newssting
Radio
BITING NEWS :
పశ్చిమగోదావరి జిల్లా పూళ్లలో వింతవ్యాధితో కళ్లు తిరిగి పడిపోతున్న జనం. వింతవ్యాధితో పడిపోయిన 20 మంది బాధితులు, పలువురికి గాయాలు. * లక్షద్వీప్ లో తొలి కరోనా కేసు నమోదు. కోచి నుంచి నౌకలో వచ్చిన కానిస్టేబుల్ కు పాజిటివ్. * అధికార సంప్రదాయాలు, లాంఛనాలకు స్వస్తి పలికిన ట్రంప్. రేపు జో బైడెన్ దంపతులకు స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్న వైట్ హౌస్. * గొల్లపూడిలో హై టెన్షన్. మంత్రి కొడాలి నాని వ్యాఖ్యలకు నిరసనగా గొల్లపూడి ఎన్టీఆర్ విగ్రహం వద్ద దీక్షకు వెళ్లిన దేవినేనిని అడ్డుకున్న పోలీసులు, దేవినేని ఉమా అరెస్ట్. కోవిడ్ ఆంక్షల కారణంగా దీక్షకు అనుమతి లేదన్న పోలీసులు. దీక్షకు బయల్దేరిన బుద్ధావెంకన్న హౌస్ అరెస్ట్. * నేడు ఢిల్లీకి వెళ్లనున్న ఏపీ సీఎం జగన్. అమిత్ షా సహా పలువురు మంత్రులతో భేటీ అయ్యే అవకాశం. పోలవరం ప్రాజెక్ట్ పెండింగ్ నిధులు, హై కోర్టు తరలింపు తదితర అంశాలపై చర్చించే అవకాశం. * గొల్లపూడిలో వైసీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు. దేవినేని ఉమా ఇంటికెళ్లే దారిలో భారీగా పోలీసుల మోహరింపు.

పవన్ ఒక్కడే.. మంత్రులు ఆరుగురు.. మోతెక్కిన మైకులు..

30-12-202030-12-2020 15:15:16 IST
2020-12-30T09:45:16.601Z30-12-2020 2020-12-30T09:45:10.468Z - - 20-01-2021

పవన్ ఒక్కడే.. మంత్రులు ఆరుగురు.. మోతెక్కిన మైకులు..
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

జనసేన అధినేత పవన్ కల్యాణ్ గుడివాడలో పర్యటించి  వైసీపీ నేతల మీద తీవ్రమైన కామెంట్లు చేయడంతో ఆ పార్టీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఒక్క పవన్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్లు వేయడానికి ఏకంగా ఆరుగురు మంత్రులు రంగం లోకి దిగారు.  ముఖ్యమంత్రి దగ్గర్నుంచి ఆదిమూలపు సురేష్ వరకూ ప్రతి ఒక్కరూ పవన్ కల్యాణ్‌పై వ్యక్తిగతంగా, రాజకీయంగా విమర్శలు చేశారు.  పవన్ కల్యాణ్ రైతు పోరాటాన్ని ముఖ్యమంత్రి జగన్.. చంద్రబాబు చెబితే చేస్తున్నాడని, వారికి రైతులపై ప్రేమ లేదన్నారు. 

మంత్రి పేర్ని నాని .. పవన్ ను చిడతల నాయుడు అని అభివర్ణిస్తూ విమర్శలు గుప్పించారు. ఇంతకీ పవన్ ఎవరు? అని ప్రశ్నించారు. మెడపై మట్టి నలుపుకుంటూ ఉండే ఆయనేనా పవన్ కల్యాణ్ అంటే? అంటూ విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబుకు చిడతలు కొట్టిన వ్యక్తి పవన్ అని.. చిడతలు వాయిస్తూ డబ్బులు సంపాదించడంలో పవన్ దిట్ట అని అన్నారు. తనది స్వామి భక్తి అని.. తను చనిపోయేటప్పుడు కూడా వైఎస్ జపం చేస్తానని చెప్పుకొచ్చారు. 

కొడాలి నాని కూడా ఇక ఆగుతారా చెప్పండి. ప్యాకేజీలు తీసుకుని, ఎవరో రాసిన స్క్రిప్టులు చదివే పచ్చకామెర్లు సోకిన యాక్టర్ అని విమర్శించారు. శతకోటి లింగాల్లో పవన్ కల్యాణే ఒక బోడిలింగమని, తాను శివలింగం వంటివాడినని అన్నారు. పవన్ బోడిలింగం కాబట్టే... గాజువాక, భీమవరం ప్రజలు కింద పడేసి తొక్కేశారని అన్నారు. పవన్ కల్యాణ్ ప్యాకేజ్ స్టార్ అని.. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును చదవి వెళ్లిపోయారని అన్నారు. పవన్ లాంటి వ్యక్తి రాజకీయాల్లో ఉండటం మన దురదృష్టమని.. వంద మంది పవన్ కల్యాణ్ లు వచ్చినా జగన్ ను ఏమీ చేయలేరని ఎద్దేవా చేశారు.పేకాట క్లబ్బులను ఎక్కడా నిర్వహించడం లేదని.. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పేకాట క్లబ్ లను మూసేస్తున్నామన్నారు.

వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ సినిమాల్లో పేమెంట్ తీసుకుని ఎలా నటిస్తున్నారో.. రాజకీయాల్లో కూడా అలానే నటిస్తున్నారన్నారు. సినిమా ప్రమోషన్ కోసమే పవన్‌ పర్యటనలని… అసెంబ్లీని ఎందుకు ముట్టడిస్తారో చెప్పాలని అవంతి ప్రశ్నించారు.

గత ప్రభుత్వం రుణమాఫీ పై ఎలా స్పందించారని.. కోవిడ్ సమయంలో పవన్ ఎక్కడికెళ్లారో చెప్పాలని మరో మంత్రి మేకపాటి గౌతం రెడ్డి డిమాండ్ చేశారు.

మంత్రి ఆదిమూలపు సురేష్ పవన్ వ్యాఖ్యలను‌ తేలిగ్గా తీసుకున్నారు.గెలిచిన ఒక్క ఎమ్మెల్యేని కూడా కాపాడుకోలేకపోయారని విమర్శించారు. రాజకీయం అంటే సినిమా సెట్టింగులు, షూటింగులు కాదని అన్నారు. సినిమా సెట్టింగ్ రాజకీయాలు ఎప్పుడో పోయాయని.. సినిమాలు చేయాలనుకుంటే సినిమాలే చేసుకోండి... ప్రజల సమస్యలు తెలుసుకోవాలనుకుంటే మా నాయకుడిలా పాదయాత్ర చేయండి అంటూ పవన్ కల్యాణ్ కు సూచించారు. 14 నెలల పాటు పాదయాత్ర చేయడం అంటే సినిమా చేసినట్టు కాదని ఎద్దేవా చేశారు. 

 పవన్ జనంలోకి వస్తే వచ్చే స్పందన ఎలా ఉంటుందో కళ్ల ముందు కనిపించంది కాబట్టే ప్రభుత్వం మూకుమ్మడి ఎటాక్ చేసి పవన్ కల్యాణ్ ను దెబ్బతీయాలని అనుకుంటున్నారని జనసేన వర్గాలు చెబుతూ ఉన్నాయి. 

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

అమిత్ షాతో ముగిసిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి భేటీ

   4 hours ago


తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

తిరుమలలో నిన్న పందులు.. నేడు దొంగలు.. ఏంది సార్ ఇది

   4 hours ago


ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

ఢిల్లీ చేరుకున్న వైఎస్ జగన్.. ఎలాంటి రాజకీయ కారణాలు లేవంటున్న సజ్జల

   6 hours ago


దేవినేని ఉమ విడుదల..!

దేవినేని ఉమ విడుదల..!

   8 hours ago


ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

ఢిల్లీ వెళ్లిన ఏపీ సీఎం.. ఎవరెవరు ఉన్నారంటే..!

   8 hours ago


'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

'దీదీ'ని ఓడించకపోతే రాజకీయాల్లోంచే తప్పుకుంటా.. సువేందు

   9 hours ago


ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

ఏ పార్టీలో అయినా చేరండి.. కానీ రాజీనామా చేయండి.. రజనీ మక్కల్ మన్రం

   11 hours ago


బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

బ‌ల‌మేంటో తెలీదా.. లేదంటే బ‌ల‌మే లేదా

   13 hours ago


మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

మ‌తం పేరు వ‌ర్క‌వుట్ అవుతుందా.. తెలుగోళ్లు ప‌ట్టించుకుంటారా

   14 hours ago


ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

ఉన్న‌దే ముచ్చ‌ట‌గా ముగ్గురు న‌లుగురు.. మ‌ళ్లీ అందులో గ్రూపులా

   15 hours ago


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle