అంబటి రాంబాబు కొత్త రాగం.. సెంటిమెంట్ తో ఆయింట్ మెంట్
23-01-202123-01-2021 18:38:05 IST
Updated On 23-01-2021 16:25:37 ISTUpdated On 23-01-20212021-01-23T13:08:05.432Z23-01-2021 2021-01-23T10:36:03.854Z - 2021-01-23T10:55:37.399Z - 23-01-2021

ఏ ఎండకి ఆ గొడుగు పట్టాలి అంటారు. పొలిటికల్ లీడర్లు ఈ విషయంలో ఎక్కడా తగ్గరు. ఇప్పుడు వైసీపీ లీడర్ అంబటి రాంబాబు కూడా అదే ప్రూవ్ చేస్తున్నారు అనే విషయం జనంలోకి ఫుల్ గా వెళ్లింది. అసలు అంబటి రాంబాబు పాడుతున్న పాట ఏంటి.. కొత్తగా అందుకున్న రాగం ఏంటి అంటే.. ఓ ఫోటో.. ఓ ప్రెస్ మీట్ అంతే. ఎస్ఈసీ నిమ్మగడ్డపై ఫైటింగ్ కి దారులన్నీ క్లోజ్ అయ్యాయి. ఎన్నికలకి వెళ్లక తప్పని పరిస్థితి క్రియేట్ అయింది. ఫైనల్ గా సుప్రీం కోర్టు ఏం చెప్పబోతుంది అసలు సుప్రీం ఈ విషయాన్ని పట్టించుకుంటుందా.. నో ప్రాబ్లమ్ అంటుందా అన్నది ఇంపార్టెంట్ విషయమే. అది అలా వదిలేస్తే.. అంబటి రాంబాబు ఓ ఫోటో పట్టుకున్నారు. అదేంటయ్యా అంటే.. ఎస్ఈసీ రమేశ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గ్లాస్ ప్రొటెక్షన్ లో ఉన్నారు. కరోనా టైం కదా.. గ్లాస్ సెటప్ ఉంది. ఆయన కూడా కేర్ తీసుకుంటారు కదా.. సో అదే జరిగింది. ఇప్పుడు ఆ ఫోటోతో రాజకీయం చేస్తూ.. సెంటిమెంట్ పండించాలని చూస్తున్నారు వైసీపీ లీడర్లు. అంబటి రాంబాబు కూడా అదే ఫాలో అవుతున్నారు. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కి అయితే.. కరోనా అంటే భయం. ప్రెస్ మీట్ కి వచ్చినప్పుడు గ్లాస్ ప్రొటెక్షన్ లో ఉన్నారు. మరి జనాలకి భయం ఉండదా.. జనం ప్రాణాలు ప్రాణాలే కావా అనేది అక్కడ ఇంటెన్షన్. అయితే.. జనం అంతలా భయపడుతున్నారా. పార్టీ మీటింగులు.. సభలకే వేలు లక్షల్లో వెళ్తున్నారు. ఓ పక్క రైతు ఉద్యమంలో రైతులు ఎక్కడా తగ్గడం లేదు. జనం రెగ్యులర్ గా కూడా కరోనాని పట్టించుకోవడం లేదు. మరి జనంలో భయం ఎక్కడుంది. ఉద్యోగులు కూడా ఎక్కడా కరోనా ప్రొటెక్షన్ తీసుకుని మూవ్ అవుతున్న దాఖలాలు లేవు. సో.. ఉద్యోగుల్లో కూడా భయాలు లేవనే విషయం క్లియర్ గా ఉంది. మరి అలాంటప్పుడు ఓటేయడానికి జనాలకి భయం లేనప్పుడు ఈ సెంటిమెంట్ లు.. సెంటిమెంట్ తో సిచ్చువేషన్ కి ఆయింట్ మెంట్ పూయాలని చేసే ప్రయత్నాలు వర్కవుట్ అవుతాయా అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. బట్.. ఇది కూడా ఓ రీజనే కదా. చెప్పుకోవడానికి ఓ ఫోటో దొరికింది కదా అంటే మాత్రం ఎవ్వరూ ఏం చెప్పలేరు. జస్ట్ నవ్వేసి ఊరుకుంటారు.. సాల్ సాల్లేండి సార్.. జనంలో కరోనా భయం ఎక్కడుంది. మీకు మాత్రం ఉందా అని.. జనాలే ప్రశ్నిస్తారు. కానీ.. వాళ్ల ప్రయత్నాలేవో వాళ్లు చేస్తున్నారు. సింపతీ వర్కవుట్ అవుతుందని ఏమైనా ట్రై చేస్తున్నారో ఏమో అంటూ.. అరుగుల మీద కూర్చున్న పొలిటికల్ అనలిస్టులు.. ఊళ్లల్లో ఫుల్లుగా వాదించుకుంటున్నారు. డిస్కషన్లలో మునిగిపోయారు. నేడు ఎన్నికల షెడ్యూల్.. రమేష్ కుమార్ మీడియా సమావేశం..

కాంగ్రెస్లో ఉండి ఉంటే సింధియానే సీఎం... రాహుల్
2 hours ago

బీజేపీలోకి కాంగ్రెస్ సీనియర్ లీడర్.. భార్య ఒత్తిడే కారణమా
2 hours ago

విశాఖ ఉక్కు 100 శాతం ప్రైవేటుకే.. ఏపీ సర్కార్ కు ముందే తెలుసు
3 hours ago

నోటికొచ్చినట్లు మాట్లాడితే తాటతీస్తాం.. బీజేపీపై మండిపడ్డ కేటీఆర్
18 hours ago

కేతిరెడ్డిపై ఫైర్ అయిన పరిటాల శ్రీరామ్..!
20 hours ago

కాంగ్రెస్ వామపక్షాల మధ్య పొత్తా, శత్రుత్వమా.. డైలమ్మాలో కార్యకర్తలు
21 hours ago

వైసీపీ రౌడీయిజానికి బ్రేకులేస్తాం
a day ago

ఇదేం అన్యాయం.. హర్ట్ అయిన విడదల రజనీ ఫ్యాన్స్
a day ago

దేశ వ్యాప్తంగా ఆ నియోజక వర్గం గెలుపు పై ఫోకస్
11 hours ago

రాంజీ మృతి పట్ల తెలుగుదేశం పార్టీ నాయకుల దిగ్భ్రాంతి
a day ago
ఇంకా