అఖిల ప్రియ.. పోలీసుల కస్టడీకి..!
11-01-202111-01-2021 18:52:52 IST
2021-01-11T13:22:52.548Z11-01-2021 2021-01-11T13:22:49.017Z - - 20-01-2021

మాజీ మంత్రి, టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియను తెలంగాణ పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. హైదరాబాదులోని చంచల్ గూడ జైలు నుంచి బేగంపేట పోలీస్ స్టేషన్ కు ఆమెను పోలీసులు తరలించారు. మూడు రోజుల పాటు ఆమెను విచారించనున్నారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్న ఆమె వేసిన బెయిల్ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. కిడ్నాప్ కేసులో విచారణ నిమిత్తం ఆమెను 7 రోజుల రిమాండ్ కు ఇవ్వాలని పోలీసులు పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను విచారించిన న్యాయస్థానం మూడు రోజు కస్టడీకి అనుమతించింది. గర్భవతినైన తనకు మెరుగైన వైద్యం కోసం తరలించాలన్న అఖిలప్రియ కోర్టును కోరగా.. జైల్లో కూడా వైద్యులు, మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నాయని కోర్టు తెలిపింది.
ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ పూర్తి వివరాలను మీడియాకు వెల్లడించారు. ఈ కేసులో భూమా అఖిలప్రియే సూత్రధారి అని.. ఇప్పటి వరకు అఖిలప్రియ, ఆమె పర్సనల్ అసిస్టెంట్ బోయ సంపత్ కుమార్, మల్లికార్జున్ రెడ్డి, డ్రైవర్ బాలా చెన్నయ్యను అరెస్ట్ చేసి వీరి నుంచి మూడు మొబైల్ ఫోన్లు, ఫేక్ నంబర్ ప్లేట్లు స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. మల్లికార్జున్ రెడ్డి ద్వారా అఖిలప్రియ 6 సిమ్ కార్డులను కొనుగోలు చేశారని.. మియాపూర్ లోని సెల్ ఫోన్ షాపులో ఈ సిమ్ కార్డులను కొనుగోలు చేశారని చెప్పారు. మల్లికార్జున్, శ్రీను పేర్ల మీద వీటిని జనవరి 2న తీసుకున్నారు. వీటిలో ఒక సిమ్ ను అఖిలప్రియ వాడగా, మరికొన్ని సిమ్ లను శ్రీను ఉపయోగించాడని పోలీసులు చెప్పారు. 6 సిమ్ కార్డుల లొకేషన్లు, టవర్లను గుర్తించామని తెలిపారు. కూకట్ పల్లిలోని లోధా అపార్ట్ మెంట్ లో అఖిలప్రియ నివాసం ఉన్నట్టు గుర్తించామని.. కిడ్నాప్ కు రెక్కీ కూడా అఖిలప్రియ ఆధ్వర్యంలోనే జరిగిందని అంజనీకుమార్ చెప్పారు. లోధా అపార్ట్ మెంట్ నుంచే దీనికి సంబంధించిన ప్లానింగ్ జరిగిందని.. కిడ్నాప్ కోసం ఒక స్కార్పియో, ఒక ఇన్నోవా, ఒక టూవీలర్ ను ఉపయోగించారని తెలిపారు. అఖిలప్రియ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ కు భార్గవ్ రామ్ కూడా సహకరించారని చెప్పారు.

జనవరి 27న శశికళ విడుదల.. పార్టీలోకి రానివ్వమన్న పళనిస్వామి
37 minutes ago

కేటీఆర్ పరిస్థితి.. రాహుల్ గాంధీలా అవుతుందా
3 hours ago

జగన్ సర్కార్ మరో డెసిషన్.. ఎందుకు తీసుకుంటారో ఏమో
an hour ago

సవాళ్లు, ప్రమాణాలు.. ఏందీ రచ్చ.. జనాల్ని ప్రశాంతంగా ఉండనివ్వరా
4 hours ago

నానీ పని అయిపాయే.. ఇక వంశీ వచ్చే
4 hours ago

ఎదురు దెబ్బలు.. మొట్టికాయలు.. ఇక మీరు మారరా.. జనాలు మారాల్సిందేనా?
5 hours ago

షాతో జగన్ భేటీ.. ఈసారి రాష్ట్రానికి ఏం తెస్తారో?!
5 hours ago

ఈ ఎమ్మెల్యేకి కొత్త తలనొప్పులు తెస్తున్న నోటితీట
6 hours ago

మితిమీరిన బూతులు.. కొడాలి నానీ రాజకీయాలకు అవసరమా?
6 hours ago

సంగారెడ్డిలో తోప్ సింగ్ కావాలని ఈ మాజీ ఎమ్మెల్యే ఆరాటం.. గ్రౌండ్ వర్క్ స్టార్ట్
6 hours ago
ఇంకా