టీకా వద్దంటే తదుపరి చికిత్సకు డబ్బులు చెల్లించం..పంజాబ్ హెచ్చరిక
22-02-202122-02-2021 15:01:00 IST
2021-02-22T09:31:00.517Z22-02-2021 2021-02-22T09:30:58.336Z - - 04-03-2021

కోవిడ్-19 టీకాలు వద్దని ఆరోగ్య సంరక్షణ సిబ్బంది నిరాకరిస్తే అలాంటివారికి తర్వాత కరోనా వైరస్ సోకితే వారి చికిత్సకు అవసరమైన ఆర్దిక సహాయం అందించబోమని పంజాబ్ ప్రభుత్వం తీవ్రంగా హెచ్చరించింది. రాష్ట్రంలోని కొంతమంది ఆరోగ్య సంరక్షణ సిబ్బంది, ఇతర ఫ్రంట్లైన్ కార్యకర్తలు కోవిడ్-19 వ్యాక్సినేషన్ తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించింది.
ఇప్పుడు కోవిడ్-19 వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో ఆరోగ్య సిబ్బంది, ఫ్రంట్ లైన్ కార్యకర్తలు టీకాలు వేయించుకోవడానికి సుముఖత వ్యక్తం చేయకపోతే తర్వాత వీరిలో ఎవరైనా వైరస్ ప్రభావానికి గురయితే వారు క్వారంటైన్లో ఉండటానికి, గృహ ఏకాంతవాసపు లీవు తీసుకోవడానికి అనుమతించబోమని పంజాబ్ ప్రభుత్వం హెచ్చరిక చేసింది.
వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైన తర్వాత కూడా దేశంలోని కొన్ని రాష్టాల్లో మరోసారి కరోనా కేసులు పెరుగుతుడటం, పంజాబ్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ నత్తనడక నడుస్తుంటడం నేపధ్యంలో పంజాబ్ ప్రభుత్వం తీవ్ర నిర్ణయం తీసుకుంది.
పదే పదే అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ కోవిడ్-19కి వ్యతిరేకంగా రోగనిరోధక శక్తిని పెంచే టీకాలు తీసుకోవడానికి ఆరోగ్య శాఖ సిబ్బంది నిరాకరిస్తున్నారు. తర్వాత వీరిలో ఎవరికైనా కరోనా సోకితే చికిత్సకు అయ్యే ఖర్చులు మొత్తంగా వీరే భరించాల్సి ఉంటుందని పైగా ఇలాంటివారు క్వారంటైన్ లేదే ఐసోలేషన్ లీవులు పెట్టడానికి కూడా అనుమతించబోమని పంజాబ్ ఆరోగ్యశాఖ మంత్రి బల్బీర్ సిధ్దు హెచ్చరించారు.
ఈ విషయమై ఆదివారం మంత్రి ఒక ప్రకటన చేశారు. ఇటీవలి కాలంలో పంజాబ్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి ఫిబ్రవరి 20న ఒక్కరోజే రాష్ట్రంలో 358 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. పైగా పంజాబ్లో ఇప్పుడు 3 వేల యాక్టివ్ కేసులు ఉన్నాయని మూడువారాల్లో కరోనా కేసులు 33 శాతం పెరగడం ఆందోళన కలిగిస్తోందని మంత్రి చెప్పారు.
అందుకే ఎలాంటి అనూహ్య పరిస్థితినైనా సరే ఎదుర్కోవడానకి ఆరోగ్య సిబ్బంది, ఇతర ఫ్రంట్ లైన్ కార్యకర్తలు తప్పనిసిరిగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. దేశంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న ఆరు రాష్ట్రాల్లో పంజాబ్ ఒకటి. సెకండ్ వేవ్ వంటి పరిస్తితిని ఎదుర్కొవడానికి మనందరం సిద్దంగా ఉండాలని ఆరో్గ్య మంత్రి పేర్కొన్నారు.
పంజాబ్లో కరోనా కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉందని అందుకే రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా భౌతిక దూరం పాటిస్తూ మాస్క్ ధరిస్తూ, చేతులు శుభ్రపర్చుకుంటూ గరిష్టంగా జాగ్రత్తలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రి హెచ్చరించారు.
రోజుకు 6 వేల కరోనా కేసులు.. మహారాష్ట్రలో తిరిగి లాక్డౌన్

ప్రభుత్వంపై భిన్నాభిప్రాయం ప్రకటించడం దేశద్రోహం కాదు.. సుప్రీంకోర్టు
3 hours ago

కరోనా టీకాపై ఆంక్షల తొలగింపు.. ఇకపై 24 గంటలూ టీకా
4 hours ago

ప్రాంతీయ భాషల్ని విస్మరిస్తే దేశానికి పెద్ద అన్యాయం.. ప్రధాని మోదీ
5 hours ago

కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న నిర్మలా సీతారామన్
5 hours ago

తాజ్ మహల్ లో బాంబు పెట్టాను.. ఇంకొద్ది సేపట్లో..!
7 hours ago

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 17,407 మందికి కరోనా..!
8 hours ago

ఫ్రెంచ్ యువతిని రేప్ చేసిన ఢిల్లీ మహిళ.. కేసు నమోదు
8 hours ago

రాసలీలల మంత్రిగారు.. రాజీనామా చేసేశారు
03-03-2021

హెచ్-1బీ వీసా ట్విస్ట్ ఇచ్చిన అమెరికా..!
03-03-2021

కరోనా కేసుల అప్డేట్.. గత 24 గంటల్లో 14,989 మందికి కరోనా..!
03-03-2021
ఇంకా