newssting
Radio
BITING NEWS :
ఈరోజు ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవం * కేంద్ర మంత్రివర్గంలో పునర్వ్యవస్థీకరణ గురించి పలు ఊహాగానాల మధ్య ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం హోంమంత్రి అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జె పి నడ్డాతో చర్చలు జరిపారు * బెంగాల్, తమిళనాడులలో ఇటీవల సాధించిన విజయాలతో పోల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ ముంబైలో భోజనం కోసం మహారాష్ట్ర రాజకీయ నాయకుడు శరద్ పవార్‌తో సమావేశమయ్యారు * దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 84,332 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది * దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,93,59,155కి చేరింది. గత 24 గంటల్లో కరోనా బారినపడి 4002 మంది మరణించారు * కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు అన్నదాతలు అనేక ఇబ్బందులు పడుతున్నా సీఎం కేసీఆర్‌ పట్టించుకోవట్లేదని దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి తనయ వైఎస్‌ షర్మిల విమర్శించారు * రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం, పోలీసు శాఖ చేపడుతున్న చర్యలు అభినందనీయమని నోబెల్‌ బహుమతి గ్రహీత, బాలల హక్కుల ఉద్యమకారుడు కైలాష్‌ సత్యార్థి ప్రశంసించారు.

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్

13-05-202113-05-2021 11:09:26 IST
2021-05-13T05:39:26.094Z13-05-2021 2021-05-13T02:50:14.153Z - - 14-06-2021

టెన్షన్ పెడుతున్న బ్లాక్ ఫంగస్
facebooktwitterGooglewhatsappwhatsappGoogle

భారతదేశంలో కరోనా వైరస్ ఓ వైపు టెన్షన్ పెడుతూ ఉంటే... మరో వైపు బ్లాక్ ఫంగస్ కేసులు అంతకు మించి టెన్షన్ పెడుతూ ఉన్నాయి. మహారాష్ట్రలో బ్లాక్ ఫంగస్ కేసులు కూడా భారీగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు 2 వేలకు పైగా బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయని మహారాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది.  బ్లాక్ ఫంగస్ బారిన పడిన వారిలో 50 శాతం మంది ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. బ్లాక్ ఫంగస్ బాధితులు పెద్ద సంఖ్యలో ఆసుపత్రులకు వస్తుండటంతో, మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఉన్న ఆసుపత్రులను బ్లాక్ ఫంగస్ చికిత్స కేంద్రాలుగా మార్చారు. బ్లాక్ ఫంగస్ చికిత్స ఖర్చుతో కూడుకున్నదని అయితే వీలైనంత తక్కువ ఖర్చుతో వైద్యం అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామని మహారాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మహాత్మా పూలే జన్ ఆరోగ్య యోజన కింద చికిత్స అందిస్తున్నట్టు తెలిపారు. ఈ వ్యాధి చికిత్స కోసం ఆంఫోటెర్సిన్-బీ ఇంజెక్షన్లు అవసరమవుతాయని, ముందు జాగ్రత్త చర్యలో భాగంగా లక్ష ఇంజెక్షన్ల కోసం టెండర్లను పిలిపించింది మహా ప్రభుత్వం. 

మహారాష్ట్ర, గుజరాత్​ వంటి రాష్ట్రాల్లో కోవిడ్–19 నుంచి కోలుకున్న వారిలో ముకోర్మైకోసస్ అని పిలిచే బ్లాక్​ ఫంగస్ ఇన్​ఫెక్షన్​ కేసులు పెరుగుతున్నాయి. కరోనా నుంచి కోలుకున్న కొంతమంది ఈ ఫంగస్​ దెబ్బకు కంటి చూపును సైతం కోల్పోతున్నారు. గత 15 రోజుల్లో సూరత్​లో 40 మందికి ఈ వ్యాధి సోకగా 8 మందికి కంటి చూపు కోల్పోయారు.​ ఇది అరుదైన ఫంగల్ ఇన్ఫెక్షన్ అని, దీని మరణాల రేటు 50% కంటే ఎక్కువగా ఉంటుందని వైద్యులు అంటున్నారు.

కరోనా సోకిన వారిలో, ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో, బలహీనమైన రోగనిరోధక శక్తి ఉన్నవారికి ఈ వ్యాధి సోకే అవకాశం ఉంది. తడి ఉపరితలాల నుంచి ఎక్కువగా సోకుతుందని వైద్యులు చెబుతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారికి రెండు మూడ్రోజుల్లో బ్లాక్​ ఫంగస్​ లక్షణాలు కనిపిస్తున్నాయి. తొలుత సైనస్​లో చేరి తర్వాత కండ్లపై ఇది దాడి చేస్తుంది. తర్వాత 24 గంటల్లో బ్రెయిన్​ వరకు వెళ్తుంది. ఆ తర్వాత బ్రెయిన్​ డెడ్​ అయి చనిపోయే ప్రమాదం ఉంది. ఈ వ్యాధి సోకిన వారిలో ముఖం వాపు, తలనొప్పి, జ్వరం, కళ్ల వాపు, అవయవాల్లో నల్లటి మచ్చలు, ముక్కు ఒక వైపు మూసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. బ్లాక్​ ఫంగస్​ ఒకరి నుంచి మరొకరికి వ్యాపించదు.. దీన్ని ముందే గుర్తించి యాంటీ ఫంగల్ ట్రీట్​మెంట్​ చేస్తే ప్రాణాలు కాపాడవచ్చు. సమస్య తీవ్రంగా ఉన్న వారిలో యాఫోటెరిసన్​ ‘బీ’ వంటి యాంటీ ఫంగల్​ ఇంజెక్షన్లను ఇచ్చి ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు. ఒక రోగికి సాధారణంగా 21 రోజుల పాటు ఇంజెక్షన్ ఇవ్వాలి. ఈ ఇంజెక్షన్​ కోసం రోజు సుమారు రూ. 9,000 ఖర్చు చేయాల్సి ఉంటుంది.

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

బంపర్ ఆఫర్.. ఒక్క రూపాయికే లీటర్ పెట్రోలు..

   4 hours ago


బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

బాల కార్మికులకు వ్యతిరేకంగా ప్రపంచ దినం: అలీఘర్ పిల్లలకు విడుదల ఎప్పుడు ?

   19 hours ago


దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

దేశ రాజధానిలో లాక్ డౌన్ ఆంక్షలు సడలింపు

   13-06-2021


ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

ఉత్తర ప్రదేశ్ మూడు ముక్కలు కానుందా..?

   13-06-2021


కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

కరోనా ఔషధాలు, వైద్య పరికరాలకి భారీగా జీఎస్టీ తగ్గింపు

   13-06-2021


గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

గత 24 గంటల్లో ఇండియాలో 84,332 కోవిడ్ కేసులు..

   13-06-2021


కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో సహాయం చేసిన దేశాలకు ధన్యవాదాలు G7 సమ్మిట్ లో PM మోడీ

   13-06-2021


జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి..  ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

జమ్మూ కాశ్మీర్‌లో ఉగ్రవాద దాడి.. ఇద్దరు పోలీసులు, ఒక పౌరుడు మరణించారు

   12-06-2021


జూన్ 26 న  రాజ్ భవన్ వద్ద  రైతుల నిరసన

జూన్ 26 న రాజ్ భవన్ వద్ద రైతుల నిరసన

   12-06-2021


కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

కోవాక్సిన్‌కు అత్యవసర ఆమోదాన్ని అమెరికా నిరాకరించడం వలన మన టీకా కార్యక్రమంపై ఎలాంటి ప్రభావం ఉండదు: ప్రభుత్వం

   12-06-2021


ఇంకా

Naresh


 newsstingcontent@gmail.com
      040 23600300

newsting
Daily Updates
facebooktwitterGooglewhatsappwhatsappGoogle