9 మందికి మంత్రి పదవులు.. రజనీకి స్పేస్ ..?
26-03-202126-03-2021 10:33:33 IST
Updated On 26-03-2021 10:43:24 ISTUpdated On 26-03-20212021-03-26T05:03:33.975Z26-03-2021 2021-03-26T05:01:43.005Z - 2021-03-26T05:13:24.350Z - 26-03-2021

టైం దగ్గరికి వస్తుంది. మంత్రి పదవి ఫిక్స్. ఈ జిల్లాల్లో మేమిద్దరమే టాప్ లీడర్స్ మి. ఏదో లక్కులో వారికి మంత్రి పదవి వచ్చింది. ఎలాగో.. రెండున్నరేళ్ల టైం దగ్గరికి వస్తుంది కదా. ఇక నాకు కాక ఇంకెవరికి మంత్రి పదవి ఇస్తారు చెప్పండి. బ్యానర్లు కొట్టియ్యాలి.. బోర్డులు చేయించాలి. ఏర్పాట్లు చూస్కోండి అంటూ.. కొంతమంది లీడర్లు. తమ వర్గం కార్యకర్తలకు, స్థానిక లీడర్లకు ఆదేశాలు కూడా ఇస్తున్నారు. ఎందుకంటే.. రెండున్నరేళ్ల తర్వాత 90 శాతం మంత్రుల్ని పదవి నుంచి తొలగించి.. కొత్త వారికి మంత్రి పదవులు ఇస్తారు జగన్ కదా. జనం అంతా.. లీడర్లంతా దానికోసమే కదా వెయిటింగ్. అన్ని జిల్లాల్లోనూ ఇదే కాంపిటీషన్ ఉంది. సెకండ్ ప్లేస్ లో ఉండే ఇద్దరు ముగ్గురు లీడర్లు అయితే.. నానా కష్టాలూ పడుతున్నారు. నాకే మంత్రి పదవి దక్కాలి అని ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు. కానీ.. సీఎం జగన్ మాత్రం.. 90 శాతం మందిని మంత్రి పదవుల నుంచి తొలగించి.. కొత్త వారికి ఇవ్వాలి అనే ఆప్షన్ ఉపయోగించుకోవడం లేదట. కరెక్ట్ గా 9 మందిని మార్చి.. కొత్త వారికి పదవులు ఇవ్వాలి అని చూస్తున్నారట. పాలనా పరమైన ప్రాబ్లమ్స్ వస్తయ్ అని.. పార్టీలో గ్రూపు రాజకీయాలు ఉంటాయని.. పదవుల నుంచి తొలగి పోయిన వారు పక్క చూపులు చూసే ఛాన్స్ ఉందనీ ఆలోచిస్తున్నారట. సో.. 90 శాతం మాటను పక్కన ఉంచి.. 9 మందికి ఫిక్స్ అయ్యారట. రోజా, విడదల రజనీ.. మంత్రి పదవి ఎవరికి ఇప్పుడున్న పాతిక మందిలో తొమ్మిది మంది మంత్రులు పెద్దగా పరిపాలనను పట్టించుకోవడం లేదనీ.. ప్రజల్లోకి వెళ్లడం లేదని.. స్థానిక ఎన్నికల్లో ఆ మంత్రుల ఏరియాలో పార్టీ పెద్దగా ప్రభావం చూపలేకపోయిందనీ.. సీనియర్ మంత్రులు నివేదిక ఇచ్చారట. సో.. వారిని మాత్రం సైడ్ చేస్తే.. మిగిలిన మంత్రుల్లో భయం ఉంటుందనీ.. కొత్తవారిని ఎంకరేజ్ చేసినట్లు ఉంటుందనీ అనుకుంటున్నారట. అయితే.. వీరిలో రోజా, విడదల రజీనికి మంత్రి పదవి దక్కబోతుంది అనే టాక్ నడుస్తోంది. మరి మహిళా మంత్రుల పదవుల పరిస్థితి ఏంటి అనేది కూడా సీరియస్ టాపిక్ అయింది. విడదల రజనీ, రోజాకి మంత్రి పదువులు ఇవ్వాలంటే.. ఆ పాతిక మందిలోని 9 మందిలో.. ఇద్దరు మహిళా మంత్రులు ఉన్నారా. లేదంటే.. కొత్తగా వీరిని కూడా యాడ్ చేస్తారా అనేది ఇంట్రస్టింగ్ టాపిక్ అయింది.

తిరుపతిలో ఇవాళ అమ్మవారి కటాక్షమే పార్టీలకు ఇంపార్టెంట్
3 minutes ago

షర్మిల ట్రయల్స్.. పార్టీ పెట్టకుండానే ఎన్నికల్లో పోటీకి రెడీ
an hour ago

వెంట వెంటనే ఎన్నికలు.. మంచికేనట
14 hours ago

లొంగిపోయిన కూన రవికుమార్
10 hours ago

రాళ్ల దాడి ఎవరి పనో అందరికీ తెలుసు.. చంద్రబాబు, లోకేష్ పై పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు
13 hours ago

షర్మిల ఉద్యోగ దీక్ష.. కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు
15 hours ago

తెలంగాణలో మరో ఎన్నికల సమరం..!
17 hours ago

ఏపీలో టెన్షన్ పెడుతున్న ఆ ఆరు జిల్లాలు.. ప్రత్యేక ఫోకస్
19 hours ago

బెంగాల్ ఎన్నికల ఫలితం ఎలావున్నా జాతీయ రాజకీయాలపై ప్రభావం తథ్యం
20 hours ago

కరోనా కేసుల అప్డేట్స్.. గత 24 గంటల్లో 2,00,739 మందికి కరోనా..!
a day ago
ఇంకా