newssting
Radio
BITING NEWS :
కరోనా సంక్షోభ తరుణంలోనూ వైద్యరంగంలో విశేష సేవలందిస్తున్న సంస్థలు, వైద్యులను ప్రముఖ మార్కెట్‌ రిసెర్చ్‌ కంపెనీ ‘టాప్‌ గ్యాలెంట్‌ మీడియా’ అవార్డులతో సత్కరించనుంది. ఈ సంవత్సరానికి(2020)గానూ సర్జికల్‌ అంకాలజీలో అత్యంత విశ్వసనీయ ఆస్పత్రిగా హైదరాబాద్‌లోని బసవతారకం ఇండో అమెరికన్‌ కేన్సర్‌ ఆస్పత్రిని ఎంపిక చేయడం విశేషం * సుక్మా జిల్లాలోని టల్మెటాలా ప్రాంతంలో సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు మళ్లీ రెచ్చిపోయారు. ఐఈడీ బ్లాస్ట్‌లతో విరుచుకుపడ్డారు. ఈ దాడి శనివారం అర్థరాత్రి జరిగింది. ఈ దాడిలో సీఆర్పీఎఫ్‌ కోబ్రాకి చెందిన ఎనిమిది మంది జవాన్లు గాయపడగా ఓ సీఆర్పీఎఫ్ అధికారి ప్రాణాలను కోల్పోయారు * కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశరాజధాని ఢిల్లీలో భారీఎత్తున రైతులు నిరసనలు కొనసాగిస్తున్నారు. బురారి ప్రాంతంలోని నిరంకార్‌ మైదానంలో నిరసనకు పోలీసులు అనుమతిచ్చిన నేపథ్యంలో వేలమంది రైతులు నిరసన స్థలికి చేరుకుని కేంద్రంపై నిరసన వ్యక్తం చేశారు * పెట్రో ధరలు భగ్గుమంటున్నాయి. తొమ్మిది రోజులుగా చమురు ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఈనెల 19 నుంచి శనివారం వరకు (25వ తేదీ మినహా) ధరలు పెరుగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి కూడా మరోసారి ధరలు పెరిగాయి. గడిచిన పది రోజుల్లో పెట్రోల్‌పై లీటర్‌కు రూ.1.28, డీజిల్‌ రూ.2.09 చొప్పున పెరిగింది * బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆదివారం జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు ఆయన ప్రత్యేక విమానంలో బేగంపేటకు చేరుకుని.. 10:45 గంటలకు భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికి చేరుకుని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తారు * రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రత భారీగా పడిపోయింది. మెదక్‌లో అతితక్కువగా 14.8 డిగ్రీలు, హైదరాబాద్‌లో 17డిగ్రీల కనిష్ఠ ఉష్ణో గ్రత నమోదైంది. గాలిలో తేమ శాతం పెరిగింది * బంగాళాఖాతంలో మరో అల్పపీడన ద్రోణి బయలుదేరింది. ఇది తుపాన్‌గా మారే అవకాశాలు ఉండడంతో దీనికి బురేవి అని నామకరణం చేయడానికి సిద్ధమయ్యారు. ఈ ప్రభావంతో ఆదివారం నుంచి సముద్ర తీరాల్లో వర్షాలు పడ నున్నాయి. ఒకటో తేదీ నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ కేంద్రం ప్రకటించింది * జాతీయ ప్రవేశ పరీక్షలు... నీట్‌, జేఈఈ మెయిన్‌, అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రతిభా సామర్థ్యాలను పరీక్షించుకునేందుకు ‘కోటా’ ఆన్‌లైన్‌ ప్రాక్టీస్‌ టెస్ట్‌ సిరీస్‌ సిద్ధం చేసినట్లు ఐఐటీ, జేఈఈ ఫోరమ్‌ కన్వీనర్‌ లలిత్‌ కుమార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు www.iitjeeforum.com వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావొచ్చన్నారు * వైకుంఠ ఏకాదశి, ద్వాదశి సందర్భంగా భక్తులకు పదిరోజుల పాటు వైకుంఠ ద్వార ప్రవేశాన్ని కల్పించనున్నట్టు టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. డిసెంబరు 25నుంచి పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు తెరిచే ఉంచాలని నిర్ణయించినట్టు వివరించారు.

ఏపీ ప్రజలకు గవర్నర్, సీఎం దీపావళి శుభాకాంక్షలు

14-11-202014-11-2020 08:20:48 IST
2020-11-14T02:50:48.056Z14-11-2020 2020-11-14T02:50:23.280Z - - 30-11-2020

ఏపీ ప్రజలకు గవర్నర్, సీఎం దీపావళి శుభాకాంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
దీపావళి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు గవర్నర్ హరిచందన్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ‘దీపావళి యొక్క దైవిక కాంతి అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని అందిస్తుంది. దీపావళి చెడుపై మంచి సాధించే విజయాన్ని సూచిస్తుంది. కరోనా లాంటి విపత్తులను జయించటానికి, శాంతి, స్నేహం, మత సామరస్యాన్ని నింపిన సమాజాన్ని నిర్మించడానికి కృషి చేయాలి. ప్రతీ ఒక్కరూ కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త తీసుకోవాలి’ అని గవర్నర్‌ ఆకాంక్షించారు.

చిన్నారులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వారే రేపటి భావి భారత పౌరులని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు. నేడు బాలల దినోత్సవం సందర్భంగా ఏపీ గవర్నర్‌ బిశ్వభూషన్‌ హరిచందన్‌ శుక్రవారం రాజ్‌ భవన్‌ నుంచి సందేశం ఇచ్చారు. నవంబర్‌ 14న పండిట్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ జన్మదినం కూడా, ఈ రోజున ప్రతి ఏడాది బాలల దినోత్సవంగా జరుపుకుంటామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పిల్లలందరికి ఆయన హృదయపూర్వక శుభకాంక్షలు తెలిపారు. 

చిన్నారులు దేశం యొక్క నిజమైన బలమని, మనం జీవించే సమాజానికి పునాది అని పేర్కొన్నారు. చిన్నారులపైనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని, వారే రేపటి భావి భారత పౌరులన్నారు. మాతృభూమిని రక్షించడం, దేశానికి ఉజ్వలమైన భవిష్యత్తును నిర్మించడం భావి భారత పౌరులుగా వారి బాధ్యత అని గవర్నర్‌ వ్యాఖ్యానించారు.

ప్రజల జీవితాల్లో దీపావళి కోటి కాంతులు నింపాలి.. సీఎం జగన్

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలందరికీ, అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి‌ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి ప్రజల జీవితాల్లో కోటి కాంతులు నింపాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. చీకటి మీద వెలుగు, చెడు మీద మంచి, దుష్టశక్తుల మీద దైవశక్తి సాధించిన విజయానికి దీపావళి ప్రతీక అని సీఎం జగన్‌ పేర్కొన్నారు. 

ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు కలగాలని, ప్రతి ఇంటా కోటి ఆనందాల దీపాలు వెలగాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.

ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా అబ్బాబ్బాబ్బా

ఈ బక్క కేసీఆర్‌ను కొట్టడానికి గింత మందా అబ్బాబ్బాబ్బా

   6 hours ago


అమిత్ షా చెప్పినట్లుగా అసదుద్దీన్ రాసివ్వగలడా

అమిత్ షా చెప్పినట్లుగా అసదుద్దీన్ రాసివ్వగలడా

   8 hours ago


ఏం జరుగుతోంది.. కేసీఆర్ సభలో హరీష్ మాయం!

ఏం జరుగుతోంది.. కేసీఆర్ సభలో హరీష్ మాయం!

   10 hours ago


కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

కూసాలు కదులుతున్నాయ్.. ఓటుకు నోటుపై విజయసాయి సంచలన వ్యాఖ్యలు!

   13 hours ago


డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

డైరెక్ట్ గా భాగ్యలక్ష్మి ఆలయానికే..!

   13 hours ago


పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

పేర్ని నానిపై హత్యాయత్నం.. ఎందుకు దాడి చేశాడో తెలియదు

   14 hours ago


తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

తేనెతుట్టెని కెలికి నెత్తిన పెట్టుకున్న విజయసాయి!

   16 hours ago


మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

మేమూ నచ్చకపోతే నోటాకు వెయ్యండి. ఓటు మాత్రం వేయండి.. కేటీఆర్

   17 hours ago


బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

బీహార్ను గుర్తుకు తెచ్చేలా ఎమ్మెల్యే వ్యవహారం.. అధికారిపై దుర్బాష ఫోన్ కాల్ !

   18 hours ago


ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

ఆర్థిక పర్యాటక రంగాల్లో ఏపీ ప్రగతి అద్బుతం.. ఇండియా టుడే సర్వే

   18 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle