా, ఆర్థిక సంక్షోభం వంటి అత్యంత ప్రతికూల పరిస్థితుల్లోనూ ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధిలో దూసుకెళ్లిపోతోందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఇండియా టుడే స్టేట్ ఆఫ్ స్టేట్స్–2020 అధ్యయనం.. ఒక్క ఆర్థిక రంగంలోనే కాదు. పర్యాటక రంగంలోనూ ఏపీ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోందని పేర్కొంది. ఆర్థికాభివృద్దిలో టాప్, కరోనా కట్టడిలో మూడో స్థానం, పెద్ద రాష్ట్రాల విభాగం ఓవరాల్ ప్రదర్సనలో ఏడో స్థానం.. మెరుగు పడుతున్న పెద్దరాష్ట్రాల్లో రెండో స్థానం... ఇలా ఏపీ ప్రగతి రథం అనూహ్య వేగంతో ముందుకెళుతోందని ఈ అధ్యయనం చెప్పింది. కరోనా ప్రతికూలపరిస్థితులను అధిగమించి 12 రంగాల్లో (ఆర్థిక, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, సమ్మిళిత అభివృద్ధి, పరిపాలన, శాంతిభద్రతలు.. ఎంటర్ప్రెన్యూర్షిప్, పరిశుభ్రత, పర్యావరణం, విద్య, ఆరోగ్యం, వ్యవసాయం) రాష్ట్రాలు సాధిస్తున్న ప్రగతిని.. వివిధ మార్గాల్లో సేకరించిన డేటాతో పరిశీలించింది. వివిధ రంగాల్లో దేశం, రాష్ట్రాలు జూన్ నుంచి అక్టోబర్ వరకూ సాధించిన ప్రగతిపై మార్కెటింగ్ అండ్ డెవలప్మెంట్ రీసెర్చ్ అసోసియేట్స్ (ఎండీఆర్ఏ)తో కలిసి ఇండియా టుడే సంస్థ అధ్యయనం చేసింది. ఆయా విభాగాల్లో రాష్ట్రాలను ఉత్తమ ప్రదర్శన (బెస్ట్ పెర్ఫార్మింగ్), అత్యుత్తమ మెరుగైన (మోస్ట్ ఇంప్రూవ్డ్), ఓవరాల్ కేటగిరీలుగా ఇండియాటుడే అధ్యయనం విభజించింది. వాటికి అనుగుణంగా స్కోర్ ఇచ్చింది. ఆయా విభాగాల్లో ఉత్తమ రాష్ట్రాలను విజేతలుగా పేర్కొంది. ఈ అధ్యయనంలో భాగంగా 35 వేల చదరపు కి.మీ.ల భౌగోళిక విస్తీర్ణం లేదా 5 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా కలిగిన 20 రాష్ట్రాలను పెద్ద రాష్ట్రాలుగానూ, అంతకంటే తక్కువ విస్తీర్ణం, జనాభా కలిగిన రాష్ట్రాలను చిన్న రాష్ట్రాలుగానూ వర్గీకరించింది. వీటికి అనుగుణంగా ర్యాంకులు ఇచ్చింది. ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు మరో షాక్! ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మింగ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో పదో స్థానంలో ఉంటే.. గతేడాది ఎనిమిదో స్థానానికి చేరింది. ఇప్పుడు ఏడో స్థానంలోకి దూసుకొచ్చింది. మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2018లో మన రాష్ట్రం ఎనిమిదో ర్యాంకులో నిలిస్తే.. గతేడాది రెండో ర్యాంకును సాధించింది. ఈ ఏడాది అదే ర్యాంకును నిలబెట్టుకుంటూ స్థిరమైన అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని ఇండియా టుడే అధ్యయనం వెల్లడించింది. మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో ఆర్థిక రంగం, పర్యాటక రంగంలో ఆంధ్రప్రదేశ్ ప్రథమ స్థానంలో నిలిచింది. ఓవరాల్ మోస్ట్ ఇంప్రూవ్డ్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2,000 మార్కులకుగానూ 1,194.8 మార్కులను సాధించిన ఏపీ రెండో స్థానంలో నిలిచింది. ఓవరాల్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ పెద్ద రాష్ట్రాల విభాగంలో 2,000 మార్కులకుగానూ 1,147.7 మార్కులను సాధించిన ఏపీ ఏడో స్థానానికి చేరుకుంది. కరోనా కట్టడిలో వందకు 65.8 మార్కులను సాధించిన రాష్ట్రం మూడో స్థానంలో నిలిచింది.

ఎన్నికలకు సహకరిస్తామని చెప్పిన ఏపీ ప్రభుత్వం..!
30 minutes ago

ఏపీఎస్ ఆర్టీసీ ఎండీగా ఠాకూర్.. షాక్ లో ప్రతిపక్షాలు
6 minutes ago

రేషన్ డోర్ డెలివరీ వాహనాలను ప్రారంభించిన వైఎస్ జగన్
an hour ago

జగన్ సర్కార్ కి మరో దెబ్బ.. ఎన్నికలు జరపాలని చెప్పిన హై కోర్టు
2 hours ago

రేవంత్ రెడ్డి, రఘువీర్ రెడ్డి.. జానారెడ్డి గెలుపుకి బాధ్యులు అవుతారా?
34 minutes ago

బెదిరింపులకు ఆయుధంగా మారిన అట్రాసిటీ కేసులు.. హైకోర్టు అక్షింతలు
2 hours ago

భారతీ సిమెంట్ మీద మమకారం.. వందల కోట్ల ప్రభుత్వ నిధుల చెల్లింపు
3 hours ago

ఆ ఒక్క మాట.. రెండు కులాల మధ్య చిచ్చు.. ప్రభుత్వానికి తప్పని చికాకు
4 hours ago

పల్నాడులో టీడీపీ నేత అంకులును చంపింది వీరే
4 hours ago

విడుదలైన కళా వెంకట్రావు
5 hours ago
ఇంకా