ఏ క్షణంలో అయినా యుద్ధానికి సిద్ధంగా ఉండండి.. జిన్‌పింగ్ పిలుపు
06-01-202106-01-2021 16:02:35 IST
2021-01-06T10:32:35.193Z06-01-2021 2021-01-06T10:32:30.571Z - - 20-01-2021

తిరుగులేని అధికారాలు చేపట్టిన మరుక్షణం చైనా అధ్యక్షుడు యుద్ధానికి సిద్ధం కావలసిందిగా ప్రజావిముక్తి సైన్యాన్ని అప్రమత్తం చేశారు. ఏ సమయంలోనైనా సిద్ధంగా ఉండేందుకు వాస్తవమైన పోరాట వాతావరణంలో సైనిక శిక్షణను మొదలు పెట్టవలసిందిగా జిన్ పింగ్ చైనా సైన్యానికి ఆదేశాలు జారీ చేశారు. 2021లో కేంద్ర మిలిటరీ కమిషన్ తరపున తొలి ఆదేశంపై సంతకం చేసిన జిన్ పింగ్ గెలుపు సాధించే లక్ష్యంతోనే సైనిక శిక్షణను కఠినతరంగా అభ్యసించాలని సైన్యానికి పిలుపునిచ్చారు. ప్రజావిముక్తి సైన్యం ఏ క్షణంలోనైనా యుద్ధ సన్నాహకానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అదే సమయంలో ఫ్రంట్ లైన్లో ముందుండి పోరాడేవారు తగిన సాంకేతిక శిక్షణను కూడా అలవర్చుకోవాలని సూచించారు. సైన్యానికి ఇచ్చే అధునాతన సాంకేతిక శిక్షణలో కంప్యూటర్ సిమ్యులేషన్లు, ఆన్ లైన్ కంబాట్ పద్ధతులను చేర్చాలని, ఇంటర్నెట్ను విస్తృతంగా ఉపయోగించుకునేలా తాజా ఆవిష్కరణలను నేర్చుకోవాల్సి ఉందని జిన్ పింగ్ చెప్పారు. యుద్ధనైపుణ్య శిక్షణను బలోపేతం చేయడంతో పాటు ఎల్లప్పుడూ దేనికైనా సిద్ధంగా ఉండాలని చైనా మిలటరీకి జిన్‌పింగ్ పిలుపునిచ్చారు. ఈ ఏడాది నుంచి కొత్తగా తీసుకువచ్చిన డిఫెన్స్ చట్టం అమల్లోకి రావడంతో మిలటరీ అధికారాలు మరింతగా పెరగనున్నాయి. చైనా కమ్యూనిస్టు పార్టీకి, సెంట్రల్ మిలటరీ కమిషన్‌కు అధిపతైన జింగ్పింగ్ 2021లో పీఎల్ఏ, పీఎల్ఏఎఫ్కు సంబంధించిన నూతన చట్టంపై సంతకం చేశారు. ఈ చట్టం ప్రకారం ఆర్మీ ఇకపై సోషలిజంపై జింగ్పింగ్ ఆలోచనకు తగ్గట్లుగా నడుచుకోవడం, జింగ్పింగ్ ఆలోచనల ప్రకారం బలోపేతం కావడం చేయాల్సి ఉంటుంది. 2018లో ఇలాంటి ఆదేశాలనే జింగ్పింగ్ ఒకమారు జారీ చేశారు. తాజా ఆదేశాల ప్రకారం పీఎల్ఏ ఏ క్షణమైనా ఎలాంటి చర్యకైనా తయారుగా ఉండాలని సౌత్‌చైనా మార్నింగ్ పోస్టు పత్రిక తెలిపింది. ఆర్మీకి అవసరమైన కొత్త ఆయుధాలు సమకూర్చుకోవడం, మరింత మందిని నియమించి శిక్షణ ఇవ్వడం, డ్రిల్స్ మోతాదు పెంచడం, సదా సిద్ధంగా ఉండడమనేవి చేయాల్సిఉంటుందని తెలిపింది. గతేడాది జూన్‌లో భారత్ సరిహద్దుల్లో గల్వాన్ వ్యాలీలో చైనా సైన్యం చేదు అనుభవం ఎదుర్కొంది. ఇరు సైన్యాలకు మధ్య జరిగిన ఘర్షణలో చైనా సైనికులు అనేకమంది చనిపోయారు. భారత భూభాగంలోనికి చైనా సైన్యం చొచ్చుకురావడాన్ని నిలవరించేందుకు భారత సైనికులు వీరోచితంగా ఎదురొడ్డి పోరాడారు. భారత్‌తో సంబంధాలు బాగా క్షీణించిన నేపథ్యంలో జిన్ పింగ్ యుద్ధ పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వ్యాక్సిన్ తీసుకోడానికి భయపడకండంటున్న కేంద్రప్రభుత్వం
4 hours ago

సరిహద్దుల్లో ఏకంగా గ్రామాన్నే నిర్మించిన చైనా.. మోడీ ఏం చేస్తారో!
9 hours ago

హింస సమాధానం కానేకాదు.. మెలనియా ట్రంప్ వీడ్కోలు సందేశం
10 hours ago

రైతులతో చర్చలు జనవరి 20కి వాయిదా.. పంతం వద్దన్న తోమర్
12 hours ago

రామమందిర నిర్మాణానికి డిగ్గీ రాజా సంచనల విరాళం
13 hours ago

రిపబ్లిక్ డే పెరేడ్లో మొట్టమొదటి మహిళా పైలట్..
15 hours ago

రైతుల ట్రాక్టర్ ర్యాలీపై పోలీసులదే నిర్ణయం: సూచన
18 hours ago

ఘోర రోడ్డు ప్రమాదం.. 13 మంది మృతి..!
18 hours ago

1075 ఈ నెంబర్ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్
17 hours ago

అమెరికా ఆన్ 'హై అలర్ట్'
16 hours ago
ఇంకా