newssting
Radio
BITING NEWS :
విజయవాడలో కన్నకూతురిని అమ్మకానికి పెట్టిన తాగుబోతు తండ్రి. విషయం తెలిసి తండ్రిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చిన చైల్డ్ లైన్ అధికారులు. అనంతరం చిన్నారిని తల్లిదండ్రులకు అప్పగించిన పోలీసులు. * తెలుగు రాష్ట్రాల్లో రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది దుర్మరణం. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఇన్నోవా - బోర్ వెల్ లారీ ఢీ. ప్రమాదంలో ఆరుగురు మృతి, ముగ్గురికి తీవ్రగాయాలు. ప్రమాద సమయంలో ఇన్నోవాలో 11 మంది ప్రయాణికులు. మృతులంతా హైదరాబాద్ లోని తాడ్ బన్ కు చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * కర్నూల్ జిల్లా గూడూరు వద్ద బైక్ ను ఢీ కొట్టిన ట్రాక్టర్. ముగ్గురు దుర్మరణం, మృతులంతా బ్రాహ్మణదొడ్డికి చెందినవారుగా గుర్తించిన పోలీసులు. * ఖమ్మం జిల్లా కామేపల్లి వద్ద టిప్పర్ - స్కూటీ ఢీ, ఇద్దరు మృతి. * మూడోరోజు ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ సమావేశాలు. రాష్ట్రంలో ఇసుక సమస్యపై అసెంబ్లీలో టీడీపీ వాయిదా తీర్మానం.

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర

19-10-202019-10-2020 13:53:21 IST
Updated On 20-10-2020 14:09:14 ISTUpdated On 20-10-20202020-10-19T08:23:21.890Z19-10-2020 2020-10-19T08:23:18.093Z - 2020-10-20T08:39:14.488Z - 20-10-2020

అమరావతిని తప్పించిన ఎక్స్‌ప్రెస్ వే.. కేంద్రం ఆమోదముద్ర
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
ఒక రాజధాని స్థానంలో మూడు రాజధానులను ప్రకటించి అమరావతి ప్రాధాన్యతను తగ్గించడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్న ఏపీ ప్రభుత్వం తాజాగా అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు దిశా దశను మార్చేసింది. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్దేశించిన అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు నుంచి అమరావతిని తప్పించేసింది. 550 కిలోమీటర్ల పొడవైన ఈ రహదారి విస్తీర్ణాన్ని ఇప్పుడు 335 కిలోమీటర్లకే కుదించేసింది.

కేంద్రప్రభుత్వం కూడా దీనికి ఆమోదముద్ర వేయడంతో అమరావతి ఇది గాలిలో దీపంగా మారిపోయింది. గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వేలో అమరావతి, దాని పరిసర ప్రాంతాలున్న 60 కిలోమీటర్ల మేర రహదారి ప్రతిపాదనను తొలగించి.. ప్రాజెక్టును చిలుకలూరిపేటకే పరిమితం చేసింది. ఈ మేరకు తాజాగా బులెటిన్‌ను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. 25వేలకోట్ల ప్రాజెక్టు 19వేల కోట్లకు కుదించగా కేంద్రప్రభుత్వం దానికి ఆమోదముద్ర వేసింది.

వివరంగా చెప్పుకోవలసి వస్తే రాష్ట్ర విభజన అనంతరం అమరావతిని రాజధానిగా ప్రకటించాక... వెనుకబడ్డ రాయలసీమను రాజధానికి అనుసంధానించేందుకు అనంతపురం-అమరావతి గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్ వేను 2016లో ప్రతిపాదించారు. అనంతపురం, కడప, కర్నూలు, ప్రకాశం, గుంటూరు మీదుగా అమరావతికి నాలుగు, ఆరు వరుసల రహదారిని ప్రతిపాదించారు. 

మారిన ఆలోచనలకు అనుగణంగా ఇప్పుడు గ్రీన్‌ఫీల్డ్‌ ఎక్స్‌ప్రెస్‌వే చిలకలూరిపేట వరకే పరిమితమవుతుంది. అనంతపురం, అమరావతి గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌లో భాగంగా550 కి.మీ. పొడవైన రహదారిలో కొత్తగా 394.80 కి.మీ. మేర నిర్మించాల్సి ఉంది. అప్పటికే కర్నూలు, కడప జిల్లాల్లో 163 కి.మీ. మేర రహదారి నిర్మాణం జరిగింది. 

విశాఖ తీరానికి కొట్టుకొచ్చిన భారీ నౌక

రాజధానిగా అమరావతి ఎలాగూ ఉండదు కాబట్టి అనంతపూర్-అమరావతి ఎక్స్‌ప్రెస్‌వే పొడవును తగ్గించాలని ఇప్పుడు భావించారు. భూ సేకరణ వ్యయం ఎక్కువు వతోందని, దాన్ని భరించడం కష్టంగా ఉన్న కారణంగానే 59.80 కి.మీ. రోడ్డును కుదిస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

దీనివల్ల 3,700 కోట్లమేర భారం తగ్గుతోందని ప్రభుత్వం అంటోంది. 

కానీ అదే సమయంలో ఈ ప్రాజెక్టును అనంతపురం నుంచి బెంగళూరు వరకు విస్తరింపచేయాలని ప్రతిపాదించింది.  ఒకవేళ కేంద్రం ఆమోదించి ఆ విధమైన విస్తరణ కోసం భూసేకరణ చేయాల్సివస్తే ఆ భారాన్ని మోయాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే కదా! అప్పుడు మాత్రం ఈ ప్రాజెక్టు వ్యయం పెరగదా అంటే సమాధానమే లేదు. 

మొత్తం మీద ఒక ప్రభుత్వం మారి మరో ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తదనంతర పరిణామాల క్రమంలో ఒక రాజధానే ఉనికిలో లేకుండా పోతుండటం ఆ భూములిచ్చిన రైతుల దృష్టికోణంలో అత్యంత విచారకరమైన ఘటనే అవుతుంది.

 

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

పోలవరంలో అవినీతి జరిగిందన్నారు.. నిరూపించకుండా ఏడాదిన్నరగా గాడిదలు కాస్తున్నారా?

   6 hours ago


పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

పోలవరం ఎత్తుపై అసెంబ్లీ సాక్షిగా మంత్రి అనిల్ ఏమ‌న్నారంటే..?

   7 hours ago


ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

ఉచిత ఇళ్లపై వైసీపీ ప్రభుత్వం చెప్పిన లాజిక్ వింటే మైండ్ గాన్ అంతే!

   8 hours ago


పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

పోలవరం ఆపం.. 100 అడుగుల వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం..!

   8 hours ago


అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

అసెంబ్లీలో 'జయము.. జయము చంద్రన్న' వీడియో టెలీకాస్ట్.. ఒక్కొక్కరి ముఖాల్లో నవ్వులే నవ్వులు

   9 hours ago


ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

ఏపీ అసెంబ్లీకి చుట్టుకున్న కరోనా భయం

   9 hours ago


పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

పోలవరంపై అసెంబ్లీలో చర్చ.. టీడీపీ ఎమ్మెల్యేలను ఎందుకు సస్పెండ్ చేశారంటే

   9 hours ago


ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

ఏపీ సర్కార్ వద్దంటున్న ఎన్నికలు కర్ణాటకలో ప్రకటించేశారు!

   10 hours ago


వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

వెంకన్న సాక్షిగా ప్రధాని హోదా వాగ్ధానం.. అదే బీజేపీ పాలిట శాపం?!

   10 hours ago


ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

ఓటైతే వేయలే గాని.. వైన్ షాప్ ముందు క్యూలు కట్టారు!

   11 hours ago


ఇంకా

NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle