newssting
Radio
BITING NEWS :
అమెరికాలోని కుంబా ప్రాంతంలో తుపాకులతో దాడులు. పాఠశాలపై దాడులకు పాల్పడిన దుండగులు. 8 మంది చిన్నారులు దుర్మరణం. ఇంతవరకూ దాడికి గల కారణాలపై నో క్లారిటీ. వేర్పాటువాదుల పనైఉంటుందని అనుమానిస్తున్న పోలీసులు. * ఇంద్రకీలాద్రిపై ఘనంగా దసరా ఉత్సవాలు. ఆఖరిరోజు శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్న దుర్గమ్మవారు. అమ్మవారి దర్శనం కోసం బారులు తీరిన భక్తులు. * దుర్గమ్మను దర్శించుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. దసరా సందర్భంగా విజయవాడలో బీజేపీ కార్యాలయాన్ని ప్రారంభించిన కిషన్ రెడ్డి. రాష్ట్రంలో బీజేపీ బలపడుతుందన్న కేంద్ర మంత్రి. * రానున్న 4 రోజుల్లో ఏపీకి భారీ వర్షాలు. * సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఆలయం వద్ద పేలుడు. ఆలయం సమీపంలోని చెత్తకుప్పలో పేలిన పెయింట్ డబ్బా, వ్యక్తికి గాయాలు. * వనపర్తి జిల్లా గోపాల్ పేట మండలం బుద్దారం గ్రామంలో విషాదం. భారీ వర్షాలకు నానిపోయిన ఇంటి పై కప్పు కూలి ఐదుగురు దుర్మరణం, ఇద్దరికి తీవ్రగాయాలు. * తెలంగాణ రాష్ట్ర ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్.

అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?

27-09-202027-09-2020 13:58:22 IST
Updated On 27-09-2020 18:06:22 ISTUpdated On 27-09-20202020-09-27T08:28:22.606Z27-09-2020 2020-09-27T08:28:17.159Z - 2020-09-27T12:36:22.770Z - 27-09-2020

అంబటి భూకబ్జా లీకులు.. సొంత పార్టీ నేతలే టార్గెట్ చేశారా?
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీ అధికార పార్టీ నేతలలో వివాదాస్పద నేతలు ఎవరంటే చాంతాండంత లిస్ట్ ఉంటుంది. వైసీపీలో సౌమ్యులుగా ఉండే నేతలు తక్కువ కాగా వివాదాస్పద వ్యాఖ్యలు, విమర్శలతో ఎప్పటికప్పుడు వార్తలలో నిలిచే వెళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వారిలో అంబటి రాంబాబు స్టైల్ వేరుగా ఉంటుంది. ప్రత్యర్థిపై అభూత కల్పనలతో కూడిన విమర్శలను సైతం గోడకట్టినట్లుగా సక్కగా విమర్శించడంలో ఈయన దిట్ట. ప్రతిపక్షాలు విమర్శలు చేసిన ప్రతిసారి మీడియా సమావేశం పెట్టి దానికి రాజకీయ కారణాలను పూసగుచ్చినట్లు ప్రజలకు చెప్పేందుకు ప్రయత్నించి అధిష్టానం వద్ద మార్కులు కొట్టేయాలని అంబటి చేయని ప్రయత్నం లేదు.

ఏదో ఒక విధంగా ఈసారి క్యాబినెట్ లో చోటు దక్కించుకోవాలని అంబటి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకే విషయం ఏదైనా అయన మాత్రం సీఎం జగన్ మీద మాట పడకుండా ఎదురుదాడికి దిగుతుంటారు. అయితే, ఇప్పుడు సమస్య వచ్చిందల్లా సొంత పార్టీ నేతల నుండే అని ఒక రాజకీయ చర్చ జరుగుతుంది. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్ ను రెండున్నరేళ్ల తరువాత మార్చేసి కొత్త మంత్రులు పాలిస్తారని సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన సమయంలో చెప్పిన మాట అందరికీ గుర్తుండే ఉంటుంది కదా.

సరిగ్గా ఇప్పుడు ఆ రెండున్నరేళ్ల సమయంలో దగ్గరకు వస్తుంది. అందుకే ఇప్పుడు నేతలంతా సీఎం దృష్టిలో పడే క్రమంలో ప్రతిపక్షాలపై మాటల దాడి చేయడమే పనిగా పెట్టుకున్నారు. అందులో అంబటి కూడా ఉండగా అంబటిపై సొంత పార్టీ నేతలు గోతులు తవ్వుతున్నట్లుగా వినిపిస్తుంది. ముఖ్యంగా అంబటి ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలో రెడ్డి సామజిక వర్గం నేతలు కొందరు పనిగట్టుకొని అంబటికి బ్యాడ్ నేమ్ తెచ్చే పనికి కంకణం కట్టుకున్నట్లుగా స్వయంగా అంబటి వర్గం నేతలే చెప్తున్నారు.

అంబటి రాంబాబుపై ఈ మధ్య కాలంలో అక్రమాల ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అంబటి మైనింగ్ అక్రమాలకు పాల్పడుతున్నారంటూ ఇప్పటికే సొంత పార్టీ కార్యకర్తలే హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అదలా ఉండగానే అంబటికి అత్యంత సన్నిహితులైన ఇద్దరు నేతలు రెండు భూములను కబ్జా చేసారంటూ వైసీపీ నేతల నుంచే మీడియాకు లీకులు అందాయి. అందుకు తగిన బెదిరింపుల ఆడియోలు కూడా మీడియాకి పంపారు. దీంతో అధికారులు విచారణకు కూడా ఆదేశించి భూములను కూడా పరిశీలించడంతో అవకతవకలు జరిగాయని ప్రాథమికంగా నిర్ధారనైంది.

అయితే, అసలు అంబటిపై సొంత పార్టీ నేతలు ఇంతా జుస్సా ఎందుకంటే వెనుక పెద్ద కథే ఉంది. నిజానికి ఇప్పుడు పాగా వేసిన సత్తెనపల్లితో అంబటి సంబంధం లేదు. ఆయనది రేపల్లె. తన సామాజికవర్గం అధికంగా ఉండడంతో సత్తెనపల్లి వేదికగా రాజకీయంగా ఎదిగారు. ఇక ఇప్పుడు అదే సామాజికవర్గం అండతో మంత్రి పదవికి పోటీపడుతున్నారు. అందుకే సత్తెనపల్లి స్థానిక నేతలకు ఇది మింగుడుపడడం లేదని తెలుస్తుంది. పైగా అంబటి సామజిక వర్గంతో పాటు రెడ్డి సామజిక వర్గంలో అక్కడ బలమైన నాయకులు ఉండడం ఇప్పుడు పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి. దీంతో ఇప్పుడు అంబటికి ఇబ్బందులు తప్పడం లేదు. మరి ఈ ఇబ్బందులను అధిగమించి మంత్రి పదవి దక్కించుకుంటారా? అసలు ఆ జగనుడు అంబటిపై కరుణిస్తారా అన్నది చూడాల్సిందే!

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

మంట‌లు రేపుతున్న మహారాష్ట్ర సీఎం

   2 hours ago


ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

ఏపీ పట్ల ఏకపక్ష ధోరణితో వ్యవహరిస్తున్న తెలంగాణ

   3 hours ago


పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

పోలవరం పూర్తి ఖర్చు భరిస్తామన్నారు. మాట తప్పితే ఎలా? కేంద్రం పై జగన్ ఫైర్

   3 hours ago


టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

టీఆర్‌ఎస్‌ను ఒక్కసారి ఓడించండి.. కేసీఆర్‌కు హామీలన్నీ గుర్తొస్తాయి... ఉత్తమ్

   18 hours ago


వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

వెలవెలబోతున్న కోవిడ్ ఆసుపత్రులు.. 80 శాతం పడకలు ఖాళీ

   18 hours ago


దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

దుబ్బాక‌లోనే అస‌లు ద‌స‌రా

   21 hours ago


నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

నిమ్మ‌గ‌డ్డ‌పై మీడియా జ‌బ‌ర్ద‌స్తీ

   a day ago


సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

సికింద్రాబాద్ లో పేలుడు.. కొద్దిసేపు టెన్షన్

   a day ago


సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

సీఎం జగన్‌ సామాజిక న్యాయ సంరక్షకుడు.. పీఎంకే అధినేత రామదాస్ ప్రశంస

   25-10-2020


ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

ఏపీఎస్‌ఆర్టీసీ బస్సులు తెలంగాణ సరిహద్దుల వరకే.. పేర్ని నాని

   25-10-2020


ఇంకా

Shivakrishna D


Senior Video Editor, Shivakrishna Devasani has been working with major media houses for the last decade and half. He has been chosen as a special editor for senior journalist Satish Babu's signature program- 'Journalist Diary'. He specialises with feature programmes on current affairs and politics. Over the years, he has trained many budding video editors with many of them working now in electronic media.
 skd@rightfolio.in
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle