newssting
Radio
BITING NEWS :
భారత ప్రభుత్వం ప్రత్యర్థుల ఫోన్లపై నిఘా పెట్టడానికి ఇజ్రాయెల్‌కు చెందిన పెగసస్‌ స్‌పైవేర్‌ను ఉపయోగిస్తోందంటూ వెలువడ్డ వార్తలపై పాకిస్తాన్‌ ప్రభుత్వం తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్తాన్‌ ప్రధానమంత్రి ఇమ్రాన్‌ ఖాన్‌తోపాటు పలువురు విదేశీ ప్రముఖులు పేర్లు ఈ జాబితాలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయని గుర్తుచేసింది. ఈ వ్యవహారంలో ఐక్యరాజ్య సమితి వెంటనే జోక్యం చేసుకోవాలని, సమగ్ర దర్యాప్తు జరిపించాలని కోరింది. * ప్రతిపక్ష నేతల ఫోన్లను హ్యాకింగ్‌ చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కొనసాగిస్తున్న ఆరోపణల పరంపరంపై బీజేపీ అధికార ప్రతినిధి రాజ్యవర్దన్‌ రాథోడ్‌ ఘాటుగా స్పందించారు. ఫోన్‌ నిజంగా హ్యాకింగ్‌ అయ్యిందని రాహుల్‌ గాంధీ భావిస్తే దర్యాప్తు కోసం అదే ఫోన్‌ను సమర్పించే దమ్ముందా? అని సవాలు విసిరారు. * కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత సమర్థవంతంగా పని చేసిందని రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ పేర్కొన్నారు. యుద్ద ప్రాతిపదికన ఆస్పత్రుల్లో పడకలు, మందులు, ఆక్సిజన్‌ నిల్వలు ఇతర మౌలిక సదుపాయాలను పెంపొందించిందని చెప్పారు. రాష్ట్ర గవర్నర్‌గా రెండేళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. * రాష్ట్రంలో వరద ముంపునకు గురైన వారిని ఆదుకోవాలని ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసై టీ (ఐఆర్‌సీఎస్‌) ప్రతి నిధులను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ కోరారు. రాజ్‌భవన్‌ అధికారులు కూడా ప్రభుత్వ అధికారులతో సమన్వయం చేసుకుని రెడ్‌క్రాస్‌ సొసైటీ ద్వారా బాధితులకు సాయం అందేలా కృషి చేయాలని ఆమె ఆదేశించారు. * కంగ్రాట్స్, నారప్ప చిత్రాన్ని ఇప్పుడే చూశా. నటన పరంగా ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసినట్టుంది. సినిమా చూస్తున్నంత సేపు ఎక్కడా వెంకటేష్ కనబడలేదు, నారప్పే కనిపించాడు. మొత్తానికి ఈ చిత్రంలో కొత్త వెంకటేష్ను చూపించావు. పాత్రను ఎంతగానో అర్థం చేసుకొన్నావ్‌, అందుకే అంతగా ఆ రోల్‌లో లీనమై నటించావు. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపన తో, తాపత్రయం తో ఉంటాడు. అలాంటి వాటికి ఈ చిత్రం మంచి ఉదాహరణ అని మెగాస్టార్‌ తెలిపారు.

వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని సూచించిన వైఎస్ జగన్

10-05-202110-05-2021 17:27:02 IST
Updated On 10-05-2021 14:56:20 ISTUpdated On 10-05-20212021-05-10T11:57:02.366Z10-05-2021 2021-05-10T09:23:31.174Z - 2021-05-10T09:26:20.992Z - 10-05-2021

వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్లకు వెళ్లాలని సూచించిన వైఎస్ జగన్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏపీలో కరోనా కట్టడి విషయమై సమీక్ష అందించారు. కొవిడ్ ప్రత్యేక అధికారులు, టాస్క్ ఫోర్స్ తో సీఎం జగన్ ప్రత్యేక సమీక్ష చేపట్టారు. 104 వ్యవస్థ మరింత బలోపేతం కావాలని.. అధికారులు నిత్యం మాక్ కాల్స్ చేస్తూ 104 వ్యవస్థ పనితీరును పర్యవేక్షిస్తుండాలని అన్నారు. 104కు కాల్ చేస్తే వెంటనే స్పందించాలని, బెడ్ అవసరం లేదంటే కొవిడ్ కేర్ సెంటర్లకు పంపించాలని వివరించారు. కరోనా బాధితుల నుంచి 104కు కాల్ వస్తే, వారికి కచ్చితంగా సాయం అందాలని సీఎం జగన్ స్పష్టం చేశారు.

కరోనా రోగుల రద్దీ ఎక్కువగా ఉన్న జిల్లాల్లో బెడ్ల సంఖ్యను బాగా పెంచాలని సూచించారు. ప్రతి ఆసుపత్రిలోనూ ఆరోగ్యమిత్ర ఉండాలని.. వ్యాక్సినేషన్ అనేది కేంద్ర ప్రభుత్వ నియంత్రణలో ఉందని అన్నారు. కేంద్రం నిర్ణయించిన కోటా మేరకే కొనుగోలు చేయాల్సి ఉంటుందని అన్నారు. వ్యాక్సిన్ల ఉత్పత్తి, లభ్యత రాష్ట్ర పరిధిలోనివి కావని అందరికీ తెలుసని.. అన్నీ తెలిసి కూడా కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి నెలకు 19 లక్షల డోసులే వస్తున్నాయని, వ్యాక్సిన్ల కొనుగోలుపై గ్లోబల్ టెండర్లకు వెళ్లడంపై ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సీఎం జగన్ అధికారులకు సూచించారు.

వ్యాక్సిన్ కేంద్రాల వద్ద రద్దీ, తోపులాట కనిపించకూడదని ఆదేశించారు. వ్యాక్సిన్లు ఎవరికి వేస్తారనేది ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు చెప్పాలని అన్నారు. 45 ఏళ్లు దాటిన వారికి రెండో డోస్ అందేలా చూడాలని.. పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లు వేగంగా ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, కోవిడ్‌ కేర్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

09-05-2021న ఆంధ్రప్రదేశ్ అధికారులు వెల్లడించిన కరోనా వివరాల ప్రకారం.. ఏపీలో గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 92 మంది కరోనాతో మరణించారు. అత్యధికంగా గుంటూరు జిల్లాలో 12 మంది, విజయనగరం జిల్లాలో 11 మంది, విశాఖ జిల్లాలో 10 మంది మృతి చెందారు. ఇతర జిల్లాల్లోనూ కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లో కరోనాతో మరణించిన వారి సంఖ్య 8,707కి పెరిగింది. అదే సమయంలో 1,05,494 కరోనా పరీక్షలు నిర్వహించగా 22,164 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 2,844 కేసులు నమోదయ్యాయి. 18,832 మంది కోలుకున్నారు. ఏపీలో ఇప్పటివరకు 12,87,603 పాజిటివ్ కేసులు నమోదు కాగా 10,88,264 మంది ఆరోగ్యవంతులయ్యారు.

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

ఏలూరులో 50 డివిజన్లలో 47 డివిజన్లు గెలిచి కార్పొరేషన్‌ సొంతం చేసుకున్న వైసీపీ

   2 hours ago


కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

కర్ణాటక తరువాత ముఖ్యమంత్రి ఎవరు..?

   9 hours ago


మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

మాజీ టీడీపీ నేతలపై దృష్టి సారించిన రేవంత్ రెడ్డి

   9 hours ago


ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

ఏపీ లో మళ్ళీ పదవుల పండుగ

   10 hours ago


టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

టీఆర్‌ఎస్‌ ఎంపీ మాలోత్ కవితకు ఆరు నెలల జైలు శిక్ష

   a day ago


వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకానంద హత్య కేసులో మరో ట్విస్ట్.. అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టులో పిటిషన్

   24-07-2021


మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

మంత్రి కేటిఆర్ కి పుట్టినరోజు శుభాకాంక్షల వెల్లువ

   24-07-2021


కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

కోట్లాది మంది దళిత బిడ్డలకు అండగా నేనుంటా..

   24-07-2021


ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

ఎస్సీ కార్పోరేషన్ చైర్మన్ గా ఈటల ప్రధాన అనుచరుడు

   24-07-2021


AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

AP Inter Second Year Results 2021: ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ

   23-07-2021


ఇంకా

Newssting User


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle