newssting
Radio
BITING NEWS :
హైదరాబాద్ వాసులను వెంటాడుతున్న వరద భయం. రానున్న మూడ్రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం. ఏ క్షణాన వరద ముంచెత్తుతుందోనని కంటిమీద కునుకులేకుండా బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న లోతట్టు ప్రాంతాల ప్రజలు. * హైదరాబాద్ ను ఆదుకునేందుకు కదిలిన టాలీవుడ్ తారాగణం. సీఎం రిలీఫ్ ఫండ్ కు చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ కోటి రూపాయల విరాళం. చెరో 50 లక్షలు ఇచ్చిన ఎన్టీఆర్, రామ్ చరణ్. * విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఘనంగా పోలీస్ సంస్మరణ దినోత్సవ వేడుకలు. కరోనాతో మృతి చెందిన పోలీసుల కుటుంబాలకు రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా ప్రకటించిన సీఎం. పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం వైసీపీనే అన్న మంత్రి సుచరిత. * ఏపీ - తెలంగాణ ప్రభుత్వాల మధ్య ఇంకా కుదరని ఆర్టీసీ ఒప్పందం. ప్రభుత్వాల మొండి వైఖరితో ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు. ఆర్టీసీ అలసత్వాన్ని క్యాష్ చేసుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్. ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచిన ప్రైవేట్ బస్సులు. ప్రతి ఏటా ఆర్టీసీకి లాభాలు తెచ్చిపెడుతున్న దసరా. * స్కందమాతగా దర్శనమిస్తోన్న బాసర సరస్వతీ దేవి. * పూర్తిగా నిండిన గండిపేట చెరువు. ఏ క్షణంలోనైనా గేట్లు ఎత్తి నీరు విడుదల చేసే అవకాశం. లోతట్టుప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు.

భారత్‌లో తైవాన్ నేషనల్ డే ట్రెండింగ్.. నెటిజన్ల శుభాకాంక్షలు

11-10-202011-10-2020 12:25:48 IST
2020-10-11T06:55:48.880Z11-10-2020 2020-10-11T06:55:46.265Z - - 21-10-2020

భారత్‌లో తైవాన్ నేషనల్ డే ట్రెండింగ్.. నెటిజన్ల శుభాకాంక్షలు
facebooktwitterGooglewhatsappwhatsappGoogle
తైవాన్ జాతీయ దినోత్సవం సందర్భంగా భారత నెటిజన్ల నుంచి తైవాన్‌ పౌరులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు బీజేపీ నేతలు, జర్నలిస్టులు తైవాన్ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌ వెన్‌‌ని, తైవాన్‌ ప్రభుత్వాన్ని అభినందిస్తూ సోషల్‌ మీడియా వేదికగా విషెస్‌ చెబుతున్నారు. ఈ క్రమంలో శనివారం నాటి టాప్‌ ట్రెండ్స్‌లో #TaiwanNationalDay ఒకటిగా నిలిచింది. 

ఈ విషయంపై స్పందించిన జర్నలిస్టు అభిజిత్‌ ముజుందార్‌.. ‘‘అద్భుతం.. TaiwanNationalDay ఇండియాలో ట్రెండింగ్‌లో ఉంది. చైనా ఇప్పటికీ తైవాన్‌ పట్ల అలాగే వ్యవహరిస్తే మిత్ర దేశాలకు దూరం కావాల్సి వస్తుంది’’ అని హాంకాంగ్, తైవాన్‌, టిబెట్‌ వైఖరిపై చైనా తీరును ఎండగట్టారు. ఇక మరికొంత మంది త్వరలోనే ప్రపంచ దేశాలన్నీ తైవాన్‌కు మద్దతు ప్రకటించి, అధికారిక దౌత్య సంబంధాలు ఏర్పరచుకుంటాయని అభిప్రాయపడ్డారు.

చైనాతో చర్చలకు ఇప్పటికీ సిద్ధమే.. త్సాయి ఇంగ్ వెన్

బీజింగ్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ చైనాతో చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తైవాన్‌ అధ్యక్షురాలు త్సాయి ఇంగ్‌-వెన్‌ ప్రకటించారు. దక్షిణ చైనా సముద్ర జలాలు, హాంకాంగ్‌ విషయంలో డ్రాగన్‌ అనుసరిస్తున్న వైఖరిపై విమర్శలు, భారత్‌- చైనా బార్డర్‌లో ఉద్రిక్త పరిస్థితులు వంటి అతిపెద్ద సవాళ్లను చైనా ఎదుర్కొంటోందన్న ఆమె, తమతో శాంతి చర్చల ద్వారా మెయిన్‌లాండ్‌లోని సమస్యలను ముందుగా పరిష్కరించుకోవాలని సూచించారు. 

యుద్ధ వాతావరణాన్ని తొలగించే దిశగా డ్రాగన్‌ అడుగులు వేస్తే, తాము ఇందుకు పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. అయితే అదే సమయంలో, తమ సార్వభౌమత్వాన్ని కాపాడుకునేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని, ప్రజాస్వామ్య విలువలకే కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు. 

తైవాన్‌ నేషనల్‌ డే సందర్భంగా శనివారం ప్రజలను ఉద్దేశించి మాట్లాడిన త్సాయి ఈ మేరకు మీడియా ముఖంగా చైనాకు తమ వైఖరిని తెలియజేశారు. అదే విధంగా కరోనాను కట్టడి చేయడంలో తాము సఫలమయ్యామని, దేశాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు తనవంతు కృషి​ చేస్తానని చెప్పుకొచ్చారు.

కాగా 2016లో తొలిసారిగా అధికారం చేపట్టిన నాటి నుంచి చైనాతో చర్చలకు త్సాయి, పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ డ్రాగన్‌ నుంచి ఎటువంటి స్పందన రాలేదు. తైవాన్‌ తమలో అంతర్భాగమేనని చైనా పునరుద్ఘాటిస్తోంది. అదే విధంగా తమకు వ్యతిరేకంగా తైవాన్‌కు మద్దతు తెలుపుతున్న అమెరికా సహా యూరప్‌ దేశాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. 

 


NewsSting Team


      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle