newssting
Radio
BITING NEWS :
విశాఖ జిల్లా అనకాపల్లి ముత్రాసు కాలనీలో విషాదం. అనారోగ్యంతో భార్య చనిపోవడంతో మనస్తాపం చెంది.. ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న తండ్రి. * కడప జిల్లా ముద్దనూరు మండలం కొత్తపల్లిలో రోడ్డు ప్రమాదం. క్యాంపర్ వాహనాన్ని ఢీ కొట్టిన లారీ, ఇద్దరు మృతి. మృతులు తొండూరు మండలం మల్యాల వాసులుగా గుర్తింపు. * తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు. కొత్తగా 684 పాజిటివ్ కేసులు నమోదు, ముగ్గురు మృతి. * భద్రాచలం చెక్ పోస్ట్ వద్ద పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన గంజాయి. రూ. 30 లక్షలు విలువైన రెండు క్వింటాళ్ల గంజాయి స్వాధీనం. రెండు కార్లు సీజ్, ముగ్గురు అరెస్ట్. * గుంటూరు జిల్లా తాడేపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తరిస్తున్న డ్రగ్ కల్చర్. యూనివర్శిటీలు, కాలేజీలు టార్గెట్ గా డ్రగ్స్ అమ్మకాలు చేపట్టిన మాఫియా. గంజాయితో పాటు సింథటిక్ డ్రగ్స్ విక్రయాలు. ఎండీఎంఏ ట్యాబ్లెట్స్ ను పట్టుకున్న ఎస్ఈబీ అధికారులు. * ఈస్ట్ ఢిల్లీ రెడీమేడ్ వస్త్ర కారాగారంలో భారీ అగ్నిప్రమాదం. మంటలార్పుతున్న 15 ఫైరింజన్లు.

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్

03-03-202103-03-2021 18:31:19 IST
Updated On 04-03-2021 09:53:00 ISTUpdated On 04-03-20212021-03-03T13:01:19.734Z03-03-2021 2021-03-03T12:04:25.733Z - 2021-03-04T04:23:00.466Z - 04-03-2021

క్రమ శిక్షణ చర్యలు తప్పవంటూ అచ్చెన్నాయుడు వార్నింగ్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

ఏపీలో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ సమయం దగ్గరపడే కొద్దీ ఏకగ్రీవాల జోరు మరింత ఎక్కువవుతోంది. పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు వైసీపీలో చేరుతుండడంతో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. పార్టీకి నష్టం కలిగించేవారిపై క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ విధానాలకు విరుద్ధంగా ఎవరైనా వ్యక్తిగత ప్రకటనలు జారీ చేస్తే క్రమశిక్షణ చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. వైసీపీ దౌర్జన్యాల పట్ల టీడీపీ శ్రేణులు ప్రజాస్వామ్యయుతంగా పోటీచేయాలని అచ్చెన్నాయుడు పిలుపునిచ్చారు.

ఈ మధ్యాహ్నం 3 గంటల సమయానికి నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ట్విట్టర్ లో ఘాటు వ్యాఖ్యలు చేశారు. తిరుపతి మున్సిపాలిటీ 45వ వార్డు కోసం టీడీపీ తరఫున చంద్రమోహన్ నామినేషన్ వేశారని.. అయితే చంద్రమోహన్ అభ్యర్థిత్వాన్ని బలపర్చిన టీడీపీ నేత గొల్ల లోకేశ్ నాయుడుపై వైసీపీ రౌడీలు దాడి చేశారని ఆరోపించారు. ఆయన షాపును ధ్వంసం చేశారని.. దీనికి సంబంధించిన సీసీ టీవీ ఫుటేజిని కూడా పంచుకున్నారు. వైసీపీ దద్దమ్మల్లారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఎన్నికల్లో నిలబడి పోటీ చేసే దమ్ము లేని మీరు... ఈ భాగోతాలు బయటపడతాయనే కదా చంద్రబాబుకు భయపడి ఆయనను విమానాశ్రయంలో అడ్డుకున్నారు అంటూ విమర్శలు చేశారు. ఇన్ని దారుణాలు జరుగుతుంటే ఎన్నికల సంఘం ఏంచేస్తోంది? అని లోకేశ్ ప్రశ్నించారు.

పలు ప్రాంతాల్లో వైసీపీ ఏకగ్రీవమవుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రిలో రెండు స్థానాల్లో వైసీపీ ఏకగ్రీవాలు సాధించగా, ఎమ్మెల్యే పెద్దారెడ్డి కుమారుడు బరిలో ఉన్న వార్డులో వైసీపీకి ఏకగ్రీవం అయింది. టీడీపీ తమ నాయకులను కాపాడుకోవడం కోసం.. క్యాంపు రాజకీయాలకు తెరలేపింది. టీడీపీ అభ్యర్థులను అనంతపురంలోని జేసీ పవన్ కార్యాలయంలో ఉంచినట్టు తెలుస్తోంది. కల్యాణదుర్గం, రాయదుర్గంలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొనడంతో... టీడీపీ అభ్యర్థులను కాపాడుకునేందుకు కర్ణాటక పర్యటన ప్లాన్ చేసినట్టు సమాచారం. ధర్మవరంలో 10 వార్డుల్లో వైసీపీ ఏకగ్రీవం అయింది. ధర్మవరంలో పరిటాల శ్రీరాం పరిస్థితిని సమీక్షిస్తున్నారు. తమ అభ్యర్థులను వెంకటాపురం తరలించారు. అనంతపురంలో టీడీపీ అభ్యర్థులు అజ్ఞాతంలోకి వెళ్లారు. 

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

ఏపీ మంత్రి ట్విట్టర్ ఖాతాలో అశ్లీల ఫోటోలు.. వారి పనే

   16 hours ago


పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

పీకేకి ఏమైంది.. మ‌మ‌తాను కావాల‌నే దెబ్బ కొట్టాడా

   13 hours ago


కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

కేసీఆర్ కు సాగర్ భ‌యం.. రెండోసారీ హాలియాలో స‌భ

   15 hours ago


ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

ఆశ‌గా ఢిల్లీ వైపు చూస్తున్న బీజేపీ ఏపీ లీడ‌ర్లు

   20 hours ago


దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

దొర‌పై జెండా ఎగ‌రేద్దాం.. జూలై 8న పార్టీకి ముహూర్తం

   a day ago


ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

ఆ విషయంలో మాత్రం అభిమానులకు నిరాశనే ఎదురైందిగా..!

   a day ago


ష‌ర్మిల మాట‌ల‌తో  చాలా క్లారిటీస్

ష‌ర్మిల మాట‌ల‌తో చాలా క్లారిటీస్

   09-04-2021


ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

ఏర్పాట్లు ఐదువేల మందికి.. వ‌చ్చింది రెండువేలేనా

   09-04-2021


పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

పేర్ని నాని ప‌వ‌న్ ఫ్యానా.. వ‌కీల్ సాబ్ కి ఫుల్ ప్ర‌మోషన్

   09-04-2021


ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

ఒకటి కాదు పది నోటీసులు పంపుకోండి. నా సమాధానం ఒకటే.. ఈసీతో మమత

   09-04-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle