newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

ఏప్రిల్ 7,8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో సెలవులు.. ఎడమచేతి చిటికెన వేలుకు సిరా గుర్తు

06-04-202106-04-2021 07:33:09 IST
Updated On 06-04-2021 10:17:08 ISTUpdated On 06-04-20212021-04-06T02:03:09.830Z06-04-2021 2021-04-06T02:01:43.574Z - 2021-04-06T04:47:08.498Z - 06-04-2021

ఏప్రిల్ 7,8 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ లో సెలవులు.. ఎడమచేతి చిటికెన వేలుకు సిరా గుర్తు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఏపీలో ఈ నెల 8న పరిషత్ ఎన్నికల పోలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రెండ్రోజులు సెలవులు ప్రకటించింది. ఈ నెల 8వ తేదీతో పాటు, 7వ తేదీన కూడా సెలవుగా తెలిపింది. 7వ తేదీన ఎన్నికల ఏర్పాట్ల నిమిత్తం సెలవు ఇస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ రెండ్రోజుల పాటు ప్రభుత్వ కార్యాలయాలు, స్కూళ్లు, సంస్థలకు, దుకాణాలకు, వాణిజ్య సంస్థలకు సెలవు ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో రెండ్రోజులు ముందుగానే మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.

ఏపీపీఆర్‌ యాక్ట్‌ 225ఏ ప్రకారం ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ముందస్తుగా 48 గంటల పాటు మద్యం అమ్మకాలను నిలిపివేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం జరుగనున్న పరిషత్‌ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే వారికి ఎడమ చేతి చిటికెన వేలుసై సిరా గుర్తు వేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. పంచాయతీ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలుకు సిరా గుర్తు వేశారు.. అది ఇంకా చెరగకపోవడంతో చిటికెన వేలుకు సిరా గుర్తు వేయాలని ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు.

నేగోషియబుల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ యాక్ట్‌ 1881 ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఏప్రిల్‌ 8వ తేదీన సెలవుదినంగా  ప్రభుత్వం ప్రకటించింది.  ఏపీ షాప్స్‌ అండ్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1988 ప్రకారం 8వ తేదీని ఉద్యోగులు, కార్మికులకు వేతనంతో కూడిన సెలవుగా ప్రకటించింది. ఎన్నికల తేదీని స్థానిక సెలవుగా ప్రకటించడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించాలని కోరింది. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థల భవనాలను ఒక రోజు ముందు నుంచి..అనగా 7వ తేదీ నుంచి వినియోగించుకోవడానికి అనుమతించింది. ప్రభుత్వ ఉద్యోగులు ఓటర్లను ప్రభావితం చేయరాదని, అలాగే  ఎవరికి ఓటు వేశామన్న  విషయాన్ని కూడా బహిర్గతం చేయకూడదని స్పష్టం చేసింది.  

 పంచాయతీరాజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది సోమవారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షించి పలు సూచనలు జారీ చేశారు. కోవిడ్‌–19 నిబంధనలు పాటిస్తూ ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశించారు.

తిరుప‌తిలో  ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

తిరుప‌తిలో ఇవాళ అమ్మ‌వారి కటాక్షమే పార్టీల‌కు ఇంపార్టెంట్

   2 minutes ago


ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

ష‌ర్మిల ట్ర‌య‌ల్స్.. పార్టీ పెట్ట‌కుండానే ఎన్నిక‌ల్లో పోటీకి రెడీ

   an hour ago


వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

వెంట వెంట‌నే ఎన్నిక‌లు.. మంచికేన‌ట

   14 hours ago


లొంగిపోయిన కూన రవికుమార్

లొంగిపోయిన కూన రవికుమార్

   10 hours ago


రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు

   13 hours ago


షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు

   15 hours ago


తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!

   17 hours ago


ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్

   19 hours ago


బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం

   20 hours ago


కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!

   a day ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle