newssting
Radio
BITING NEWS :
ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరుగుతున్న దసరా శరన్నవరాత్రోత్సవాలు. నాల్గవరోజు అన్నపూర్ణాదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తోన్న దుర్గమ్మ. * పెచ్చులూడుతోన్న బెజవాడ కనకదుర్గా ఫ్లై ఓవర్. సోమవారం రాత్రి ఏపీఎస్పీ బెటాలియన్ కానిస్టేబుల్ రాంబాబుపై పడిన ఫ్లై ఓవర్ పెచ్చులు. తీవ్రగాయాలు కావడంతో రాంబాబును ఆస్పత్రికి తరలించిన సిబ్బంది. భారీ వర్షాల కారణంగానే ఇలా జరిగి ఉంటుందంటున్న అధికారులు. * తెలంగాణలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,486 కేసులు, ఏడుగురు మృతి. యాక్టివ్ గా ఉన్న 20,686 కేసులు. * తెలంగాణ ప్రయాణికులకు సర్కార్ శుభవార్త. దసరా సందర్భంగా ఈ నెల 24 వరకూ రాష్ట్రంలో వివిధ జిల్లాలకు 3000 స్పెషల్ బస్సులు. ఎంజీబీఎస్, జేబీఎస్, కూకట్‌పల్లి, ఎస్సార్ నగర్, అమీర్‌పేట, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్బీనగర్ తదితర ప్రాంతాల నుంచి నడవనున్న స్పెషల్ బస్సులు. * మహబూబాబాద్ వీడియో జర్నలిస్ట్ కొడుకు కిడ్నాప్. రూ.45 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న కిడ్నాపర్లు. పోలీసులకు ఫిర్యాదు చేసిన జర్నలిస్ట్. * ఏపీకి భారీ వర్షసూచన. నేడు కృష్ణా, గుంటూరు, తూ.గో., ప.గో జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం.

భారీ వర్షాలు, వరదలు.. ఆదుకోండి.. అమిత్ షాకు వైఎస్ జగన్ లేఖ

18-10-202018-10-2020 13:16:06 IST
2020-10-18T07:46:06.918Z18-10-2020 2020-10-18T07:46:02.947Z - - 21-10-2020

భారీ వర్షాలు, వరదలు.. ఆదుకోండి.. అమిత్ షాకు వైఎస్ జగన్ లేఖ
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఇప్పటికే కోవిడ్-19తో ఆదాయపరంగా తీవ్రంగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు భారీ వర్షాలతో విలవిల్లాడుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా భారీ వర్షాలు వరదలలో చిక్కుకున్న ఆంద్రప్రదేశ్  రాష్ట్రంలో జన జీవితం అస్తవ్యస్తమైందని, తీవ్రంగా నష్టపోయిన రాష్ట్రాన్ని వెంటనే ఆదుకోవాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాన్ని ఆదుకునేందుకు రూ.2,250 కోట్ల ఆర్థిక సహాయం చేయాలన్నారు. పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు చేపట్టి, తిరిగి సాధారణ పరిస్థితికి తీసుకు రావడం కోసం తక్షణమే ముందస్తుగా కనీసం రూ.1,000 కోట్లు మంజూరు చేయాలని కోరారు. 

రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు, నష్టం గురించి వివరిస్తూ శనివారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు లేఖ రాశారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్ర బృందాన్ని పంపాలని విజ్ఞప్తి చేశారు. లేఖలోని వివరాలు..

బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయు గుండం కారణంగా రాష్ట్రంలో ఈ నెల 9 నుంచి 13వ తేదీ వరకు భారీ వర్షాలు కురిశాయి. ఒక్క 13వ తేదీనే తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరంలో అత్యధికంగా 265.10 మి.మీ వర్షపాతం నమోదైంది. అదే జిల్లాలోని కాట్రేనికోనలో 228.20 మి.మీ, తాళ్లరేవులో 200.50 మి.మీ, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో 205.30 మి.మీ, పేరవల్లిలో 204.02 మి.మీ వర్షం కురిసింది.

ఎగువన తెలంగాణ, మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురవడంతో కృష్ణా నదికి వరద పోటెత్తింది. దీంతో విజయవాడలోని ప్రకాశం బ్యారేజీతో సహా, పలు చోట్ల మూడు రోజులుగా తీవ్ర ప్రమాద హెచ్చరికలు జారీ చేశాం. లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు (సహాయ శిబిరాలకు) తరలించాం. భారీ వర్షాలు, వరదలతో జన జీవితం అస్తవ్యస్తమైంది. ఆగస్టు, సెప్టెంబర్‌లో భారీ వర్షాలు కురవడానికి తోడు ఇప్పుడు సంభవించిన వరదలతో నష్టం మరింత పెరిగింది.

వరుసగా కురిసిన వర్షాలు రాష్ట్రంలో రహదారులను తీవ్రంగా దెబ్బతీశాయి. పలు చోట్ల చెరువులు, కాల్వలకు గండ్లు పడ్డాయి. విద్యుత్‌ రంగంపై కూడా ప్రభావం పడింది. ఎక్కడికక్కడ వాగులు ఉప్పొంగడంతో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఈ వర్షాల వల్ల రైతులు చాలా నష్టపోయారు. చేతికొచ్చే దశలో ఉన్న వరి, పత్తి, మొక్కజొన్న, చెరకు పంటలు.. కూరగాయలు, అరటి, బొప్పాయి తోటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 

వరద సహాయ కార్యక్రమాల్లో ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నిర్విరామంగా పని చేసినప్పటికీ 14 మంది చనిపోయారు. ఈ పరిస్థితిలో రాష్ట్రానికి మీ చేయూత ఎంతో అవసరం. వివిధ శాఖల ప్రాథమిక అంచనాల మేరకు దాదాపు రూ.4,450 కోట్ల మేర నష్టం వాటిల్లింది. ఇప్పటికే  కోవిడ్‌–19 వల్ల ఆర్థికంగా నష్టపోయి ఉన్నాం. ఇప్పుడు ఈ వర్షాలు, వరదలు పరిస్థితిని మరింత దారుణంగా మార్చాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు మీ అండ, చేయూత ఎంతో అవసరం అని ఏపీ సీఎం వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రిని అభ్యర్థిస్తూ లేఖ రాశారు.

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

ఏపీలో స్కూల్స్ ఓపెన్.. ఏర్పాట్ల‌లో స‌ర్కార్

   7 hours ago


గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

గతపాలకులదే పాపమంటే ప్రజలు ఊరుకుంటారా!

   7 hours ago


కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

కమ్మేస్తోంది.. కుమ్మేస్తోంది.. మళ్లీ వర్షంతో వణుకుతున్న హైదరాబాద్

   10 hours ago


విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

విడ‌ద‌ల ర‌జ‌నీకి మంత్రి ప‌ద‌వి ఫిక్సా..?

   10 hours ago


అన్ని పరీక్షలు వాయిదా..!

అన్ని పరీక్షలు వాయిదా..!

   11 hours ago


తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

తెలంగాణా సీఎం రిలీఫ్ ఫండ్ కి టాలీవుడ్ స్టార్స్ విరాళాలు

   12 hours ago


లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

లక్షాధిపతులను బిక్షాధిపతులను ఏకం చేసిన వరద

   12 hours ago


కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

కాళేశ్వరం ప్రాజెక్టు అనుమతుల విషయంలో ఉల్లంఘనలు జరిగాయి: ఎన్జీటీ

   12 hours ago


లంకాదినకర్ సస్పెన్షన్ తో బీజేపీ ఇస్తున్న సంకేతాలేంటి..?

లంకాదినకర్ సస్పెన్షన్ తో బీజేపీ ఇస్తున్న సంకేతాలేంటి..?

   12 hours ago


విజయ్‌ సేతుపతి కుమార్తెనూ రేప్ చేస్తారంట.. మండిపడ్డ కనిమొళి

విజయ్‌ సేతుపతి కుమార్తెనూ రేప్ చేస్తారంట.. మండిపడ్డ కనిమొళి

   12 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle